Gul Panag : నాఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే!
ABN , Publish Date - Dec 18 , 2023 | 04:14 AM
బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్న హీరోయిన్లలో గుల్ పనాగ్ ఒకరు. గత 30 ఏళ్ల నుంచి తన ఫిట్‌నెస్ ట్రైనింగ్ ఒకేలా ఉందనే గుల్ పనాగ్ తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.
బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్న హీరోయిన్లలో గుల్ పనాగ్ ఒకరు. గత 30 ఏళ్ల నుంచి తన ఫిట్‌నెస్ ట్రైనింగ్ ఒకేలా ఉందనే గుల్ పనాగ్ తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.
నడక తప్పనిసరి
‘‘ప్రతి రోజు కనీసం పదివేల అడుగులు తప్పనిపరి. సాధారణంగా ఉదయం లేదా సాయంత్రం మా ఇంటి దగ్గరలో ఉన్న పార్కులో నడుస్తాను. దీని వల్ల శరీరానికి అదనపు ఆక్సిజన్ దొరుకుతుంది. ఇక ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను ఒకే చోట కూర్చోను. ప్రతి గంటకు లేచి నడుస్తూ ఉంటా. దీని వల్ల నా శరీరానికి తగినంత వ్యాయామం లభిస్తుంది. చాలా సందర్భాలలో నేను ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు అటూ ఇటూ నడుస్తూ ఉంటా. దీని వల్ల కొంత వ్యాయామం చేసినట్లు అవుతుంది. నా పనీ పూర్తవుతుంది.
పౌష్టికాహారం
సరైన ఆహారం తీసుకోకుండా వ్యాయామం చేయలేం. వ్యాయామం చేయాలంటే తగినంత పౌష్టికాహారం తినాలి. అయితే మన శరీరానికి ఎంత అవసరమో అంతే తినాలి. లేకపోతే సమతౌల్యత దెబ్బతింటుంది. సమతౌల్యమైన ఆహారం ఎందుకు తినాలంటే..
వర్క్‌అవుట్‌లు చేసేముందు
వర్క్‌అవుట్‌లు చేసినప్పుడు శరీరానికి శక్తి అవసరమవుతుంది. కార్బోహైడేట్స్, ప్రొటీన్లు, కొవ్వు- మొదలైనవన్నీ మన కండరాలు శక్తిమంతంగా ఉండటంలో కీలకమైన పాత్ర పోషిస్తాయి.
ప్రొటీన్లు..మినరల్స్
మన రోగనిరోధక శక్తి పెరగాలన్నా.. మన శరీరంలో అవయవాలు సరిగ్గా పనిచేయాలన్నా- ప్రొటీన్లు, మినరల్స్ తప్పనిసరి. ఇవి లేకపోతే మనకు సరైన రోగనిరోధక శక్తి పెంపొందదు. అందువల్ల తప్పనిసరిగా ప్రొటీన్లు.. మినరల్స్ తీసుకోవాలి.
హారోన్ల కోసం..
మన శరీరంలో ఇన్సులిన్ వంటి హార్మోన్లు సక్రమంగా విడుదల కావాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. మన శరీరంలోని అవయవాలు సరిగ్గా పనిచేయాలంటే హార్మోన్లు కీలకం.
ఆకలి భావన లేకుండా..
మనం సరైన ఆహారాన్ని తిన్నప్పుడు - ఆకలి వేయదు. లేకపోతే తరచూ ఆకలి వేస్తూ ఉంటుంది. అందువల్ల తగినంత ఆహారం తినటం కూడా ముఖ్యమే!