Bathukamma Samburams : నేడు ఎంగిలిపూల బతుకమ్మ
ABN , First Publish Date - 2023-10-14T00:16:37+05:30 IST
బతుకమ్మ సంబురాలకు శ్రీకారం ప్రకృతితో మమేకమయ్యే గ్రామీణ జీవనానికి ప్రతీక బతుకమ్మ పండుగ. రోజుకో రీతిలో పూలను పేర్చి, ఆట పాటలతో అమ్మను
బతుకమ్మ సంబురాలకు శ్రీకారం
ప్రకృతితో మమేకమయ్యే గ్రామీణ జీవనానికి ప్రతీక బతుకమ్మ పండుగ. రోజుకో రీతిలో పూలను పేర్చి, ఆట పాటలతో అమ్మను కొలిచే ఈ పండుగకు తెలంగాణ యావత్తూ పూల వనంలా మారిపోతుంది. ప్రతి సంవత్సరం భాద్రపద అమావాస్య రోజున బతుకమ్మ వేడుకలు మొదలవుతాయి. మహాలయ అమావాస్యగా, పితృ అమావాస్యగా పేర్కొనే ఈ రోజును తెలంగాణలో ‘పెత్రామస’ అని వ్యవహరిస్తారు. బతుకునిచ్చే తల్లిగా గౌరీ దేవిని ‘బతుకమ్మ’ పేరుతో ఆరాధిస్తారు. ముందు రోజే పూలను కోసి తెచ్చి, నీళ్ళలో వేస్తారు. మరుసటి రోజు వాటితో బతుకమ్మను అలంకరిస్తారు. అందుకే... తొలి రోజు బతుకమ్మను ‘ఎంగిలిపూల బతుకమ్మ’ అంటారు. పూలతో చక్కగా బతుకమ్మను పేర్చి, తమలపాకులు ఉంచి, పసుపుతో తయారు చేసిన బతుకమ్మను దానిపై పెట్టి పూజలు చేస్తారు. తొమ్మిది రోజులు సాగే ఈ వేడుకల్లో రకరకాల ప్రసాదాలను బతుకమ్మకు నివేదిస్తారు.
నేటి నైవేద్యం: నువ్వులు, బియ్యం పిండి, నూకలు లేదా బియ్యం, బెల్లం