NRI: అమెరికా ప్రొఫెసర్లకు బెదిరింపులు.. భారత సంతతి వ్యక్తి అరెస్ట్
ABN , First Publish Date - 2023-03-14T20:34:10+05:30 IST
అమెరికా ప్రొఫెసర్లను బెదిరించాడన్న ఆరోపణలపై అమెరికాలో ఓ భారతీయ సంతతి వ్యక్తిని పోలీసులు అరెస్టు తాజాగా చేశారు.
ఎన్నారై డెస్క్: అమెరికా ప్రొఫెసర్లను బెదిరించాడన్న(Threatening) ఆరోపణలపై అమెరికాలో ఓ భారతీయ సంతతి వ్యక్తిని(Indian Origin) పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. గతంలో తాను చదువుకున్న యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మాడిసన్‌లోని(University of Wisconsin Madison) పలువురు ప్రొఫెసర్లతో సహా మొత్తం తొమ్మిది మందిని బెదిరిస్తూ ఈమెయిల్ పంపినట్టు ఆర్వింద్ మాథుర్ రాజ్‌పై(32) అభియోగాలను మోపారు. శుక్రవారం పోలీసులు నిందితుడిని డెట్రాయిట్‌లో అదుపులోకి తీసుకున్నారు. డెన్మార్క్‌లోని కోపెన్‌హేగన్ నగరం నుంచి డెట్రాయిట్‌కు వచ్చిన అతడిని ఎయిర్‌పోర్టులోనే అరెస్ట్(Arrest) చేశారు.
కాగా.. మీ పిల్లల మాంసాన్ని బర్గర్‌లో దాస్తా అంటూ నిందితుడు ఇద్దరు ప్రొఫెసర్లకు ఈమెయిల్ పంపినట్టు సమాచారం. విదేశాల నుంచే ఈ ఈమెయిల్స్ వచ్చినట్టు దర్యాప్తులో తెలిసింది. ఇదిలా ఉంటే.. యూనివర్సిటీ రికార్డుల్లోని మాథుర్ ఈమెయిల్ అడ్రస్, బెదిరింపులకు వాడిన ఈమెయిల్ ఒకటేనని పోలీసులు తేల్చారు. ఆంత్రొపాలజీ విభాగంలోని ఓ ప్రొఫెసర్‌కు పంపిన ఈ మెయిల్ అతడు మిగతా ఇద్దరు ప్రొఫెసర్లను బెదిరించినట్టు వెల్లడించారు. అతడి బెదిరింపులతో ఆందోళన చెందిన ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మాథుర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఈ ఆరోపణలపై ఇప్పుడే స్పందించడం కుదరదని మాథుర్ తరఫు లాయర్ తెలిపారు. దర్యాప్తులో భాగంగా భవిష్యత్తులో బయటపడే అంశాలను బట్టి స్పందిస్తామన్నారు.