NATS: నాట్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సేల్స్ ఫోర్స్ అడ్మిన్ శిక్షణ

ABN , First Publish Date - 2023-04-18T11:15:53+05:30 IST

నాట్స్ స్టూడెంట్ కెరీర్ డెవలప్ మెంట్ ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగిన సేల్స్ ఫోర్స్ అడ్మిన్ శిక్షణ తరగతులకు విద్యార్థుల నుండి మంచి స్పందన రావటమేకాక, శిక్షణ తరగతులు చాలా చక్కగా జరిగాయి.

 NATS: నాట్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సేల్స్ ఫోర్స్ అడ్మిన్ శిక్షణ

నాట్స్ స్టూడెంట్ కెరీర్ డెవలప్ మెంట్ ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగిన సేల్స్ ఫోర్స్ అడ్మిన్ శిక్షణ తరగతులకు విద్యార్థుల నుండి మంచి స్పందన రావటమేకాక, శిక్షణ తరగతులు చాలా చక్కగా జరిగాయి. ఈ శిక్షణ తరగతులను మంచి అనుభవం ఉన్న సీనియర్ సేల్స్ ఫోర్స్ ఆర్కిటెక్ట్స్ అడీల్ అబ్బాసీ, కృష్ణ తుమ్మలపల్లిల ఆధ్వర్యంలో జరిగాయి.

ఈ శిక్షణ ద్వారా అనేక మంది విద్యార్థులు, కెరీర్ మార్చుకోవాలనుకునే వృత్తి నిపుణులు ప్రయోజనం పొందారు. అంతేకాక, ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా వచ్చిన $2,600 మొత్తాన్ని "నాట్స్ స్టూడెంట్ స్కాలర్షిప్ ప్రోగ్రాం"కు అందిస్తామని నాట్స్ అధ్యక్షులు బాపు నూతి ఈ సందర్భంగా తెలియజేసారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలైన శ్రీధర్ న్యాలమడుగుల, డీవీ ప్రసాద్, రాజేష్ కాండ్రు, శ్రీనివాస్ చిలుకూరి, రామకృష్ణ బాలినేని, రంజిత్ చాగంటి, హరినాథ్ బుంగతావులను ప్రత్యేకంగా అభినందించారు.

2.jpg

నాట్స్ స్టూడెంట్ కెరీర్ డెవలప్ మెంట్ ఫోరమ్ ద్వారా ప్రతి త్రైమాసికంలో ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మీద.. ముఖ్యంగా విద్యార్థుల కెరీర్‌కు ఉపయోగపడే విధంగా నూతన టెక్నాలజీస్ మీద శిక్షణా తరగతులను, కెరీర్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలను రూపొందిస్తామని నాట్స్ అధ్యక్షులు బాపు నూతి తెలిపారు. ఈ సందర్భంగా ఎవరైనా "నాట్స్ స్టూడెంట్ స్కాలర్షిప్ ప్రోగ్రాం" లో పాలుపంచుకోవాలనుకొనే దాతలు క్రింద ఇచ్చిన నాట్స్ వెబ్ సైట్ లింక్ ద్వారా విరాళాలు ఆందించవచ్చు. https://www.natsworld.org/nats-global/donate-now?ServiceId=179

ఇలాంటి మంచి కార్యక్రమాన్ని రూపకల్పన చేసి, గత ఐదు వారాలుగా విజయవంతంగా నిర్వహించిన కార్యకర్తలకు నాట్స్ చైర్ వుమన్ అరుణ గంటి గారు ప్రత్యేక అభినందనలు తెలియ చేశారు.

Updated Date - 2023-04-18T11:17:12+05:30 IST