USA: కోడిపుంజుపై ఓ మాతృమూర్తి ప్రతీకారం.. ప్రేమగా పెంచుకుంటే ఇలా చేస్తావా అంటూ..
ABN , First Publish Date - 2023-01-21T19:50:22+05:30 IST
అమెరికాకు చెందిన ఓ మహిళ మాత్రం తన పెంపుడు కోడిపుంజుపై ప్రతీకారం తీర్చుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: మనలో చాలా మంది పెంపుడు జంతువులను కుటుంబసభ్యులుగానే చూస్తుంటాం. వాటితో ఉండే మానసిక బంధం అలాంటిది. కానీ.. ఓ అమెరికా మహిళ(USA Woman) మాత్రం తన పెంపుడు కోడిపుంజుపై(Pet Rooster) ప్రతీకారం తీర్చుకుంది. ఇంతకాలం పాటు ప్రేమగా పెంచుకున్న తన కోడిని ఇటీవల నిర్దాక్షిణ్యంగా చంపి వండుకుని తినేసింది. అంతేకాకుండా.. ‘‘చికెన్ నగ్గెట్స్(Chicken Nuggets) చేశాను చూడండి’’ అంటూ ఈ ఉదంతం గురించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మిసిసిపీ(Missippi) రాష్ట్రానికి చెందిన మేగన్ ష్మిడ్ ఓ కూతురు ఉంది. మేగన్ ఓ పుంజును కూడా పెంచుకుంటున్నారు. దాని పేరు హెయిహెయి. ఇటీవల ఓ రోజు ఆ కోడితో చిన్నారిని బుగ్గపై పొడవడంతో చిన్న గాయమైంది. తన కూతురిపై పుంజు దాడి చేయడంతో మేగన్ అగ్గిమీద గుగ్గిలమైంది. అదృష్టం బాగుండబట్టి సరిపోయింది కానీ.. లేకపోతే తన కూతురి కన్నే పోయి ఉండేదని ఆమె తల్లడిల్లిపోయింది. కోడిపై కోపంతో ఊగిపోయిన ఆమె చివరకు దానిపై ప్రతీకారం తీర్చుకుంది. ఇటీవల ఓ రోజు దాన్ని చంపేసి చికెన్ నగ్గేట్స్ చేసేసింది. అక్కడితో ఆగక.. వాటి ఫొటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేసి జరిగిన ఘటన గురించి నెటిజన్లతో పంచుకుంది. అయితే.. నెటిజన్లు మాత్రం ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఓ తల్లిగా నీ బాధ్యత సరిగ్గా నిర్వర్తించకపోగా పెంపుడు కోడిని చంపావు అంటూ కొందరు ఆమెను విమర్శించారు. కన్నబిడ్డ విషయంలో ఏ తల్లీ అయినా ఇలాగే చేస్తుందంటూ మరికొందరు ఆమెకు మద్దతుగా నిలిచారు.