America: అమెరికాలోని ప్రవాసులకు బిగ్ షాక్.. న్యూయార్క్‌‌లో పరిస్థితి మరీ ఇంత దారుణంగా ఉందా..?

ABN , First Publish Date - 2023-10-07T16:37:34+05:30 IST

న్యూయార్క్ నగరానికి పోటెత్తుతున్న వలసదారులతో అక్కడి ప్రభుత్వాని ఊహించని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వారికి ఆశ్రయం కల్పించేందుకు అవసరమైన నివాససముదాయాలు అందుబాటులో లేక పరిస్థితి సంక్షోభానికి దారితీస్తోంది. శరణార్థులను ఆదుకోవడం స్థానిక ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారుతోంది. శరణార్థుల అమెరికా కలను ఈ పరిస్థితులు చిదిమేస్తున్నాయి.

America: అమెరికాలోని ప్రవాసులకు బిగ్ షాక్.. న్యూయార్క్‌‌లో పరిస్థితి మరీ ఇంత దారుణంగా ఉందా..?

ఎన్నారై డెస్క్: అమెరికా అంటే అవకాశాల స్వర్గధామం. విదేశీయులను అక్కున చేర్చుకుని అభివృద్ధి బాటలు పరిచే ఏకైక దేశం.. ప్రపంచంలోని పేదదేశాల ప్రజల మనసుల్లో గూడుకట్టుకున్న అభిప్రాయం ఇది. అందుకే తమ దేశాల్లో దొరకని అవకాశాలను వెతుక్కుంటూ ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, ప్రాణపాయాన్ని సైతం లెక్కచేయకుండా అనేక మంది అమెరికాలో కాలుపెడుతుంటారు. తాము కష్టాలు పడ్డా కనీసం తమ బిడ్డలకై బంగరు భవిష్యత్తు దొరుకుతుందని అమెరికా బాట పడతారు. కానీ, ఈ అమెరికా కల(American Dream) రానురాను ఓ పీడకలగా మారిపోతోంది. అమెరికా ప్రభుత్వాలకు కూడా చిక్కులు తెచ్చిపెడుతోంది. ఇందుకు తాజాగా ఉదాహరణే న్యూయార్క్ నగరం(Newyork city).

న్యూయార్క్ నగరం ప్రస్తుతం ఓ మానవ సంక్షోభాన్ని(Humanitarian crisis) ఎదుర్కుంటోందని ఇటీవల నగర మేయర్ సంచలన ప్రకటన చేశారు. ఇది యావత్ నగరాన్ని నాశనం చేయచ్చని హెచ్చరించారు. దీనికి ప్రధాన కారణం..వలసదారులు(Immigrants). గతేడాది న్యూయార్క్ నగరానికి ఏకంగా 1.18 లక్షల మంది విదేశీయులు తరలి వచ్చారు. వీరిలో దాదాపు 60 వేల మంది నగరంలోని శరణార్థుల శిబిరాల్లోనే ఆశ్రయం పొందారు. వీరి బాగోగులు చూడటం ప్రస్తుతం స్థానిక ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది.

NRI Family: అమెరికాలో ఈ ఎన్నారై ఫ్యామిలీకి ఏమైంది..? ఇంత హ్యాపీగా కనిపిస్తున్న వీళ్లంతా తెల్లారేసరికి నిర్జీవంగా..!


శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు నివాససముదాయల కొరత(Housing Crisis) తీవ్రంగా పెరిగిపోవడంతో వీళ్లందరినీ ఎలా సంరక్షించాలో అర్థంకాక అక్కడి అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

దక్షిణ అమెరికా, పశ్చిమ ఆఫ్రీకా దేశాల నుంచి శరణార్థులు న్యూయార్క్ పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వారికి ఆశ్రయం కల్పించడం పెద్ద సమస్యగా మారింది. అక్కడి ప్రజాజీవితంలో ఎలా ఇమిడిపోవాలో అటు శరణార్థులకూ అర్థం కావట్లేదు.

ప్రస్తుతం ఇలా తరలి వచ్చిన విదేశీయులందరికీ నగరంలోని హోటళ్లు, కార్యాలయాలు, స్కూలు జిమ్స్, ఇతర మైదానాల్లో తాత్కాలిక నివాస ఏర్పాట్లు చేసి ఆశ్రయం కల్పిస్తున్నారు. ఇందుకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తోంది. రాబోయే మూడేళ్లల్లో ఈ ఖర్చు 12 బిలియన్ డాలర్లకు చేరొచ్చని(Financial burden) మేయర్ ఆడమ్స్ హెచ్చరించారు. గతంలో ఆయన శరణార్థులకు పార్కింగ్ స్థలాలూ , క్రూయిజ్ షిప్పుల్లో కూడా ఆశ్రయం కల్పించే యోచన చేశారు.

NRI Husband: నా భర్తను ఎవరో చంపేశారంటూ పొద్దున్నే గగ్గోలు పెట్టిన భార్య.. మేడ మీద పడుకున్న వాళ్లంతా కిందకు దిగి చూస్తే..!


అయితే, పరిస్థితులు సంక్షోభ స్థితికి చేరుకోవడానికి అధ్యక్షుడు బైడెన్ విధానాలే కారణమని స్థానిక ప్రభుత్వం ఆరోపించింది. శరణార్థుల సమస్య పరిష్కారానికి తగినన్ని నిధులు కేంద్రం మంజూరు చేయట్లేదని మేయర్, రాష్ట్ర గవర్నర్ ఆరోపించారు.

నగర ప్రజలు కూడా ఈ సంక్షోభంపై పూర్తి అవగాహన ఉంది. నానాటికీ దిగజారుతున్న పరిస్థితులపై వారూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు మానవతా దృక్పథంతో పరిష్కారం కనిపెట్టాలని సూచిస్తున్నారు. ఒకప్పటి అమెరికా కల ఇప్పుడు పీడకలగా మారిందని అనేక మంది విచారం వ్యక్తం చేశారు. శరణార్థులు ఎదుర్కొంటున్న కష్టాలు తమను కలిచివేస్తున్నాయని మరి కొందరు వ్యాఖ్యానించారు. న్యూయార్క్‌లో ఇప్పటికీ కొన్ని స్థలాలు, భవంతులు అందుబాటులో ఉన్నాయని, వాటితో సమస్యను కొంత వరకూ పరిష్కరించవచ్చని నగర ప్రజలు చెబుతున్నారు.

Updated Date - 2023-10-07T16:42:28+05:30 IST