NRI: ఎన్నారైలు ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేయొచ్చా..అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయి..?

ABN , First Publish Date - 2023-03-24T18:45:42+05:30 IST

ఎన్నారైలకు సంబంధించి ఆధార్ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..

NRI: ఎన్నారైలు ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేయొచ్చా..అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయి..?

ఎన్నారై డెస్క్: ప్రస్తుతం ఆధార్ కార్డు భారతీయులకు ఎంతో కీలకంగా మారింది. పౌరుల వద్ద ఉండాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్‌లో ఇదీ ఒకటి. బ్యాంకు అకౌంట్లకు ఆధార్ అనుసంధానం చేయాలిన ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. అనేక ఇతర సేవలు పొందేందుకు కూడా ఆధార్ కీలకంగా మారింది. అయితే.. ఆధార్ విషయమై ఎన్నారైల్లో ఇప్పటికీ కొన్ని సందేహాలు మిగిలున్నాయి. అయితే.. ఎన్నారైలకు సంబంధించిన నిబంధనలపై యూఐడీఏఐ ఎప్పుడో క్లారిటీ ఇచ్చింది. మరి అవేంటో చూద్దాం పదండి..

ప్రస్తుత నిబంధనల ప్రకారం..భారత పాస్‌పోర్టు ఉన్న ఎన్నారైలందరూ ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు కోసం ఎన్నారైలు తమకు దగ్గర్లోని ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాలి. దరఖాస్తు చేసుకునేందుకు పాస్‌‌పోర్టు కూడా అవసరం. ఇక దరఖాస్తులో తమకు సంబంధించిన అన్ని వివరాలు నింపాలి. దరఖాస్తుతోని వివరాలు పాస్‌పోర్టులోని వివరాలతో సరిపోలాలి. అయితే..ఎన్నారైగా ఆధార్ కోసం దరఖాస్తు చేస్తున్నట్టు ఆపరేటర్‌కు చెప్పాలి. ఇక డిక్లరేషన్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. అయితే.. సాధారణ పౌరులు సమర్పించే డిక్లరేషన్‌తో పోలిస్తే ఎన్నారైల డిక్లరేషన్ కాస్తంత భిన్నంగా ఉంటుందని నిపుణులు చెబుతారు. కాబట్టి..డిక్లరేషన్‌లోని అంశాలను పూర్తిగా ఆకళింపు చేసుకోవాలి.

ఆ తరువాత ఆపరేటర్..పాస్‌పోర్టును స్కాన్ చేస్తారు. ఆ తరువాత బయోమెట్రిక్ వివరాలను కూడా తీసుకుంటారు. అనంతరం.. పూర్తి అప్లికషన్ ముసాయిదా పత్రిని దరఖాస్తు దారుడికి అందజేస్తారు. ఈ సమయంలో దరఖాస్తును సమగ్రంగా చదవాలి. అంతే సవ్యంగా ఉందనుకుంటే..ఆపరేటర్ ఎన్నారై నుంచి దరఖాస్తు తీసుకున్నట్టు ఓ అక్నాలెడ్జ్‌మెంట్ రిసీట్‌ను ఇస్తారు.

Updated Date - 2023-03-24T18:45:42+05:30 IST