NRI News: ఓ ఎన్నారై మాస్టర్ ప్లాన్.. యజమాని కంపెనీ నుంచి రూ.22 కోట్లు తెలివిగా కొట్టేసి రిజైన్ చేసేశాడు.. కానీ..!
ABN , First Publish Date - 2023-08-22T18:21:44+05:30 IST
అమెరికాలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో ఆడిటర్‌గా చేసిన ఓ ఎన్నారై ఆ కంపెనీని భారీ స్థాయిలో ముంచేశాడు. దాదాపు దశాబ్దం పాటు ఎవరికీ తెలీకుండా సంస్థకు చెందిన రూ.22 కోట్లను నొక్కేసి ఆ తరువాత సైలెంట్‌గా రాజీనామా చేసి వెళ్లిపోయాడు.
ఎన్నారై డెస్క్: అమెరికాలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో ఆడిటర్‌గా చేసిన ఓ ఎన్నారై(NRI) ఆ కంపెనీని భారీ స్థాయిలో ముంచేశాడు(Wife Fraud). దాదాపు దశాబ్దం పాటు ఎవరికీ తెలీకుండా సంస్థకు చెందిన రూ.22 కోట్లను నొక్కేసి ఆ తరువాత సైలెంట్‌గా రాజీనామా చేసి వెళ్లిపోయాడు. అతడు వెళ్లిపోయిన తరువాత ఇతర అధికారులు కంపెనీ లెక్కలను పరిశీలించగా జరిగిన దారుణం గురించి వెలుగులోకి వచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళితే..కాలిఫోర్నియాలోని ఓ కేబీఎస్ రియాల్టీ అడ్వైసర్స్ కంపెనీలో వరుణ్ అగర్వాల్ ఆడిటర్‌గా(Auditor) చేసేవాడు. 2008 నుంచి 2022 వరకూ కంపెనీలో సుదీర్ఘకాలం పాటు పనిచేశాడు. మొదట చిన్న ఉద్యోగిగా సంస్థలో తన ప్రయాణం ప్రారంభించిన సంస్థ ఆర్థిక విభాగానికి డైరెక్టర్‌గా ఎదిగాడు. దీంతో, ఆయనకు కంపెనీ ఆర్థికవ్యవహారాలు, చెల్లింపులు జరిపే తీరుపై ఆయనకు మంచి పట్టుంది. ఈ క్రమంలోనే, కంపెనీ సొమ్ము నొక్కేసేందుకు అతడు భారీ స్కెచ్ వేశాడు.
తొలుత అతడు తన స్నేహితులు, బంధువులతో కొన్ని కంపెనీలు ఏర్పాటు చేయించాడు. ఆ తరువాత ఈ కంపెనీలు కేబీఎస్ రియల్టీ సర్వీసెస్‌కు కన్సల్టెన్సీ సర్వీసులు అందించినట్టు నకిలీ బిల్లులు(Invoices) సృష్టించిన కేబీఎస్ నుంచి డబ్బులను ఆయా కంపెనీలకు ట్రాన్సఫర్ చేయించాడు. ఆ తరువాత ఆ డబ్బును కంపెనీల నుంచి తన అకౌంట్లకు బదిలీ చేయించుకున్నాడు. ఇలా కొన్నేళ్ల పాటు ఈ మోసాలను నిరాఘాటంగా సాగించి మొత్తం 2.7 మిలియన్ డాలర్లు పోగేసుకుని గతేడాది రిటైరైపోయారు. ఆ తరువాత కంపెనీ వరుణ్ ఆమోదించిన బిల్లులను పరిశీలించడంతో ఈ మోసం మొత్తం బయటపడింది. ఇటీవలే అతడు కోర్టులో తన నేరాన్ని అంగీకరించాడు.