NRI: అమెరికా వృద్ధురాలికి కంప్యూటర్‌పై అవగాహన ఉండదని తెలిసే పక్కా ప్లాన్.. బ్యాంక్‌లోని డబ్బంతా విత్‌డ్రా చేయించి..
ABN , First Publish Date - 2023-10-20T18:23:00+05:30 IST
వృద్ధులకు కంప్యూటర్‌పై అవగాహన ఉండదనే నమ్మకంతో పక్కా ప్లాన్ వేసిన భారత సంతతి హ్యాకర్ ఓ అమెరికా మహిళను దారుణంగా మోసం చేశాడు. సుమారు రూ.1.2 కోట్ల మేర దోచేశాడు. అతడి పాపం పండి పోలీసులకు చిక్కడంతో చేసిన నేరం ఒప్పుకోక తప్పలేదు
ఎన్నారై డెస్క్: వృద్ధులకు కంప్యూటర్‌పై అవగాహన ఉండదనే నమ్మకంతో పక్కా ప్లాన్ వేసిన భారత సంతతి హ్యాకర్ ఓ అమెరికా మహిళను దారుణంగా మోసం చేశాడు. సుమారు రూ.1.2 కోట్ల మేర దోచేశాడు. అతడి పాపం పండి పోలీసులకు చిక్కడంతో చేసిన నేరం ఒప్పుకోక తప్పలేదు(Indian hacker arrested in US for stealing 150k dollars from elderly woman).
Viral: ఓవైపు వందేభారత్ రైళ్లు..మరోవైపు ఇలాంటి దారుణాలా? జనాల్లో ఆగ్రహం! అసలేం జరిగిందంటే..
పూర్తి వివరాల్లోకి వెళితే, మోంటానా రాష్ట్రం(Montana) కాలిస్పెల్ నగరానికి చెందిన జేన్ డో అనే వృద్ధురాలి కంప్యూటర్ ఫిబ్రవరిలో హ్యాకింగ్‌కు గురైంది. భారత్ కేంద్రంగా జరిగిన కుట్రలో భాగంగా నిందితులు అల్ట్రా వ్యూవర్ సాయంతో ఆమె కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో, కంప్యూటర్ హ్యాక్ అయినట్టు ఆమె స్క్రీన్‌పై అకస్మాత్తుగా మెసేజ్ వచ్చింది. ఇది చూసి వృద్ధురాలు భయపడిపోయింది. వెంటనే కస్టమర్ సపోర్టుకు ఫోన్ చేయాలని కూడా మెసేజ్‌లో కనిపించడంతో ఆమె మరో ఆలోచన లేకుండా ఆ నెంబర్‌కు ఫోన్ చేసింది.
Canada Visa: ముదిరిన దౌత్య వివాదం.. భారతీయ విద్యార్థులకు భారీ షాకిచ్చిన కెనడా!
ఈ క్రమంలో నిందితులు జేన్ డో అకౌంట్లో ఉన్న డబ్బును మొత్తం విత్‌డ్రా చేసి ఫెడ్ అకౌంట్‌లోకి మార్చాలని చెప్పారు. భద్రతా కారణాల రీత్యా ఇది అవసరమని తెలిపారు. ఆమె వారు చెప్పినట్టే చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సుఖ్‌దేవ్ వైద్ ఆమె వద్దకు వచ్చి మొత్తం 1.5 లక్షల డాలర్లను ( సుమారు రూ.1.2 కోట్లు) తీసుకెళ్లాడు. ఆ తరువాత తాను మోసపోయినట్టు గ్రహించిన జేన్ డో దిమ్మెరపోయింది. చివరకు పోలీసులను ఆశ్రయించింది.
Viral: వధువుకు దారుణ అనుభవం.. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేందుకు వరుడితో కలిసి వెళితే..
ఈ క్రమంలో రంగంలోకి దిగిన అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ మహిళ సాయంతో నిందితులను పట్టుకునేందుకు ఉచ్చు పన్నింది. తొలుత ఎఫ్‌బీఐ అధికారులు మహిళతో నిందితులకు మళ్లీ ఫోన్ చేయించి తన అకౌంట్లో ఇంకా డబ్బు మిగిలిపోయిందని చెప్పించారు. తన వద్ద ఉన్న 50 వేల డాలర్లను తీసుకెళ్లమన్నారు.
Viral: ఇలాంటి కోతి భూప్రపంచంలో మరోటి ఉండదేమో? తాసీల్దార్ ఆఫీసులోకి ఫైళ్లు కనిపించగానే..
దీంతో, సుఖ్‌దేవ్ వైద్ మరోసారి తన సహనిందితుడితో కలిసి మహిళ వద్దకు వచ్చాడు. అతడు ఆమె నుంచి డబ్బు తీసుకుంటుండగా పోలీసులు అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తాను నేరం చేసినట్టు సుఖ్‌దేవ్ అంగీకరించడంతో కోర్టు అతడిని దోషిగా ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అతడికి శిక్ష వేయనున్నారు. సుఖ్‌దేవ్ వైద్‌కు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటూ 2.5 లక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉందని ప్రాసిక్యుషన్ తరపు లాయర్ తెలిపారు.