NRI: వాహనం నడుపుతూ నిద్రలోకి జారుకున్న బారతీయుడికి సింగపూర్‌లో జైలు శిక్ష
ABN , First Publish Date - 2023-04-07T22:00:24+05:30 IST
మద్యం మత్తులో వాహనం నడుపుతూ కునుకు తీసిన ఓ భారతీయ డ్రైవర్‌కు సింగపూర్‌లో 10 నెలల జైలు శిక్ష పడింది.
ఇంటర్నెట్ డెస్క్: మద్యం మత్తులో వాహనం నడుపుతూ కునుకు తీసిన ఓ భారతీయ డ్రైవర్‌కు సింగపూర్‌లో 10 నెలల జైలు శిక్ష పడింది. నిందితుడు సౌరిరాజులు కరుణాకరన్ గత మేనెలలో ఓ సిమెంట్ మిక్సర్ లారీని నడుపుతున్న సమయంలో ఈ చర్యకు పాల్పడ్డాడు. దీంతో.. ఎదురుగా ఉన్న ఓ లారీని ఢీకొట్టాడు. దీంతో.. ఆ రహదారిపై ఉన్న పలు వాహనాలు ఒకదానితో మరొకరిని ఢీకొట్టాయి. ఓ వ్యక్తి తుంటె ఎముక కూడా విరిగింది. ఘటన సమయంలో నిందితుడు మద్యం మైకంలో ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అతడి రక్తంలో ఇథనాల్ శాతం పరిమితికి మూడు రెట్ల ఉన్నట్టు రుజువైంది. మరోవైపు.. తాను నేరం చేసినట్టు కరుణాకరన్ కూడా ఒప్పుకోవడంతో కోర్టు అతడిని దోషిగా తేల్చింది. జైలు నుంచి విడుదలయ్యాక 14 సంవత్సరాల పాటూ అతడు డ్రైవింగ్ చేయకుండా అనర్హత వేటు వేసింది.