NRI Couple: అదృష్టమంటే ఈ భార్యాభర్తలదే.. 48 గంటల్లో అమెరికాను వదిలి భారత్‌కు తిరిగొస్తారనగా వచ్చిందో మెసేజ్.. ఓపెన్ చేసి చూస్తే..
ABN , First Publish Date - 2023-04-10T21:29:41+05:30 IST
అదృష్టమంటే ఈ భార్యాభర్తలదే.. 48 గంటల్లో అమెరికాను వదిలి భారత్‌కు తిరిగొస్తారనగా..
ఎన్నారై డెస్క్: అమెరికాలో జాబ్ పోగొట్టుకున్న హెచ్-1బీ వీసాదారులు(H-1b Visaholders) ప్రస్తుతం కాలంతో పందెం వేస్తు్న్నారు. జాబ్ పోయిన 60 రోజుల్లోపు(Grace Period) కొత్త ఉద్యోగం వచ్చిందా సరేసరి..లేదంటే అగ్రరాజ్యాన్ని వీడాల్సిందే. ఇదే విపత్కర పరిస్థితిలో చిక్కుకున్న ఓ ఎన్నారై జంటకు చివరి నిమిషంలో అదృష్టం తలుపు తట్టింది. మరో 48 గంటల్లో వారికి అమెరికా వీడాల్సి ఉండగా కొత్త జాబ్ వచ్చి ఒళ్లో పడింది.
Tirumala: తిరుమల వెళ్లాలనుకుంటున్నారా.. అయితే అక్కడ ఉన్న పరిస్థితి చూస్తే..!
అంజలి(పేరు మార్చాం), ఆమె భర్త మాసాచుసెట్స్ రాష్ట్రంలోని లావెల్ ప్రాంతంలో ఉంటున్నారు. అంజలి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాగా ఆమె భర్త కూడా కంప్యూటర్ సంబంధిత రంగంలోనే ఉన్నారు. అయితే.. ఇటీవలి లేఆఫ్స్‌లో అంజలి ఉద్యోగం కోల్పోయింది. కొత్త జాబ్ కోసం ఆమె చేసిన ప్రయత్నాలన్నీ దాదాపుగా విఫలమయ్యాయి. అమెరికా వీడాల్సిన చివరి తేది దగ్గరపడింది. ఇంకో రెండు రోజుల్లో జాబ్ రాకపోతే ఆమె తన భర్తతో సహా ఇండియాకు వెళ్లిపోవాల్సిందే. అలాంటి టైంలో ఆమెకు ఓ మెసేజ్ వచ్చింది. ఏంటా అని చూస్తే..జాబ్ వచ్చినట్టు(New Job Offer 2 days before grace period deadline) సందేశం. దీంతో..ఆమె ఆనందానికి అంతేలేకుండా పోయింది.
అయితే.. అంజలి భర్త మాత్రం ఇండియాకు తిరిగిరావాల్సి వచ్చింది. అంజలి జీవితభాగస్వామిగా అతడికి అమెరికాలో ఉండేందుకు అర్హత ఉంది. అయితే.. కొత్తగా అనుమతి తెచ్చుకునేందుకు కొంత సమయం పడుతుంది. ఆ అనుమతి వచ్చేవారకూ అతడు అమెరికాలో కొనసాగడం కుదరదు కాబట్టి స్వదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది. అమెరికాలో ప్రస్తుతం వ్యాలిడ్ హెచ్-1బీ వీసా ఉన్న టెకీలకు మంచి డిమాండ్ ఉంది. కొత్త విదేశీ ఉద్యోగుల వీసా వచ్చేందుకు కొంత సమయం పట్టడంతో అనేక కంపెనీలు హెచ్-1బీ వీసా ఉన్నవారివైపే మొగ్గు చూపుతున్నాయి.