NRI: ఇంగ్లండ్‌లో భారత సంతతి టీచర్‌పై నిషేధం.. ఆ విషయం దాచిపెట్టిందని తెలిసి..
ABN , First Publish Date - 2023-06-05T21:02:57+05:30 IST
గతంలో ఓ కేసులో దోషిగా తేలిన విషయాన్ని స్కూల్ యాజమాన్యానికి చెప్పకుండా దాచిపెట్టినందుకు ఓ భారతీయ టీచర్ బ్రిటన్‌లో నిషేధానికి గురైంది.
ఎన్నారై డెస్క్: గతంలో ఓ కేసులో దోషిగా తేలిన విషయాన్ని స్కూల్ యాజమాన్యానికి చెప్పకుండా దాచిపెట్టినందుకు ఓ భారతీయ టీచర్ బ్రిటన్‌లో నిషేధానికి గురైంది. మరే ఇతర స్కూల్లోనూ ఆమె ఉద్యోగం చేయకుండా ప్రొఫెషనల్ కాండక్ట్ కమిటీ అధికారులు నిషేధాజ్ఞలు జారీ చేశారు.అయితే, ఈ ఆదేశాలపై రెండేళ్ల తరువాత అప్పీలు చేసుకునేందుకు అమెకు అవకాశం.
దీప్తీ పటేల్ అనే భారత సంతతి టీచర్ మాంచెస్టర్ అకాడమీలో ఉపాధ్యాయురాలిగా పనిచేసేవారు. అయితే, గతంలో ఓ ఫ్రాడ్ కేసులో తాను దోషిగా తేలిన విషయాన్ని ఆమె మాంచెస్టర్ అకాడమీ యాజమాన్యానికి చెప్పలేదు. ఇటీవల ఈ విషయం వెలుగులోకి రావడంతో స్కూల్ యాజమాన్యం దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసును ప్రొఫెషనల్ కాండక్ట్ ప్యానెల్‌కు అప్పగించింది. విచారణ సందర్భంగా తాను తప్పు చేసిన విషయాన్ని దీప్తి అంగీకరించడంతో ఆమెపై నిషేధం విధించారు. అయితే, ఉపాధ్యాయ రంగం ఆమె సేవలు అవసరమని భావించిన ప్యానెల్ రెండేళ్ల తరువాత తమ ఆదేశాలపై కోర్ట్ ఆఫ్ ఇంగ్లండ్‌లో అప్పీలు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది.