NRI: పింగళి నాగేంద్రరావు జయంతి సందర్భంగా నేడు ఆన్‌లైన్ వేదికగా సంగీత కార్యక్రమం
ABN , Publish Date - Dec 29 , 2023 | 05:01 PM
'అలనాటి మాటల మాంత్రికుని'గా పేరు గాంచిన ప్రముఖ (సినీ) మాటల పాటల రచయిత స్వర్గీయ పింగళి నాగేంద్రరావు జయంతి సందర్భంగా ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ & శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ సంయుక్త ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని అంతర్జాల వేదికపై ఏర్పాటు చేశారు
'అలనాటి మాటల మాంత్రికుని'గా పేరు గాంచిన ప్రముఖ (సినీ) మాటల పాటల రచయిత స్వర్గీయ పింగళి నాగేంద్రరావు జయంతి సందర్భంగా ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ & శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ సంయుక్తంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని అంతర్జాల వేదికపై ఏర్పాటు చేశారు. "పింగళి మాటా-పాటా" పేరిట డిసెంబర్ 29న (శుక్రవారం) సాయంత్రం 5:00 గంటల నుండి (భారత కాలమానం) మాయాబజార్, మిస్సమ్మ, పాతాళభైరవి, గుండమ్మ కథ, జగదేకవీరుని కథ మొదలైన సినిమాలకు అద్భుతమైన మాటలను పాటలను అందించిన పింగళికి నివాళిగా, వారి పాటలను పాడుకుంటూ వారి మాటలను స్మరించుకోనున్నారు. యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని https://www.youtube.com/watch?v=6Orh_Gyc8k8 లింక్ ద్వారా వీక్షించవచ్చు.