NRI: హాంకాంగ్‌లో వైభవంగా ‘సురభి ఏక్ ఎహసాస్’ సాంస్కృతిక కార్యక్రమం
ABN , First Publish Date - 2023-08-08T06:08:49+05:30 IST
కార్గిల్ విజయ్ దివస్ పురస్కరించుకుని హాంకాంగ్‌లో నిర్వహించిన సురభి ఏక ఎహసాస్ కార్యక్రమం ఎన్నారైలను ఆకట్టుకుంది.
కార్గిల్ విజయ్ దివస్ ప్రతి సంవత్సరం జూలై 26న దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. పాకిస్థాన్‌పై కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం సాధించిన విజయాన్ని గుర్తుచేసుకునే రోజు. 3 మే - 26 జూలై 1999 (2 నెలలు, 3 వారాలు మరియు 2 రోజులు) అంటే దాదాపు మూడు నెలల పోరాటం తర్వాత, భారత బలగాలు వివాదాస్పద ప్రాంతాలపై తిరిగి నియంత్రణ సాధించాయి. 1999 యుద్ధంలో సైనికుల ధైర్యసాహసాలు, త్యాగాలను గౌరవించటానికి ఈ రోజును జరుపుకుంటారు.
సాయుధ దళాల వైద్య కళాశాలలో చదవాలనే ఆశ నిరాశగా మారినా, టోరి రేడియొలో వ్యాఖ్యాతగా అవకాశం లభించినప్పుడు, దానినే దేశానికి పరోక్షంగా సేవ చేసే మహద్ అవకాశంగా మలచుకొంది జయ పీసపాటి. “జై హింద్” అనే టాక్ షో లో అనేక సాయుధ దళాల అధికారులు, ముఖ్యంగా విశ్రాంత అధికారులు, అమర వీరుల కుటుంబ సభ్యులతో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రపంచలోని ప్రవాస తెలుగు వారికి పరిచయం చేశారు. ఆ తరుణంలో అనేక కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నవారితో 'జై హింద్' లో పరిచయాలు చేసిన వారిలో కొందరు అతిథులు:
o మేజర్ జనరల్ ఇయాన్ కార్డోజో - అతి విశిస్ట్ సేన మెడల్ , సేనా మెడల్
o మేజర్ డి. పి. సింగ్, భారతదేశపు మొదటి బ్లేడ్ రన్నర్
o మేజర్ దీపేంద్ర సింగ్ సెంగార్ - కమాండో డాగర్,
o కెప్టెన్ నవీన్ నాగప్పా - సేనా మెడల్ ,
o సుబేదార్ యోగేంద్ర సింగ్ యాదవ్ - పరమ వీర చక్ర
o మేజర్ రాకేష్ శర్మ - శౌర్య చక్ర
o కల్నల్ డాక్టర్ DPK పిళ్లే - శౌర్య చక్ర
o గ్రేహౌండ్స్ ఇన్‌స్పెక్టర్ లేట్ కర్ణం ప్రసాద్ బాబు - అశోక్ చక్ర
o శ్రీమతి. భావన ద్వివేది W/o లేట్ C B ద్వివేది, సేన పతకం
o శ్రీమతి. చారులత ఆచార్య W/o లేట్ మేజర్ పద్మపాణి ఆచార్య, మహా వీర్ చక్ర.
అలా RJ జయ తన రేడియో పరిచయాల ద్వారా సైనికుల త్యాగాలను వారి కుటుంబాలను గౌరవించే ప్రయత్నంలో సామాన్య పౌరులకు తెలియజేయడానికి అనుసంధానకర్తగా వుంటూ మరొక కార్యక్రమం కార్గిల్ విజయ్ దివస్ చేయనారంభించారు. ప్రతి ఏటా చేసినట్టే, కోవిడ్ మూడు సంవత్సరాల తరువాత, ఈ సంవత్సరం "సురభి ... ఏక్ ఎహసాన్ ' అనే పేరుతో పునః ప్రారంభించారు.
దేశభక్తి పాటలతో, నృత్యాలతో పిల్లలు పెద్దలు ప్రేక్షకులని భావపూరితులని చేశారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా ప్రవీణ్ అగర్వాల్ మరియు సౌరభ్ రాఠీ వ్యవహరించగా, మంజరి గుహ, నేహా అగర్వాల్ , సాక్షి గోయల్ , సుగుణ రవి, కొరడ భరత్ కుమార్, ప్రశాంత్ పటేల్, శ్రీదేవి బొప్పన, లక్ష్మి యువ, సంజయ్ గుహ స్వచ్ఛంద సేవకులుగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం సైనికుల వీడియో సందేశాల్ని ప్రేక్షకులకి చూపిస్తుంటారు. కానీ, ఈ సారి RJ జయ చేసిన జై హింద్ టాక్ షో అతిథి "ఉమేష్ గోపినాథ్ జాదవ్" ఆర్మీ అమరవీరుల స్మారక చిహ్నాన్ని నిర్మించడానికి 1.2 లక్షల కిలోమీటర్ల మేర మూడు సంవత్సరాల పాటు ఒక వ్యక్తి ప్రయాణం "ఉమేష్ గోపినాథ్ జాదవ్" గారి మాటల్లో వారి సందేశాన్ని ప్రేక్షకులకి చూపించారు. ఉమేష్ "సురభి ఏక్ ఎహసాన్" కు శుభాభినందనలు , తెలుపు, భారతీయులుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నదుకు అభినందించారు.
కార్యక్రమానికి శ్రీమతి పూనమ్ మెహతా - బి ది చేంజ్ వ్యవస్థాపకులు; కమ్యూనిటీ కనెక్టర్ జుబిన్ ఫౌండేషన్; జాతి సామరస్యం, హోం వ్యవహారాల బ్యూరో ప్రభుత్వ సెక్రటేరియట్ కమిటీ నియమించబడిన సభ్యురాలు మరియు శ్రీమతి నీనా పుష్కర్ణ - రిటైర్డ్ సివిల్ సర్వెంట్ మరియు సామాజిక ఎంటర్‌ప్రెన్యూర్ మరియు రుట్టోంజీ ఎస్టేట్స్ కంటిన్యూయేషన్ లిమిటెడ్‌లో డైరెక్టర్ గా వున్న శ్రీమతి రానూ వాసన్ , వీరు ముగ్గురు ముఖ్య అతిథులుగా కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతీయ సంఘాల నుంచి అనేక ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హాంగ్ కాంగ్ లో నివసిస్తున్న భారతీయులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి హాజయ్యారు.
సాంస్కృతిక ప్రదర్శనలిచ్చిన సభ్యుల స్పందనలు ఇలా వున్నాయి : ‘‘హాంకాంగ్‌లోని భారతీయులందరినీ కలుపుతూ దేశభక్తిని చాటుతున్నారు. నిజంగానే ఈరోజు కార్యక్రమం హృదయాన్ని హత్తుకునేలా ఉంది. ఈ నాటి వేదిక మన మాతృభూమి వేదికగా భావన కలిగిస్తోంది. ముందుకు తీసుకెళ్తున్న మీకు మరియు మీ స్ఫూర్తికి వందనం మరియు మనందరినీ 24x7 రక్షించే మన దేశ వీరుల కు శ్రద్ధ పూర్వక నివాళులు’’ అని అన్నారు. ‘‘ప్రతి వయస్సు వారికి ఇది ఒక అద్భుతమైన వేదిక..భారతదేశం గురించి, భిన్నత్వంలో ఏకత్వం, మాతృభూమిపై ప్రేమ మరియు అద్భుతమైన ప్రదర్శనలలో వారు చేసిన కృషిని వీక్షించగలిగారు. చాలా మనోహరంగా, అద్భుతంగా వుంది. ఇందులో భాగమైనందుకు చాలా కృతజ్ఞతలు. కార్గిల్ యుద్ధ వీరులకు అంకితం చేయబడిన ఇటువంటి మహత్తరమైన ఈవెంట్‌లో హాంకాంగ్‌లో నివసిస్తున్న భారతీయ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు & బృందాలు పాల్గొనే అవకాశం కల్పించే ఈ అద్భుతమైన ఈవెంట్‌ను మీరు ప్రతి సంవత్సరం చేస్తున్నందుకు మీ సమయం, కృషి మరియు మా మాతృభూమి పట్ల వున్న ప్రేమకు వందనాలు. పుట్టిన గడ్డ దూరంగా ఉన్నా కూడా మీ కార్యక్రమలతో ఎప్పుడు భరతమాత పట్ల మన భాధ్యతని గుర్తు చేస్తున్నందుకు ధాన్యవదాలు’’ అని తెలిపారు. ‘‘సురభి ఏక్ ఎహసాస్‌కి పదాలు లేవు, కానీ ఏక్ ఎహసాస్ జో జిందగీ భర్ హమారే దిలోన్ పర్ ఛాయా రహేగా’’ అని అన్నారు. వేదికపైకి రావడం, మన మాతృభూమికి ప్రాతినిధ్యం వహించడం ద్వారా మన గతాన్ని వర్తమానంతో అనుసంధానించడం మనకు మరియు మన తరువాతి తరానికి గర్వించదగిన క్షణం. ఈ ఈవెంట్‌ను వినోదభరితంగా, విజయవంతం చేసినందుకు, ధైర్యం, త్యాగం, దేశభక్తిని ప్రేరేపించినందుకు ఆర్గనైజింగ్ కమిటీకి, ప్రేక్షకులతో సహా వాలంటీర్‌లకు హృదయపూర్వక అభినందనలను అందించారు.