NRI: ఒమాన్‌లో కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకలు

ABN , First Publish Date - 2023-02-19T21:28:03+05:30 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకలను ఒమాన్ రాజధాని మస్కట్‌లో బిఆర్‌యస్ అభిమానులు వేర్వేరుగా ఘనంగా నిర్వహించారు.

NRI: ఒమాన్‌లో కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకలు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకలను ఒమాన్ రాజధాని మస్కట్‌లో బిఆర్‌యస్ అభిమానులు వేర్వేరుగా ఘనంగా నిర్వహించారు. బి.ఆర్.యస్ ఎన్నారై సెల్ ఒమాన్ ఆధ్వర్యంలో జరిగిన జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా ఒమాన్‌లో పని చేస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులతో క్రికెట్ పోటీలను నిర్వహించగా దానికి అనూహ్య స్పందన లభించింది. ఒమాన్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన పోటీలలో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా ఒమాన్ శాఖ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ కె.సి.ఆర్. తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకుడిగా సాగించిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న సేవలను ప్రశంసించారు. జాతీయ స్థాయిలో పార్టీని విస్తరిస్తున్న తీరును కొనియాడుతూ ఈ దిశగా ప్రవాసీయులందరు ఇతర రాష్ట్రాల ప్రవాసీయులకు, బిఆర్‌యస్‌కు చేయూత నివ్వాలని కోరారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఒంటరి మహిళ, వితంతువులు, వృద్ధులకు, వికలాంగులకు అందజేస్తున్న పింఛను, రైతు బీమా రైతు తరహా సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రశంసించారు.

3.jpg

బంగారు తెలంగాణ ఇదే తరహా మరి కొన్నాళ్ళు అభివృద్ధి చెందితే భవిష్యత్తులో ఏ తెలంగాణ బిడ్డ కూడా గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వలస రావడానికి ఆస్కారముండదని ఉపాధ్యక్షుడు షేఖ్ అహ్మద్ పెర్కోన్నారు.

కేసీఆర్ జన్మ దినం సందర్భంగా టర్కీ, సిరియా దేశాలలోని భూకంప బాధితులకు కూడా సహాయార్థం సామగ్రిని అందజేయడానికి కూడా బిఆర్‌యస్ ఒమాన్ శాఖ ప్రయత్నిస్తుందని గైసింగరపు వినోద్ కుమార్ తెలిపారు. ఒమాన్‌లో తెలంగాణ వాదంలో ముందు భాగంలో ఉండే తెలంగాణ జాగృతి అధ్యక్షులు గుండు రాజేందర్ నేతతో పాటు టీఆర్ఎస్ నాయకులు వడియాల దేవేందర్ రెడ్డి, బల్ల ఆంజనేయులు, బుకా శ్రీనివాస్, రాజులదేవ్ శ్రీనివాస్, నర్సయ్య, బొద్దుల కృష్ణ, గాంధారి నరేష్, కొత్త చిన్నయ్య, సాయి కృష్ణ, జాబేర్ పాషా, కృష్ణ, సాయి కిరణ్ రెడ్డి, రంజిత్, వంశీ, రాజు, వేణు, దినేష్, రాజేందర్, గంగాధర్, గంగాధర్, శ్రీనివాస్ నాగం, శ్రీనివాస్, అక్తర్, కనకరాజు, గణేష్, కాశీరామ్, రాజేంధర్, శంకర్, దాసు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

1.jpg

Updated Date - 2023-02-19T21:28:05+05:30 IST