NRI: సిక్కు డ్రైవర్ హత్య కేసు..స్థానిక యువకుడిని దోషిగా తేల్చిన న్యాయస్థానం
ABN , First Publish Date - 2023-06-25T23:06:50+05:30 IST
ట్యాక్సీకి డబ్బులు చెల్లించే విషయమై చెలరేగిన వివాదంలో ఇంగ్లండ్‌లోని ఓ సిక్కు డ్రైవర్‌ను హత్య చేసిన బ్రిటన్ వ్యక్తిని స్థానిక న్యాయస్థానం తాజాగా దోషిగా తేల్చింది.
ఇంటర్నెట్ డెస్క్: ట్యాక్సీకి డబ్బులు చెల్లించే విషయమై చెలరేగిన వివాదంలో ఇంగ్లండ్‌లోని ఓ సిక్కు డ్రైవర్‌ను హత్య చేసిన బ్రిటన్ వ్యక్తిని స్థానిక న్యాయస్థానం తాజాగా దోషిగా తేల్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..గతేడాది అక్టోబర్ 22న అనాఖ్ సింగ్ టోస్మాజ్ మార్గోల్ అనే వ్యక్తిని తన ట్యాక్సీలో ఎక్కించుకున్నాడు. ఆ తరువాత ఇద్దరి మధ్యా చెల్లింపుల విధానంపై వివాదం తలెత్తింది. ఇది తీవ్ర రూపం దాల్చడంతో మార్కోల్ అనాఖ్ సింగ్‌పై విచక్షణా రహితంగా దాడి చేశాడు. అనాఖ్ సింగ్ కిందపడిపోయినా కూడా ముఖంపైనా శరీరంపైనా ముష్ఠిఘాతాలు కురిపించాడు. దీంతో, అనాఖ్ అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి అనాఘ్ సింగ్ నిర్జీవంగా కనిపించాడు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడు మార్గోల్‌ను గుర్తించి అరెస్టు చేశారు. వచ్చే నెలలో కోర్టు అతడికి శిక్ష ఖరారు చేయనుంది.