NRI: సిక్కు టీనేజర్‌పై చేయి చేసుకున్న అమెరికా వ్యక్తి అరెస్ట్!
ABN , First Publish Date - 2023-10-21T21:56:41+05:30 IST
అమెరికాలో సిక్కు టీనేజర్‌పై ద్వేషపూరిత దాడికి(Hate Crime) పాల్పడిన ఓ వ్యక్తిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.
ఎన్నారై డెస్క్: అమెరికాలో సిక్కు టీనేజర్‌పై(Sikh Teenager) ద్వేషపూరిత దాడికి(Hate Crime) పాల్పడిన ఓ వ్యక్తిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. క్వీన్స్‌లోగల(Queens) లిబర్టీ ఎవనెన్యూ ప్రాంతంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు క్రిస్టోఫర్ ఫిలిప్పే న్యూయార్క్ నగర ఎమ్‌టీఏ బస్సులో ప్రయాణిస్తున్న ఓ 19 ఏళ్లు సిక్కు కుర్రాణ్ణి సమీపించారు. మేం ఇక్కడ ఇలాంటి ధరించం అంటూ టీనేజర్ ధరించిన తలపాగావైపు వేలు చూపిస్తు ఘాటు వ్యాఖ్యలు చేశాడు. మాస్క్ కూడా తొలగించమని డిమాండ్ చేశాడు.
Viral video: నల్లా నుంచి నీరు లోప్రెజర్‌తో వస్తోందని ఇతడేం చేశాడో తెలిస్తే..
ఈ క్రమంలో నిందితుడు టీనేజర్ ముఖంపై పిడికిలి బిగించి కొట్టాడు. వీపు, తల వెనుక భాగంలో కూడా పిడిగుద్దులు కురిపించాడు. ఆ తరువాత టీనేజర్ ధరించిన తలపాగాను కూడా తొలగించేందుకు ప్రయత్నించాడు. ఆ తరువాత బస్సు దిగి వెళ్లిపోయాడు.
H-1b visa: హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌లో భారీ మార్పులు ప్రతిపాదించిన అమెరికా!
కాగా, నిందితుడు రెండేళ్ల పాటు జైల్ శిక్ష అనుభవించి జులై 2021న షరతులతో కూడిన పెరోల్‌పై విడుదలయ్యాడని పోలీసులు తెలిపారు. మన్‌హట్టన్‌లో దోపిడీకి పాల్పడిన నేరంపై అతడు జైలు పాలైనట్టు పేర్కొన్నారు.
Agra: బాబోయ్..ఇలాక్కూడా జరుగుతుందా? గుండెకు దగ్గరగా ఫోన్ ఉండటంతో తప్పిన ప్రాణాపాయం!
కాగా, ఈ ఘటనతో తాను తీవ్ర ఆవేదన చెందాని సిక్కు టీనేజర్ తెలిపాడు. ఈ పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని చెప్పుకొచ్చాడు. రూపురేఖల ఆధారంగా ఎవరూ వేధింపులకు గురి కాకూడదని చెప్పారు. ఘటన తమను కలిచి వేసిందని ఎంటీఏ యాక్టింగ్ చీఫ్ కస్టమర్ ఆఫీసర్ వ్యాఖ్యానించారు.
Canada Visa: ముదిరిన దౌత్య వివాదం.. భారతీయ విద్యార్థులకు భారీ షాకిచ్చిన కెనడా