Share News

NRI: గుడ్ న్యూస్.. హెచ్-1బీ వీసాదారులకు భారీ ఊరట

ABN , First Publish Date - 2023-11-05T22:00:23+05:30 IST

అమెరికాలో హెచ్-1బీ వీసాదారులకు గుడ్‌న్యూస్! హెచ్-1బీ వీసాదారుల భాగస్వాముల ఉద్యోగానుమతికి సంబంధించిన కింది కోర్టు ఇచ్చిన అనుకూల తీర్పును సమీక్షించబోమని అమెరికా సుప్రీం కోర్టు తాజాగా నిర్ణయించింది.

NRI: గుడ్ న్యూస్.. హెచ్-1బీ వీసాదారులకు భారీ ఊరట

ఎన్నారై డెస్క్: అమెరికాలో హెచ్-1బీ(H-1b) వీసాదారులకు గుడ్‌న్యూస్! హెచ్-1బీ వీసాదారుల భాగస్వాముల ఉద్యోగానుమతికి సంబంధించిన కింది కోర్టు ఇచ్చిన అనుకూల తీర్పును సమీక్షించబోమని అమెరికా సుప్రీం కోర్టు(US supreme court) తాజాగా నిర్ణయించింది. దీంతో, హెచ్-4(H-4) ఎంప్లాయ్‌మెంట్ ఆథొరైజేషన్ డాక్యుమెంట్‌కు (EAD- ఉద్యోగానుమతికి) సంబంధించి ప్రస్తుత నిబంధనలే కొనసాగనున్నాయి.


ప్రస్తుత నిబంధనల ప్రకారం, హెచ్-1బీ వీసాదారులకు వీసా కాలపరిమితి ఆరు సంవత్సరాలకు మించి పొడిగించినా లేదా వారికి గ్రీన్ కార్డు వచ్చే అవకాశం ఉన్న సందర్భాల్లో వారీ జీవితభాగస్వాములు(హె-4 వీసాదారులు) ఉద్యోగానుమతికి పొందేందుకు అర్హులు. 2015లో అప్పటి ఒబామా ప్రభుత్వం ఈ నిబంధన తీసుకొచ్చింది. గ్రీన్ కార్డుల(Green Card) జారీలో దశాబ్దాల తరబడి జాప్యం జరుగుతుండటంతో భారతీయులకు లాభించేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


కానీ, హెచ్-1బీ వీసా కారణంగా ప్రభావితమైన అమెరికా టెక్ ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేశారు. ఉద్యోగానుమతి నిబంధన అమలు చేసే అధికారం డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీకి లేదని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ నిబంధన అమలుకు కాంగ్రెస్ అనుమతి కూడా కావాలన్నారు. అయితే, కోర్టు మాత్రం ఎన్నారైలకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. అయితే, ఈ తీర్పును పునఃసమీక్షించేందుకు తాజాగా సుప్రీంకోర్టు కూడా సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఎన్నారైలకు భారీ ఊరట లభించినట్టైంది. ఎన్నారైల భాగస్వాముల ఉద్యోగ భద్రతకు ముప్పు తప్పినట్టైంది.

Updated Date - 2023-11-05T22:02:34+05:30 IST