Tirumala తిరుమల గిరిలో సరికొత్త శోభ - కనువిందు చేస్తున్న కపిలతీర్థం

ABN, First Publish Date - 2023-12-05T13:07:54+05:30 IST

మిజౌంగ్ తుఫాన్ ప్రభావంతో తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాలకు డ్యాములు, తిరుమల ఘాట్ రోడ్లలో పారుతున్న నీళ్లు, తిరుపతి కొండలపై నుంచి కపిల్ తీర్థం మాల్వాడి గుండంపై జాలు వాడుతున్న వర్షపు నీటితో తిరుమల గిరిలో సరికొత్త శోభ సంతరించుకొంది.

Tirumala తిరుమల గిరిలో సరికొత్త శోభ - కనువిందు చేస్తున్న కపిలతీర్థం 1/5

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తిరుమల కొండలపై నుంచి కపిల్ తీర్థం మాల్వాడి గుండంపై జాలు వాడుతున్న వర్షపునీరు, తిరుపతి ప్రజలకు ఆహ్లాదకరంగా కనపడుతున్న దృశ్యం..

Tirumala తిరుమల గిరిలో సరికొత్త శోభ - కనువిందు చేస్తున్న కపిలతీర్థం 2/5

అలిపిరిలో శ్రీవారి పాదాల చెంత ఉన్న కపిలతీర్థ జలపాతం భక్తులకు కనువిందు చేస్తోంది. నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పుష్కరిణిలో భక్తులను స్నానానికి అనుమతించడం లేదు.

Tirumala తిరుమల గిరిలో సరికొత్త శోభ - కనువిందు చేస్తున్న కపిలతీర్థం 3/5

గడచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శేషాచలం అటవీ ప్రాంతంలోని జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ఎగువన కురిసిన భారీ వర్షాలతో మొదటి కనుమ రహదారిలో ఉన్న మాల్వాడి గుండం జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

Tirumala తిరుమల గిరిలో సరికొత్త శోభ - కనువిందు చేస్తున్న కపిలతీర్థం 4/5

ఎత్తైన ప్రాంతం నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు.

Tirumala తిరుమల గిరిలో సరికొత్త శోభ - కనువిందు చేస్తున్న కపిలతీర్థం 5/5

ఏడుకొండల్లో పరచుకున్న పచ్చదనానికి ఎత్తైన ప్రాంతం నుంచి జారుతున్న జలపాతం భక్తులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తోంది.

Updated at - 2023-12-05T14:10:22+05:30