AP Politics : విశాఖ వైసీపీలో రివర్స్ గేర్.. ఏ ఒక్కర్ని కదిపినా పరిస్థితేంటో అని జగన్‌లో పెరిగిన టెన్షన్!?

ABN , First Publish Date - 2023-08-01T17:15:27+05:30 IST

వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా (YSRCP MLA) మొదటిసారి గెలిచారు.. ఎవరూ ఊహించని రీతిలో మంత్రి పదవి దక్కించుకున్నారు.. అది కూడా కీలక శాఖే కట్టబెట్టారు వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy)..! అయితే రానున్న ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలవాలని..

AP Politics : విశాఖ వైసీపీలో రివర్స్ గేర్.. ఏ ఒక్కర్ని కదిపినా పరిస్థితేంటో అని జగన్‌లో పెరిగిన టెన్షన్!?

వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా (YSRCP MLA) మొదటిసారి గెలిచారు.. ఎవరూ ఊహించని రీతిలో మంత్రి పదవి దక్కించుకున్నారు.. అది కూడా కీలక శాఖే కట్టబెట్టారు వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy)..! అయితే రానున్న ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలవాలని.. మంత్రి కావాలనే ఆశ లేదట. కానీ.. ఎంపీగా పోటీచేసి పార్లమెంట్‌లో అడుగుపెట్టాలని చిరకాల కోరికట. ఈయన కోరిక అటుంచితే.. మరో ఎంపీది కూడా ఇదే పరిస్థితట.. ఎంపీ (YSRCP MP) అయ్యాను.. ఇక ఎమ్మెల్యే అయ్యి మంత్రి పదవి అనుభవించాలన్నది ఆయన మనసులో ఉందట. ఇంతకీ పార్లమెంట్‌లోకి అడుగుపెట్టాలనుకుంటున్నది ఎవరు..? మంత్రి కావాలనుకుంటున్న ఆ ఎంపీ ఎవరు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.


YSRCP.jpg

ఇదీ అసలు కథ..!

ఎంపీ కావాలనుకుంటున్న ఆ మంత్రి మరెవరో కాదండోయ్.. ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్.! (Gudivada Amarnath). ఇక మంత్రి కావాలనుకుంటున్న ఎంపీ ఇంకెవరో కాదు ఎంవీవీ సత్యనారాయణ (MP MVV Satyanarayana) !. చూశారుగా ఆయనేమో పార్లమెంట్ నుంచి అసెంబ్లీకి .. ఈయనేమో అసెంబ్లీ నుంచి పార్లమెంట్‌కు వెళ్లాలని తహతహలాడుతున్నారట. ఈ ఇద్దరి విచిత్ర కోరికలు విన్న వైసీపీ శ్రేణులు ఆశ్చర్యపోతున్నారట. మంత్రులుగా ఉన్నోళ్లు మరోసారి మంత్రి కావాలనో.. మునుపటి కంటే మరింత ప్రాధాన్యత ఉన్న శాఖ కావాలనో అనుకుంటారు.. కానీ అమర్ మనసులో ఇలా ఉందేటబ్బా..? అని వైసీపీ పెద్దలు చెవులు కొరుక్కుంటున్నారట. తమ మనసులో మాటను అధిష్టానం చెప్పగా.. ఇదేంట్రా బాబోయ్ అని ఆలోచనలో పడిందట.

MVV.jpg

ఏపీ బోర్ కొట్టిందా..!?

గుడివాడ అమర్నాథ్ కుటుంబం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ ఫ్యామిలీకి ఏపీ రాజకీయాల్లో చాలా గుర్తింపు ఉంది. రాజకీయ వారసత్వంగా వచ్చిన అమర్నాథ్ 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున అనకాపల్లి ఎంపీగా పోటీచేసి టీడీపీ తరఫున అవంతి శ్రీనివాస్ చేతిలో ఓటమిపాలయ్యారు. 47,932 మెజార్టీతో అవంతి గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. అయితే.. ఈ ఎన్నికల్లో గెలిచి ఢిల్లీ వెళ్దామనుకున్న అమర్నాథ్ కోరిక నెరవేరలేదు. 2019లో ఎంపీ టికెట్ ఇవ్వడానికి వైసీపీ అధిష్టానం సాహసించలేదు. సత్యవతికి వైసీపీ టికెట్ ఇవ్వడంతో 89,192 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక.. అమర్నాథ్‌ను అనకాపల్లి అసెంబ్లీ నుంచి బరిలోకి దింపింది అధిష్టానం. టీడీపీ అభ్యర్థి పీలా గోవింద సత్యనారాయణపైన 8,169 ఓట్లతో గెలుపొందారు అమర్. సామాజిక వర్గ సమీకరణలతో అమర్‌కు మంత్రి పదవి కూడా దక్కింది. అందులోనూ కీలక శాఖ అయిన ఐటీ. 38 ఏళ్లకే ఇంత తక్కువ వయస్సులో మంత్రి పదవి దక్కడంతో అందరూ ఆశ్చర్య పోయారు కూడా. అయితే.. ఒక్కసారి ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి పదవి చేసేసరికి ఏపీ బోర్ కొట్టేసిందట. అయితే.. రానున్న 2024 ఎన్నికల్లో ఎలాగైనా సరే ఎంపీగా పోటీచేసి గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టాలన్నది మంత్రి కోరికట.

Gudivada-amar.jpg

ఎంపీకి ఢిల్లీ బోర్ కొట్టిందట..!

వైజాగ్‌లో వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఎంవీవీకి సత్యనారాయణకు ఊహించని రీతిలో వైజాగ్ ఎంపీ టికెట్ దక్కింది. ఈయన గెలుస్తారని బహుశా వైసీపీ పెద్దలు కూడా ఊహించి ఉండరేమో. ఎందుకంటే.. ఈయనపైన టీడీపీ నుంచి భరత్ (బాలయ్య చిన్నల్లుడు), జనసేన తరఫున మాజీ జేడీ లక్ష్మీ నారాయణ పోటీచేశారు. ఆ ఇద్దర్నీ ఢీకొని గెలవడం అంటే ఆషామాషీ కాదని అందరూ అనుకున్నారు కానీ.. 4,414 ఓట్ల తేడాతో నెగ్గారు ఎంవీవీ. సీన్ కట్ చేస్తే.. 2024 ఎన్నికల్లో జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ నుంచి పోటీచేసి మంత్రి పదవి దక్కించుకోవాలని మనసులో ఉందట. అయితే విశాఖ ఈస్ట్‌పైనే ఎంపీ కన్ను పడిందట. ఇదే జరిగితే ఈస్ట్ నుంచి గతంలో అక్కరమాని విజయ నిర్మల పరిస్థితి ప్రశ్నార్థకమే.

MVV.gif

జగన్ మనసులో ఏముందో..?

అటు మంత్రి.. ఇటు ఎంపీ కోరికతో వైసీపీ అధిష్టానం ఆలోచనలో పడిందట. మంత్రిని నియోజకవర్గం మార్చడం, అది కూడా ఎంపీగా పోటీ చేయిస్తే జనాల్లోకి నెగిటివ్ పోతుందనే భావనలో వైఎస్ జగన్ ఉన్నారట. అయితే.. అనకాపల్లి ఎంపీగా ఉన్న సత్యవతికి 2024లో మళ్లీ పార్లమెంట్ నుంచి పోటీచేసే ఉద్దేశం లేదట. ఆమె కూడా ఎమ్మెల్యేగా పోటీచేయాలని అనుకుంటున్నారట. ఒకవేళ ఇదేగానీ జరిగితే అనకాపల్లి అసెంబ్లీ నుంచి సత్యవతిని.. పార్లమెంట్ నుంచి అమర్‌ను బరిలోకి దింపాలనే యోచనలో అధిష్టానం ఉందట. ఎందుకంటే ఇక్కడ బలమైన బీసీ, తూర్పు కాపు సామాజిక వర్గం ఉండటం.. పైగా అమర్ కూడా అదే సామాజిక వర్గం కావడంతో కలిసొస్తుందని వైసీపీ ప్లానట. ఇది సర్దుబాటు అవుతుంది సరే ఇక ఎంవీవీ పరిస్థితేంటి..? అనేది తెలియట్లేదట. పోనీ.. ఎంపీని ఈస్ట్ నుంచి పోటీచేయిస్తే.. ఎంపీగా ఎవర్ని బరిలోకి దింపాలి..? అక్కడ అభ్యర్థి దొరికితే ఈస్ట్‌లో ఉన్న విజయ నిర్మలను ఎక్కడ్నుంచి పోటీ చేయించాలి..? ఇలా పెద్ద కన్ఫూజన్‌గానే ఉందట. మరోవైపు దాడి ఫ్యామిలీ కూడా టికెట్ ఆశిస్తోంది. అసలే వైజాగే రాజధాని అని జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఒకర్ని కదిపిన మూలంగా.. సీట్లు తగ్గితే పరువు పోతుందని వైసీపీలోని కొందరు ముఖ్యులు జగన్‌కు చెబుతున్నారట. చూశారుగా ఒక్కరిని మారిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో.. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఏం చేస్తారు..? ఎవర్నీ మార్చే పరిస్థితి లేదని మిన్నకుండిపోయి యథావిధిగా బరిలోకి దింపుతారో వేచి చూడాల్సిందే మరి.

JAGAN.jpg


ఇవి కూడా చదవండి


TS Politics : బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటిద్దామనుకున్న కేసీఆర్‌కు బిగ్ ఝలక్.. నెలాఖరులోగా 28 మంది ఎమ్మెల్యేలు ఔట్!?


ABN Fact Check : గుడివాడలో నానిని దెబ్బకొట్టేందుకు ‘నారా’స్త్రం.. నిజంగానే నారా రోహిత్‌ బరిలోకి దిగుతున్నారా..!?


TS Politics : కేసీఆర్ వ్యూహాత్మక నిర్ణయం.. దాసోజుకు లక్కీ ఛాన్స్.. దానంకు లైన్ క్లియర్!


TSRTC : ఎన్నికల ముందు కేసీఆర్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం


Manoj Meets CBN : చంద్రబాబుతో భేటీ తర్వాత మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఫిక్స్ అయినట్లే..!


AP Politics : చంద్రబాబు నివాసానికి మంచు మనోజ్.. ఏపీ రాజకీయాల్లో సర్వత్రా చర్చ.. ఇందుకేనా..!?


Updated Date - 2023-08-01T17:16:54+05:30 IST