YS Bhaskar Reddy Arrest Live Updates : భాస్కర్‌రెడ్డికి అమాంతం పెరిగిపోయిన బీపీ.. 14 రోజులు రిమాండ్ విధించిన సీబీఐ కోర్ట్.. ఉదయం అరెస్ట్ నుంచి ఇప్పటి వరకూ ఇలా..
ABN , First Publish Date - 2023-04-16T09:31:25+05:30 IST
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో దూకుడు పెంచిన సీబీఐ అధికారులు..
05:00 pm : 14 రోజుల రిమాండ్
వివేకా కేసులో భాస్కర్ రెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
భాస్కర్ రెడ్డికి రిమాండ్ విధించిన సీబీఐ కోర్టు
ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి
అనంతరం రిమాండ్ విధించిన సీబీఐ న్యామూర్తి
భాస్కర్ రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలిస్తున్న పోలీసులు
కస్టడీ ఇవ్వాలని కోరిన సీబీఐ అధికారులు
బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన భాస్కర్ రెడ్డి తరుపు న్యాయవాది నాగార్జున రెడ్డి
04:30 pm : మేజిస్ట్రేట్ ముందు హాజరు..
వివేకా కేసులో భాస్కర్ రెడ్డిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచిన సీబీఐ
భాస్కర్ రెడ్డి మెడికల్ రిపోర్టును న్యాయమూర్తి ముందు పెట్టిన సీబీఐ
04:30 pm : సీబీఐపై సంచలన ఆరోపణలు..
తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్‌పై ఎంపీ అవినాష్ రెడ్డి స్పందన
భాస్కర్‌రెడ్డిని ఊహించని విధంగా అరెస్ట్ చేశారు
సీబీఐ ఈ స్థాయికి దిగజారడం విచారకరం
అధికారుల తీరుపై సీబీఐ పెద్దలకు తెలియజేశాం
పాత అధికారుల తప్పులనే కొత్తవాళ్లూ కొనసాగిస్తున్నారు
మేం లేవనెత్తిన కీలక అంశాలపై సీబీఐ స్పందించట్లేదు
వివేకా స్వయంగా రాసిన లేఖను సీబీఐ పట్టించుకోవట్లేదు
పోలీసులకు నేనే స్వయంగా సమాచారం ఇచ్చా
వివేకా హత్య గురించి ముందుగా తెలిసింది ఆయన అల్లుడికే
నా కంటే ముందే తెలిసినా వివేకా అల్లుడు పోలీసులకు చెప్పలేదు
సమాచారం దాచిన వివేకా అల్లుడిని ఎందుకు విచారించట్లేదు?
హత్య చేసిన దస్తగిరిని అప్రూవర్గా ఎలా మార్చుతారు?
వాస్తవాల ఆధారంగా విచారణ జరగాలి.. వ్యక్తుల టార్గెట్‌గా కాదు
మమ్మల్ని దోషులుగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు
అర్థం పర్థం లేని విషయాలను సీబీఐ పెద్దగా చూపిస్తోంది: అవినాశ్‌రెడ్డి
03:40 pm : భాస్కర్‌రెడ్డికి పెరిగిపోయిన బీపీ..
వైఎస్ భాస్కర్‌రెడ్డికి పెరిగిన బీపీ
బీపీ 170గా ఉండటంతో వైద్య పరీక్షలు
భాస్కర్ రెడ్డికి సెలైన్ ఎక్కించి చికిత్స అందించిన ఉస్మానియా వైద్యులు
మరోవైపు టుడి ఎకో పరీక్ష కూడా చేసిన ఉస్మానియా వైద్యులు
02:50 pm : భాస్కర్‌రెడ్డికి వైద్య పరీక్షలు..
పులివెందుల నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న భాస్కర్ రెడ్డి కాన్వాయ్
నేరుగా ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లిన సీబీఐ అధికారులు
ఆస్పత్రిలో భాస్కర్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్లు
వైద్య పరీక్షలు అనంతరం సీబీఐ న్యాయమూర్తి నివాసానికి తరలించనున్న అధికారులు
02:40 pm : భాస్కర్ రెడ్డి అరెస్ట్‌పై నిరసనలు
భాస్కర్ రెడ్డి అరెస్ట్‌ను నిరసిస్తూ ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా వైసీపీ ర్యాలీలు
నల్ల బ్యాడ్జీలు ధరించి సీబీఐకి వ్యతిరేకంగా ధర్నాలు
అక్రమ అరెస్ట్ అంటూ వైసీపీ శ్రేణుల ఆందోళనలు
సీబీఐ దిష్టిబొమ్మను దగ్దం చేసిన వైసీపీ కార్యకర్తలు
పులివెందులలో దుకాణాలు మూసివేసిన వ్యాపారులు
02:30 pm : భాస్కర్ రెడ్డి అరెస్ట్ అక్రమం
వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ అక్రమం : ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
దర్యాప్తు సంస్థలు నిజాయితీగా విచారణ జరపాలి
వివేకా హత్యకేసులో దోషులను కాకుండా.. అవినాష్ రెడ్డి కుటుంబాన్ని సీబీఐ టార్గెట్ చేసింది
హత్యకు కారణం రాజకీయమా.. ఆర్థిక లావాదేవీలా, విహేతర సంబంధం, రెండో వివాహం హత్యకు కారణామా.,? ఇలా ఏ ఒక్క కోణంలోనూ దర్యాప్తు సంస్థలు విచారించడం లేదు.. : రాచమల్లు
02:15 pm : నాన్న అరెస్ట్‌తో హుటాహుటిన..!
వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత హుటాహుటిన హైదరాబాద్ నుంచి పులివెందులకు ఎంపీ అవినాష్ రెడ్డి
తండ్రి అరెస్టుతో తల్లి లక్ష్మి, కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పడానికి వచ్చిన ఎంపీ
సీబీఐ అధికారులు ఇచ్చిన అరెస్ట్ మెమోను...
కొడుకు అవినాష్‌రెడ్డికి ఇచ్చిన తల్లి లక్ష్మి
ఇవాళ రాత్రికి లేదా సోమవారం ఉదయం మళ్లీ హైదరాబాద్‌కు బయల్దేరనున్న అవినాష్ రెడ్డి
అవినాష్ రాకతో భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు
ఇవాళ ఉదయం నుంచే కడప జిల్లా వ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు
01:50 pm : హైదరాబాద్ చేరుకున్న భాస్కర్ రెడ్డి..
పులివెందుల నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న సీబీఐ బృందం
మరికొద్ది సేపట్లో ఉస్మానియా ఆస్పత్రికి భాస్కర్ రెడ్డి
స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చిన సీబీఐ అధికారులు
మెడికల్ చెకప్ తర్వాత మేజిస్ట్రేట్ ముందుకు భాస్కర్ రెడ్డి..!
01 :35 pm : చట్టానికి ఎవరూ అతీతులు కాదు..!
వైఎస్ వివేకా హత్య కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతోంది : మంత్రి ఆదిమూలపు సురేష్
చట్టానికి ఎవరూ అతీతులు కాదు.. సీఎం జగనే కేసును సీబీఐకి ఇవ్వమని చెప్పారు..
దోషులు ఎవరైతే ఉన్నారో బయటకు రావాల్సిందే.. : సురేష్
01 : 20 pm : కడపలో ర్యాలీ
వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ నిరసనగా మేయర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో నిరసన
కడప నగరంలోని సెవెన్ రోడ్స్ నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు వైసీపీ నేతలు, కార్యకర్తలు ర్యాలీ
01 :10pm : వైసీపీలో మొదలైన టెన్షన్..
భాస్కర్ రెడ్డి అరెస్ట్‌తో వైసీపీలో మొదలైన టెన్షన్
ఇప్పటికే రేపటి అనంతపురం టూర్‌ను రద్దు చేసుకున్న సీఎం వైఎస్ జగన్
ఈ వ్యవహారంపై ఎలా ముందుకెళ్లాలని సమాలోచనలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం
ఏం చేద్దాం.. ఎలా ముందుకెళ్దాం అని ముఖ్యనేతలతో సీఎం జగన్ అత్యవసర సమావేశమైనట్లు సమాచారం
మరోవైపు న్యాయ నిపుణులతోనూ మధ్యాహ్నం పైన ముఖ్య నేతలు చర్చించే ఛాన్స్
ఈ అరెస్ట్ వైసీపీకి చేదు అంశమే అంటున్న రాజకీయ విశ్లేషకులు
ముఖ్యంగా సొంత ఇంటి వారినే సీబీఐ అదుపులోకి తీసుకోవడం జగన్‌ను ఇరకాటంలో పడేసిందంటున్న విశ్లేషకులు
ఇన్ని రోజులు తమ ఇంటి వారు కాదని వారించిన జగన్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారా..? అనే దానిపై వైసీపీలో, ఏపీ ప్రజల్లో ఉత్కంఠ
ఇంతవరకూ వైసీపీ నుంచి గానీ.. కనీసం అవినాష్ రెడ్డి నుంచి రాని స్పందన
12:50 pm : జగన్ టూర్‌పై భాస్కర్‌రెడ్డి అరెస్ట్ ఎఫెక్ట్
సీఎం జగన్ టూర్‌పై వైఎస్ భాస్కర్‌రెడ్డి అరెస్ట్ ఎఫెక్ట్
అవినాష్ తండ్రి, వైఎస్ భారతి మేనమామ భాస్కర్‌రెడ్డి అరెస్ట్
రేపటి సీఎం జగన్ అనంతపురం పర్యటన రద్దు
నార్పలలో రేపు జరగాల్సిన జగనన్న వసతి దీవెన కార్యక్రమం
అనివార్య కారణాలతో సీఎం టూర్ రద్దు అయినట్టు ప్రకటన
గతంలో అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేస్తుందన్న ప్రచారంతో.. అసెంబ్లీ నడుస్తున్నా అకస్మాత్తుగా ఢిల్లీ వెళ్లి వచ్చిన సీఎం జగన్
జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత మందగించిన సీబీఐ విచారణ వేగం
సుప్రీంకోర్టు సీబీఐ అధికారిని మార్చడం..
దర్యాప్తునకు డెడ్‌లైన్ విధించడంతో దూకుడు పెంచిన సీబీఐ
వైఎస్ భారతి మేనమామ భాస్కర్‌రెడ్డి అరెస్ట్‌తో జగన్‌రెడ్డి పర్యటన రద్దంటూ రాజకీయ వర్గాల్లో చర్చ
12:40 pm : బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు
వైఎస్ వివేకా హత్య కేసులో తిమింగలాలను వదిలేసి చిన్న చిన్న చేపలను పట్టుకుంటున్నారు
వివేకా హత్యకు కర్త, కర్మ, క్రియ అన్ని తాడేపల్లి ప్యాలెస్సే..
తాడేపల్లి ప్యాలెస్ పాత్రను కూడా సీబీఐ బహిర్గతం చేయాలి
వైఎస్ భాస్కర్‌రెడ్డి అరెస్ట్‌తో.. వివేకా కన్నును ఏ కన్ను పొడిచిందో అందరికీ తెలిసింది : రవి
11: 50 AM : షాపులు మూసివేత..
వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్‌కు నిరసనగా వైసీపీ శాంతియుత ర్యాలీలు
పులివెందులలో స్వచ్ఛందంగా వ్యాపార దుకాణాలు మూసివేసిన షాపుల యజమానులు
11:18 AM : ఇంత జరుగుతున్నా అవినాష్ ఎక్కడ..!?
ఇవాళ తెల్లవారుజాము నుంచి పులివెందులలో హైటెన్షన్
ఓ వైపు వైసీపీ కార్యకర్తలు ఆందోళన.. మరోవైపు ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి సోదాలు
ఆఖరికి అరెస్ట్ చేసినా ఇంతవరకూ స్పందించని ఎంపీ అవినాష్
హైదరాబాద్‌లో అవినాష్ ఉన్నట్లుగా వార్తలు
ఇప్పటికే హైదరాబాద్‌లోని అవినాష్ ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లినట్లు సమాచారం
నెక్స్ట్ అవినాష్‌నే సీబీఐ అరెస్ట్ చేస్తుందని గుప్పుమంటున్న వార్తలు
ఈ వార్తలపై ఇంతవరకూ అటు సీబీఐ కానీ.. ఇటు వైసీపీ కానీ స్పందించని పరిస్థితి
ఏం జరుగుతుందో ఏమో అని వైసీపీలో టెన్షన్.. టెన్షన్
భాస్కర్ రెడ్డి అరెస్ట్‌పై కనీసం ఇప్పటి వరకూ ఒక్క ఎమ్మెల్యే కానీ.. మంత్రి కానీ స్పందించని పరిస్థితి.
10:08 AM : ఈ అరెస్ట్‌లు ఇంతటితో ఆగవ్..!
భాస్కర్ రెడ్డి అరెస్ట్‌పై ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ
రాజకీయం కోసం సొంత కుటుంబ సభ్యులనే చంపడం విచారకరం
ఈ అరెస్టులు ఇంతటితో ఆగవు
ఏ తప్పు చేయనప్పుడు భయం ఎందుకు..?
వైఎస్ వివేకా హత్య జరిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కో కథ చెప్పారు.. అప్పుడే రాష్ట్ర ప్రజలకు అర్ధమైంది
అరెస్టు పర్వం తాడేపల్లిలోని లాస్ట్ వ్యక్తి వరకు వెళ్తాయని అనుకుంటున్నాను..
విచారణ, అరెస్టులపై వాళ్ళకి ఫేవర్‌గా ఉన్నప్పుడు ఒకలాగా.. లేనప్పుడు మరోలాగా మాట్లాడతారు
బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను : అఖిల ప్రియ
10:05 AM : శాంతియుత ర్యాలీ
వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్‌కు నిరసనగా ర్యాలీలు
శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చిన కడప జిల్లా వైసీపీ జిల్లా అధిష్టానం
నేతల పిలుపు మేరకు పులివెందుల, కడప టౌన్‌లో శాంతియుత ర్యాలీలు
పులివెందులలో నిరసనకు భారీగా హాజరైన వైసీపీ శ్రేణులు
09 : 30 AM : ర్యాలీకి పిలుపు..
పులివెందులలో ర్యాలీకి వైసీపీ పిలుపు
వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్‌కు నిరసనగా ర్యాలీ
09 : 00 AM : హైదరాబాద్‌కు తరలింపు..
అరెస్ట్ తర్వాత భాస్కర్ రెడ్డిని పులివెందుల నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న సీబీఐ
కడప జిల్లా దాటిన సీబీఐ వాహనాలు
సీబీఐ స్పెషల్ కోర్టులో హాజరుపర్చనున్న అధికారులు
ఇవాళ మధ్యాహ్నం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుస్తామన్న అధికారులు
08 : 40 AM : భాస్కర్ రెడ్డిపై ఆరోపణలు ఇవీ..
వివేకా హత్యకేసులో భాస్కర్ రెడ్డి పాత్ర కీలకం - సీబీఐ
వివేకా హత్య ముందు, ఆ తర్వాత నిందితులను భాస్కర్ రెడ్డి ఇంటికి పిలిచి మాట్లాడారు - సీబీఐ
120 బి కుట్ర, 302 మర్డర్, 201 ఆధారాలు చెరిపేయడం సెక్షన్ కింద కేసు నమోదు చేశాం- సీబీఐ
08 : 30 AM : ఫోన్ సీజ్..
భాస్కర్ రెడ్డి ఫోన్ సీజ్ చేసిన సీబీఐ
08 : 00 AM : అరెస్ట్ సమాచారం ఎవరికిచ్చారు..?
భాస్కర్ రెడ్డి అరెస్ట్‌ని ఆయన భార్య శ్రీలక్ష్మి, పి. జనార్ధన్ రెడ్డికి సమాచారం
120 బి, రెడ్ విత్ 302, 201 సెక్షన్ల కింద కేసు
భాస్కర్ రెడ్డి భార్యకు మెమో ఇచ్చిన సీబీఐ
07 : 30 AM : టెన్షన్.. టెన్షన్
సీబీఐ అధికారులు పులివెందులకు రావడంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం
భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే సమాచారంతో భారీగా పులివెందులకు చేరుకున్న కార్యకర్తలు, వీరాభిమానులు
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో దూకుడు పెంచిన సీబీఐ అధికారులు (CBI) ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి తెస్తున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని (YS Bhaskar Reddy) సీబీఐ అరెస్ట్ చేసింది. ఆదివారం తెల్లవారుజామునే ముఖేష్ శర్మ నేతృత్వంలోని సీబీఐ బృందం పులివెందులకు (Pulivendula) చేరుకుంది. ఉదయం 5.30 గంటల సమయంలో భాస్కర్‌రెడ్డిని సీబీఐ బృందం అదుపులోకి తీసుకుంది. ఉదయం 6.10 నుంచి భాస్కర్ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత భాస్కర్‌రెడ్డి ఇంట్లోకి ఎవర్నీ సీబీఐ అనుమతించలేదు. అయితే కీలక ఆధారాలు సేకరించినట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి. భాస్కర్ రెడ్డి ఇంట్లోనే అరెస్ట్ మెమోను సీబీఐ సిద్ధం చేసింది. తన ఇంట్లోకి లాయర్‌ను అనుమతించాలని పదేపదే భాస్కర్ రెడ్డి కోరారు. అరెస్ట్ మెమోలో ఏముందో తమ లాయర్ ద్వారా తెలుసుకుంటామని భాస్కర్ రెడ్డి.. అధికారులను అడిగారు. ఆయన వినతిపై అధికారులు స్పందించలేదు.