Chandra Babu Arrest: చంద్రబాబు అరెస్ట్‌ గురించి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఎలా తెలిసిందంటే..

ABN , First Publish Date - 2023-09-09T12:11:51+05:30 IST

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు‌ అరెస్ట్‌ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్ట్‌ కావడం ఏపీ పాలిటిక్స్‌లో కీలక పరిణామంగా నిలిచింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబును A-1గా సీఐడీ పేర్కొంది. నంద్యాలలోని RK ఫంక్షన్‌ హాల్‌ దగ్గర చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.

Chandra Babu Arrest: చంద్రబాబు అరెస్ట్‌ గురించి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఎలా తెలిసిందంటే..

Live News & Update

  • 2023-09-09T18:30:00+05:30

    gov_chamber.jpg

    * విశాఖ: గవర్నర్ నజీర్ అపాయింట్‌మెంట్‌ కోరిన టీడీపీ నేతలు

    రాత్రి 7:30 గంటలకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చిన గవర్నర్‌ నజీర్‌

    విశాఖపట్నం గెస్ట్‌హౌస్‌లో కలవనున్న టీడీపీ నేతలు

    గవర్నర్‌ను కలవనున్న అచ్చెన్నాయుడుతో పాటు పలువురు టీడీపీ నేతలు

    గవర్నర్‌ను కలవకుండా టీడీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు

    ప్రస్తుతం నేతలందరిని వివిధ పోలీస్ స్టేషన్లలో ఉంచిన విశాఖ పోలీసులు

    గవర్నర్ అనుమతించినా టీడీపీ నేతలను విడుదల చేస్తారా లేదా అన్నది సందిగ్ధం

  • 2023-09-09T18:10:00+05:30

    * SIT కార్యాలయంలోకి చంద్రబాబు నాయుడు అడ్వకెట్లను అనుమతించని పోలీసులు

    అధికారుల తీరుపై అడ్వకేట్‌ల తీవ్ర అభ్యంతరం

    ప్రభుత్వ అడ్వకెట్లను అనుమతించి.. చంద్రబాబు లాయర్లు నిలిపివేయడంపై ఆగ్రహం

    ఉదయం అరెస్ట్ నుంచి ఇప్పటి వరకు అన్నిటిలో నిబంధనలకు విరుద్ధంగా దర్యాప్తు అధికారులు పని చేస్తున్నారని ఆరోపణ

    అడ్వకేట్లను ఏ నిబంధనల ప్రకారం, ఎందుకు అనుమతించడం లేదో చెప్పాలంటూ డిమాండ్

  • 2023-09-09T18:04:00+05:30

  • 2023-09-09T17:43:00+05:30

    Chandra-Babu-CIT-Office.jpg

    * అమరావతి: కుంచనపల్లిలోని సిట్ ఆఫీస్‌కు చంద్రబాబు

    స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి..

    పేవర్ వర్క్ పని పూర్తిచేస్తున్న అధికారులు

    చంద్రబాబుకు మద్దతుగా రోడ్ల వెంట వచ్చిన వారిపై..

    విచక్షణారహితంగా పోలీసుల లాఠీచార్జ్‌

    పోలీసుల లాఠీచార్జ్‌లో నిరసనకారులకు గాయాలు

    మరో గంటలో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి చంద్రబాబు

    చంద్రబాబుని వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లనున్న అధికారులు

    వైద్య పరీక్షల తర్వాత చంద్రబాబును కోర్టులో హాజరుపరచనున్న అధికారులు

  • 2023-09-09T17:10:00+05:30

    gov_chamber.jpg

    * చంద్రబాబు అరెస్ట్‌పై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్

    మాట వరసకైనా సమాచారం ఇవ్వకపోవడంపై గవర్నర్ అసంతృప్తిగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం

    స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు గవర్నర్ కార్యాలయాన్ని సంప్రదించని సీఐడీ అధికారులు

    మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును అరెస్టు చేయాలంటే అవినీతి నిరోధక చట్టం కింద గవర్నర్ అనుమతి తప్పనిసరి

    అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17 ఏ(సి) ప్రకారం గవర్నర్ అనుమతి తప్పనిసరి

    2018లో చేసిన చట్ట సవరణ తర్వాత గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిందే

    కానీ, ప్రస్తుత గవర్నర్, 2021లో కేసు నమోదు చేసినప్పుడు ఉన్న గవర్నర్ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని సమాచారం

    ఈ రోజు చంద్రబాబును అరెస్టు చేసిన వ్యవహారంపై కూడా గవర్నర్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొన్న విశ్వసనీయ వర్గాలు

    మీడియాలో వచ్చిన వార్తల ద్వారానే గవర్నర్ తెలుసుకున్నారన్న వర్గాలు

    చంద్రబాబు అరెస్టుపై ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు సమాచారం

  • 2023-09-09T16:40:00+05:30

    sidharth-luthra.jpg

    * విజయవాడకు సుప్రీంకోర్టు లాయర్‌ సిద్ధార్థ లూథ్రా

    చంద్రబాబు తరఫున వాదించనున్న లాయర్‌ సిద్ధార్ధ లూథ్రా

    ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు లాయర్‌ లూథ్రా

    చంద్రబాబు తరపు కేసులను వాదిస్తున్న లాయర్‌ సిద్దార్ద లూథ్రా

    మరికాసేపట్లో ACB కోర్టులో చంద్రబాబు కేసు విచారణ

  • 2023-09-09T16:30:00+05:30

    pawan-vizag.jpg

    * విజయవాడలో పోలీసులు మరింత అప్రమత్తం

    శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు

    పవన్ ప్రత్యేక విమానానికి పోలీసులు అనుమతి నిరాకరణ

    చంద్రబాబును కలిసేందుకు అనుమతిలేదంటున్న పోలీసులు

    కుటుంబసభ్యులను మాత్రమే అనుమతిస్తామన్న పోలీసులు

    భువనేశ్వరి, లోకేశ్‌కు అనుమతిస్తాం: పోలీసులు

  • 2023-09-09T16:20:00+05:30

    * అనంతపురం: చంద్రబాబు అరెస్టుతో విషాదం

    గుత్తి మండలం ధర్మాపురంలో విషాదం

    చంద్రబాబు అక్రమ అరెస్టు వార్తలను చూస్తూ..

    కుప్పకూలిన టీడీపీ వార్డ్ మెంబర్ వడ్డే ఆంజనేయులు

    గుండెపోటుతో టీడీపీ వార్డ్ మెంబర్ వడ్డే ఆంజనేయులు మృతి

  • 2023-09-09T16:05:00+05:30

    vishnukumar-raju.jpg

    * విశాఖ: ABNతో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్టుకుమార్‌రాజు

    చంద్రబాబుపై అక్రమ కేసులను ఖండిస్తున్నాం: విష్టుకుమార్‌రాజు

    అర్ధరాత్రి సమయంలో నోటీసులు ఇవ్వడం..అరెస్టు చేయడం ఏంటి?

    చంద్రబాబు పారిపోయే మనిషి కాదు: విష్టుకుమార్‌రాజు

    విచారణకు పిలవకుండా..డైరెక్ట్‌గా ఎలా అరెస్టు చేస్తారు?: విష్టుకుమార్‌రాజు

    చంద్రబాబు సభలకు వస్తున్న ప్రజాదారణ చూసి ఓర్వలేక ఇలా చేస్తున్నారు

    ఆయనను ప్రజల వద్దకు వెళ్లనీయకుండా చేయడానికి కుట్రలు పన్నుతున్నారు

    గతంలో పవన్‌కల్యాణ్‌ని తిరగనివ్వలేదు: విష్టుకుమార్‌రాజు

    లోకేశ్‌ మీద కూడా దాడులు చేశారు: విష్టుకుమార్‌రాజు

    జగన్ అప్రజాస్వామిక పనులను వైసీపీ నేతలు తిట్టుకుంటున్నారు

    వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 25 అసెంబ్లీ స్థానాలు కంటే మించి రావు: విష్టుకుమార్‌రాజు

  • 2023-09-09T15:52:00+05:30

    * కృష్ణా: టీడీపీ ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

    హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఎమ్మెల్యేలు

    విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు

    గన్నవరం పోలీస్ స్టేషన్‌కు తరలింపు

  • 2023-09-09T15:35:00+05:30

    Suhasini.jpg

    పోరాటం ఆగదు..

    అక్రమ అరెస్టులు చేసినంత మాత్రాన మా నాయకుడి పోరాటం ఆగదు. తెలుగు ప్రజలకోసం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడిన గొప్ప నాయకుడు చంద్రబాబు. ఒక మాజీ ముఖ్యమంత్రిపై నిరాధారమైన ఆరోపణలు చేసి, అర్థరాత్రి అరెస్టు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలుగు ప్రజలు సరైన బుద్ధి చెప్పే రోజు ఆసన్నమైనదని ఈ అరెస్టుతో అర్థం అవుతుంది. చంద్రబాబు అక్రమ అరెస్టుకు తీవ్రంగా ఖండిస్తున్నాను’ అని టీటీడీపీ తెలంగాణ ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని ఒక ప్రకటనలో తెలిపారు.

  • 2023-09-09T15:32:00+05:30

    CBN-Bojanam.jpg

    భోజనానికి ఆగిన చంద్రబాబు!

    విజయవాడ మార్గమధ్యలో భోజనానికి ఆగిన చంద్రబాబు

    గుంటూరు శివారులోని చిన్నకోండ్రుపాడు వద్దకు చేరుకున్న చంద్రబాబు

    భోజనం కోసం కొంతసేపు ఆగిన బాబు

    భోజనం అనంతరం నేరుగా కుంచనపల్లిలోని..

    సిట్ దర్యాప్తు కార్యాలయానికి చంద్రబాబుని తీసుకువెళ్లనున్న అధికారులు

  • 2023-09-09T15:15:00+05:30

    CBN-Arr.jpg

    ఏం జరుగుతుందో ఏమో..?

    గుంటూరుకు చేరువలో చంద్రబాబు కాన్వాయ్

    కాసేపట్లో విజయవాడకు చంద్రబాబు

    సివిల్ కోర్టు వద్ద భారీ బందోబస్తు

    దాదాపు 200 మంది పోలీసులు మొహరింపు

    మరికాసేపట్లో చంద్రబాబును కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు

    సిటీ ఆఫీసుకు వెళ్లే దారిని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు

    పోలీసుల అదుపులో తాడేపల్లి సిట్ కార్యాలయం

    బాబును నేరుగా సిట్ ఆఫీసుకు తరలించనున్న పోలీసులు

    చంద్రబాబును రిమాండ్‌కు ఇవ్వాలని కోరనున్న సీఐడీ

    అంతా మంచే జరగాలని కోరుకుంటున్న టీడీపీ కార్యకర్తలు, బాబు వీరాభిమానులు

  • 2023-09-09T15:05:00+05:30

    Lokesh.jpg

    చినబాబు వచ్చాడు!

    యువగళం పాదయాత్ర అర్ధాంతరంగా ఆపేసి ఉండవల్లికి చేరుకున్న నారా లోకేష్

    కొద్దిసేటి క్రితమే తన నివాసానికి చేరుకున్న లోకేష్

    చంద్రబాబు అరెస్ట్‌పై లాయర్లతో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్న లోకేష్‌

    కోర్టులో హాజరు పరిచే సమయానికి విజయవాడ వచ్చే ఆలోచనలో లోకేష్‌

    చినబాబు వచ్చాడు.. ఇక కాస్కోండి అంటూ లోకేష్ నివాసం దగ్గర కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు నినాదాలు

  • 2023-09-09T14:55:00+05:30

    Babu-Convoy.jpg

    కాన్వాయ్ కదిలింది..

    చిలకలూరిపేటలో కదిలిన చంద్రబాబు కాన్వాయ్

    చంద్రబాబు విజ్ఞప్తితో పక్కకు తప్పుకున్న కార్యకర్తలు

    ప్రజలు, కార్యకర్తలు సంయమనం పాటించాలని చంద్రబాబు సూచన

    కాసేపట్లో విజయవాడకు చంద్రబాబు

    సివిల్ కోర్టు వద్ద భారీ బందోబస్తు

  • 2023-09-09T14:40:00+05:30

    Anama.jpg

    కడిగిన ముత్యంలా బయటికొస్తారు..

    సజ్జలపై ఆనం రామనారాయణరెడ్డి ఫైర్

    సలహాదారులు, మంత్రుల మాటలు వినే పరిస్థితుల్లో ఏపీ ప్రజలు లేరు

    రాజకీయంగా ఎదుర్కోలేకనే చంద్రబాబు అరెస్ట్

    మళ్ళీ గెలవనని సీఎం‌ జగన్ కు అర్థమైంది. అందుకే చంద్రబాబును అరెస్ట్ చేయించారు

    43 కోట్ల ప్రజా ధనంతో సీఎం జగన్ సొంత పర్యటనకు వెళ్ళారు

    చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు

    చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ యాత్రలతో జగన్‌లో వణుకు మెదలైంది : ABNతో ఎమ్మెల్యే ఆనం

  • 2023-09-09T14:25:00+05:30

    Palnadu.jpg

    * పల్నాడు: చిలకలూరిపేటలో తీవ్ర ఉద్రిక్తత

    చంద్రబాబును తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్న కార్యకర్తలు

    చిలకలూరిపేట హైవేపై బైఠాయించిన టీడీపీ శ్రేణులు

    చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ శ్రేణుల ఆందోళన

    టీడీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్, ఉద్రిక్తత

  • 2023-09-09T14:11:00+05:30

    Nara-Bhuvneswari.jpg

    * విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న నారా భువనేశ్వరి

    బాధలు చెప్పుకునేందుకే దుర్గమ్మను దర్శించా: భువనేశ్వరి

    నా భర్తను కాపాడమని దుర్గమ్మను కోరుకున్నా: భువనేశ్వరి

    నా భర్త ప్రజల కోసమే పోరాడుతున్నారు: నారా భువనేశ్వరి

    నా భర్త చేస్తున్న పోరాటం విజయం సాధిస్తుంది: భువనేశ్వరి

    చంద్రబాబు పోరాటానికి ప్రజలు మద్దతు ఇవ్వాలి: భువనేశ్వరి

  • 2023-09-09T13:56:00+05:30

    CBI-Ex-Director.jpg

    * చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన CBI మాజీ డైరెక్టర్‌ నాగేశ్వరరావు

    చంద్రబాబు అరెస్ట్ అక్రమం, చట్ట విరుద్ధం: నాగేశ్వరరావు

    గవర్నర్ అనుమతి లేకుండా అరెస్టు చేయడం చట్టవిరుద్ధం

    అవినీతి నిరోధక చట్టం ప్రకారం దర్యాప్తు చేసేందుకు..

    గవర్నర్ అనుమతి తప్పనిసరి: CBI మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు

    గవర్నర్ అనుమతి విషయంలో స్పష్టత కరువైంది: నాగేశ్వరరావు

    గవర్నర్ అనుమతి తీసుకోకపోయినా, ఇవ్వకపోయినా..

    దర్యాప్తు చెల్లుబాటు కాదన్న CBI మాజీ డైరెక్టర్‌ నాగేశ్వరరావు

  • 2023-09-09T13:40:00+05:30

    lokesh-ananta-3.jpg

    * కోనసీమ: పొదలాడ నుంచి విజయవాడ బయల్దేరిన లోకేశ్‌

    యువగళం క్యాంప్‌ నుంచి విజయవాడ బయల్దేరిన లోకేశ్‌

    దాదాపు 5 గంటలపాటు ఎండలోనే రోడ్డుపై బైఠాయించి నిరసన

    తండ్రిని చూసేందుకు అనుమతించాలని నిరసన తెలిపిన లోకేశ్‌

    పోలీసులు అనుమతించడంతో విజయవాడ బయల్దేరిన లోకేశ్‌

  • 2023-09-09T13:30:00+05:30

    Pawan-Kalyan.jpg

    * విజయవాడకు పవన్‌ కల్యాణ్

    చంద్రబాబును పరామర్శించనున్న పవన్‌ కల్యాణ్‌

    చంద్రబాబు అరెస్ట్‌ రాజకీయ కక్ష సాధింపేనన్న పవన్‌

  • 2023-09-09T13:20:00+05:30

    Chandra-Babu-Pawan-Kalyan.jpg

    * చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన జనసేన అధినేత పవన్‌

    ఏ తప్పూ చేయని నాయకులను జైల్లో పెట్టి వేధిస్తున్నారు

    రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి పట్ల పోలీసుల తీరు దారుణం

    ఇలాంటి చర్యలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది: పవన్‌

    ప్రాథమిక ఆధారాలు చూపకుండా అరెస్ట్‌ చేయడం సరికాదు

    లా అండ్ ఆర్డర్‌ను కాపాడాల్సింది పోలీసులే కదా?: పవన్‌

    లా అండ్ ఆర్డర్‌ విషయంలో వైసీపీకి సంబంధమేంటి?: పవన్‌

    అరాచకాలు జరుగుతున్నది వైసీపీ వల్లే కదా?: పవన్‌

    నాయకుడు అరెస్టైతే.. అభిమానులు రోడ్లపైకి వస్తారు: పవన్‌

    నాయకుడికి మద్దతుగా రావడం ప్రజాస్వామ్యంలో భాగమే

    ఇళ్లలో నుంచి బయటకు రాకూడదంటే ఎలా?: పవన్‌

    మీ నాయకులు అక్రమాలు, దోపిడీ చేసినా విదేశాలకు వెళ్లొచ్చు

    ఒక నాయకుడు అరెస్టైతే కార్యకర్తలు బయటకురావొద్దా?

    చంద్రబాబు అరెస్ట్‌ రాజకీయ కక్ష సాధింపు చర్యే: పవన్‌

  • 2023-09-09T13:15:00+05:30

    98268576_2678496852379232_8971640026496499712_n.jpg

    * చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన దర్శకుడు రాఘవేంద్రరావు

    ఏపీలో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది: రాఘవేంద్రరావు

    విజనరీ లీడర్‌ చంద్రబాబు అరెస్ట్‌ తీరు అప్రజాస్వామికం

  • 2023-09-09T13:00:00+05:30

    Nara-Bhuvaneswari.jpg

    * అమరావతి: దుర్గమ్మ దర్శనానికి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి

    బెజవాడ దుర్గమ్మను దర్శించుకోనున్న నారా భువనేశ్వరి

    సెప్టెంబర్ 10న చంద్రబాబు, భువనేశ్వరిల వివాహ వార్షికోత్సవం

    చంద్రబాబుతో కలిసి దర్శించుకోవాలని భావించిన భువనేశ్వరి

    చంద్రబాబు అరెస్ట్‌తో ఈరోజే దుర్గగుడికి వెళుతున్న భువనేశ్వరి

  • 2023-09-09T12:50:00+05:30

    chandra babu.jpg

    * నేను ఏ తప్పు చేయలేదు: చంద్రబాబు

    అర్ధరాత్రి పోలీసులు భయభ్రాంతులకు గురిచేశారు

    ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారని అడిగా: చంద్రబాబు

    నేనేం తప్పు చేశాను?, ఆధారాలేవీ అని అడిగా: చంద్రబాబు

    ప్రజా సమస్యలపై పోరాడుతుంటే అణిచివేస్తున్నారు: చంద్రబాబు

    ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత లేదా?

    కార్యకర్తలు సంయమనం పాటించాలి: చంద్రబాబు

    ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డుపై హత్యచేశారు: చంద్రబాబు

    ప్రజా సమస్యలపై పోరాడుతుంటే అడ్డుకుంటున్నారు

    నేను తప్పు చేస్తే నిరూపించాలి: చంద్రబాబు

    ఎన్ని కుట్రలు చేసినా చివరకు ధర్మమే గెలుస్తుంది: చంద్రబాబు

  • 2023-09-09T12:23:00+05:30

    Ganta-Srinivasa-rao.jpg

    * విశాఖలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అరెస్ట్‌

    గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ అరెస్ట్‌

    అమరావతి భూముల కేసులో నా పేరు చేర్చారు: గంటా

    ఎన్ని విచారణలు జరిగినా నా ప్రస్తావన రాలేదు

    ఏ కేసునైనా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నా: గంటా

  • 2023-09-09T12:15:00+05:30

    lokesh-media-1.jpg

    * పిచ్చోడు లండన్‌కి...మంచోడు జైలుకి.. ఇది రాజారెడ్డి రాజ్యాంగం

    FIRలో పేరు లేదు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదు

    మిగిలేది కేవలం లండన్ పిచ్చోడి కళ్లలో ఆనందం

    నువ్వు తల కిందులుగా తపస్సు చేసినా...

    చంద్రుడిపై అవినీతి మచ్చ వెయ్యడం సాధ్యం కాదు సైకో జగన్: లోకేశ్‌

  • 2023-09-09T12:13:00+05:30

    * ప్రకాశం: గిద్దలూరు దాటిన చంద్రబాబు కాన్వాయ్

    కాన్వాయ్ వెళ్తున్న మార్గంలో భారీగా పోలీసుల మోహరింపు

    కాన్వాయ్ వెళ్తున్న మార్గంలో టీడీపీ శ్రేణుల ఆందోళనలు

    టీడీపీ శ్రేణులను అరెస్టు చేసిన పోలీసులు

  • 2023-09-09T12:10:00+05:30

    * చంద్రబాబు అరెస్ట్‌తో కోర్టుకు టీడీపీ లీగల్‌ సెల్‌

    సీఐడీ రిమాండ్‌ను కోర్టులో ఛాలెంజ్‌ చేయనున్న టీడీపీ

    రిమాండ్‌ రిజెక్ట్‌ చేయాలని కోరనున్న టీడీపీ లీగల్‌ సెల్‌

    రిమాండ్‌ రిజెక్ట్‌తో పాటు బెయిల్‌ పిటిషన్‌ వేయనున్న లీగల్‌ సెల్‌

  • 2023-09-09T12:05:00+05:30

    sanjay.jpg

    * స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్ట్‌: CID చీఫ్‌ సంజయ్‌

    స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో రూ.550 కోట్ల స్కామ్‌ జరిగింది

    స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ప్రధాన నిందితుడు చంద్రబాబు

    ప్రభుత్వానికి రూ.371 కోట్ల నష్టం జరిగింది: CID చీఫ్‌ సంజయ్‌

    చంద్రబాబుకు అన్ని లావాదేవీల గురించి తెలుసు: CID చీఫ్‌ సంజయ్‌

    నకిలీ ఇన్‌వాయిస్‌లతో షెల్‌ కంపెనీలకు నిధులు మళ్లించారు: సంజయ్‌

    చంద్రబాబును ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది: సంజయ్‌

    చంద్రబాబును కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది

    స్కామ్‌లో చంద్రబాబు పాత్ర ఉందని సృష్టమైంది: CID చీఫ్‌ సంజయ్‌

    ఇది లోతైన ఆర్థిక నేరం: CID చీఫ్‌ సంజయ్‌

    ఈడీ, జీఎస్టీ కూడా ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నాయి: సంజయ్‌

    ఆధారాలన్నీ కూడా కోర్టుకు సమర్పిస్తాం: CID చీఫ్‌ సంజయ్‌

    నారా లోకేశ్‌ పాత్రపైనా విచారణ చేస్తాం: CID చీఫ్‌ సంజయ్‌

    సాక్షులను ప్రభావితం చేస్తారనే చంద్రబాబును అరెస్ట్‌ చేశాం: CID

  • 2023-09-09T12:00:00+05:30

    అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు‌ అరెస్ట్‌ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్ట్‌ కావడం ఏపీ పాలిటిక్స్‌లో కీలక పరిణామంగా నిలిచింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబును A-1గా సీఐడీ పేర్కొంది. నంద్యాలలోని RK ఫంక్షన్‌ హాల్‌ దగ్గర చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. క్రైం నెంబర్‌ 29/2021 కింద చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసింది. నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌పై కేసులు నమోదు చేసింది. చంద్రబాబును సీఐడీ ఆఫీస్‌కు తరలించాలని నిర్ణయించారు. ప్రస్తుతం సీఐడీ పోలీసుల అదుపులో చంద్రబాబు ఉన్నారు. అయితే.. పోలీసులపై తమకు నమ్మకం లేదని టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా ఆందోళనలకు దిగాయి. టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు సర్వీసులను రద్దు చేసింది. దీంతో.. రాష్ట్ర వ్యాప్తంగా చాలాచోట్ల బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది.