DS Health : డీఎస్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఐసీయూలో చికిత్స

ABN , First Publish Date - 2023-09-11T22:22:54+05:30 IST

కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ (Dharmapuri Srinivas) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. సిటీ న్యూరో ఆస్పత్రిలో(Citi Neuro Centre Hospital) కుటుంబ సభ్యులు చేర్చారు...

DS Health : డీఎస్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఐసీయూలో చికిత్స

కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ (Dharmapuri Srinivas) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. సిటీ న్యూరో ఆస్పత్రిలో(Citi Neuro Centre Hospital) కుటుంబ సభ్యులు చేర్చారు. ప్రస్తుతం ఐసీయూలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. డీఎస్ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. మరో అరగంటలో ఆయన ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. బులెటిన్ కోసం అభిమానులు, కుటుంబ సభ్యులు వేచి చూస్తున్నారు. డీఎస్ ఆరోగ్యంగా తిరిగి రావాలని అభిమానులు పూజలు చేస్తున్నారు. ఇప్పటికే సిటి న్యూరో ఆస్పత్రికి అభిమానులు తరలివచ్చారు.


DS.jpg

గతంలో కూడా..!

కాగా.. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతంలోనే డీఎస్‌కు బ్రెయిన్ స్ట్రోక్ (Brain Stroke) రావడంతో పక్షవాతం కూడా సోకింది. మార్చి నెలలో తీవ్ర అనారోగ్యానికి గురవ్వగా ఇదే సిటీ న్యూరో సెంటర్‌కు తరలించిన కుటుంబ సభ్యులు చికిత్స అందించారు. ఆ తర్వాత డీఎస్ కోలుకున్నారు కూడా. అయితే అంతా బాగుందనుకున్న టైమ్‌లో ఇప్పుడు సడన్‌గా ఇలా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు.. డీఎస్ ఆరోగ్యంపై కాంగ్రెస్ కీలక నేతలు ఎప్పటికప్పుడు ఆరాతీస్తున్నారు.


ఇవి కూడా చదవండి


Chandrababu Case : చంద్రబాబు హౌస్ రిమాండ్‌పై ఏసీబీ కోర్టు తీర్పు వాయిదా.. ఎప్పుడొస్తుందంటే..!?


NCBN Arrest : చంద్రబాబు అరెస్ట్‌తో బాధ్యతగా నారా లోకేష్ కీలక నిర్ణయం


Chandrababu Case : చంద్రబాబు హౌస్ రిమాండ్‌పై ఏసీబీ కోర్టు తీర్పు వాయిదా.. ఎప్పుడొస్తుందంటే..!?


CBN House Custody : హౌస్ కస్టడీపై ఏసీబీ కోర్టు తీర్పుకు ముందు కీలక పరిణామం


NCBN Arrest : చంద్రబాబును హౌస్‌ రిమాండ్‌కు ఇవ్వాలని లూథ్రా ఎందుకు అడుగుతున్నారంటే..?


CBN House Custody : ముగిసిన వాదనలు.. మరో అరగంటలో కీలక తీర్పు


NCBN Arrest : చంద్రబాబు కేసుపై ఏసీబీ కోర్టులో వాడివేడిగా వాదనలు.. లూథ్రా టీమ్ ఏం చేయబోతోంది..!?




Updated Date - 2023-09-11T22:23:40+05:30 IST