Janasena : అనూహ్యంగా ‘వారాహి’ని వెనక్కి పంపిన పవన్ కల్యాణ్.. సీన్ కట్ చేస్తే..!

ABN , First Publish Date - 2023-03-14T22:01:47+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం వేదికగా జనసేన (Janasena) పదో ఆవిర్భావ సభ వేడుక జరుగుతోంది. పదేళ్ల ప్రయాణంలో జనసేన ఏం చేసింది..?

Janasena : అనూహ్యంగా ‘వారాహి’ని వెనక్కి పంపిన పవన్ కల్యాణ్.. సీన్ కట్ చేస్తే..!

ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం వేదికగా జనసేన (Janasena) పదో ఆవిర్భావ సభ వేడుక జరుగుతోంది. పదేళ్ల ప్రయాణంలో జనసేన ఏం చేసింది..? రానున్న ఎన్నికల్లో పార్టీ ఏం చేయబోతోంది..? అనే విషయాలను ఈ సభావేదికగా అధినేత పవన్ కల్యాణ్ ఫుల్ క్లారిటీ ఇవ్వబోతున్నారు. వాస్తవానికి ఈ ఆవిర్భావ సభ సాయంత్రం 6 గంటలకే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ పవన్ రావడం చాలా ఆలస్యమైంది. 9.35 నిమిషాలకు పవన్ (Pawan Kalyan) సభాప్రాంగణానికి చేరుకున్నారు. సాయంత్రమే బయల్దేరి సభావేదికకు చేరుకోవాలని పవన్ ప్లాన్ చేసుకున్నారు. సరిగ్గా సాయంత్రం 6 గంటలకు హాజరుకావాలని ‘వారాహి’ వాహనంపై బయల్దేరగా.. ర్యాలీలో అశేష సంఖ్యలో జనసైనికులు, ప్రజలు హాజరుకావడంతో నెమ్మదిగా సాగింది. ఆలస్యం కావడంతో పవన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఉయ్యూరు సమీపంలో ‘వారాహి’ దిగిన పవన్ కాన్వాయ్‌లో వెళ్లారు. అయినప్పటికీ ఆయన వెంటే వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. కాన్వాయ్‌లో వెళ్లినప్పటికీ సమయం 9 గంటలు దాటిపోయింది. దీంతో సభావేదిక వద్ద వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు ఆయన రాకకోసం వేచి చూడాల్సి వచ్చింది. పవన్ ఎంతసేపటికీ రాకపోవడంతో అభిమానులు కాస్త అసంతృప్తికి లోనయ్యారు.

Varahi-Pawan.jpg

పవన్ ఆలస్యంగా వచ్చినా ఆయన సభాప్రాంగణంలోనికి అడుగుపెట్టడంతో అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు ఈలలు, కేకలతో హోరెత్తించారు. ‘జై పవన్.. జైజై పవన్.. జై జనసేన ’ అంటూ నినదించారు. ఇక వీరాభిమానులు అయితే ‘ఏపీకి.. కాబోయే సీఎం పవన్’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అభివాదం చేస్తూ పవన్ సభావేదికపైకి వచ్చారు. ఈ సందర్భంగా.. ఆత్మహత్య చేసుకున్న కౌలురైతుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. ఒక్కో కౌలురైతు కుటుంబానికి రూ.లక్ష చొప్పున చెక్కులు అందించారు.

Pawan-kalyan.jpg

బహిరంగ సభలో జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ప్రసంగించారు. నిజాయితీతోనే ఇన్నాళ్లు జనసేన నిలబడిందని.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పవన్ వెనకడుగు వేయలేదన్నారు. ఏపీ ప్రజలను జగన్ మోసం చేశారని.. ఇళ్ల పేరుతో ప్రతి కుటుంబాన్ని జగన్ మోసం చేశారని వ్యాఖ్యానించారు. పార్టీ సభ్యత్వ కార్యక్రమాలు చేపట్టిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ నేతలకు పబ్లిసిటీ పిచ్చి పట్టిందని.. బటన్ నొక్కుడు పేరుతో ప్రచారం చేసుకుంటున్నారని నాదెండ్ల మండిపడ్డారు.

*************************

ఇది కూడా చదవండి..

*************************

AP Assembly : అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసిపోయిన ఆనం.. కోటంరెడ్డి సంగతేంటంటే..!

*************************

YSRCP : ఏపీ కేబినెట్‌ నుంచి ముగ్గురు ఔట్ కానున్నారా.. జగన్ ప్రకటనతో మంత్రుల్లో పెరిగిపోయిన టెన్షన్.. ఇంతకీ వారెవరు..!?

*************************

Kiran Reddy : ఏపీలో బీజేపీకి ఆశా ‘కిరణ్’మా.. ఈయన్ను పార్టీ ఎలా వాడుకోబోతోంది.. అధిష్ఠానం ప్లానేంటి..!?


******************************

TS BJP : అరెరే.. అమిత్ షా సాక్షిగా బండి, కిషన్ రెడ్డి ఇలా చేశారేంటబ్బా.. ఇదేందయ్యా ఇది.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫొటోలు..!


******************************

Oscar to RRR : ఆహా.. బండి సంజయ్‌లో ఇంత మార్పా.. నాడు తిట్లు.. నేడు ప్రశంసలు.. అప్పుడు భయపడి ఉంటే..!


******************************

Updated Date - 2023-03-14T22:09:44+05:30 IST