Home » AP Politics
42 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని చరిత్రాత్మకంగా గుర్తు చేస్తూ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తన అనుభవాలను పంచుకున్నారు.1995 ఆగస్టు సంక్షోభంలో తన పాత్రను వివరిస్తూ, టీడీపీలో తనకు దక్కిన స్థానం ప్రత్యేకమని అన్నారు
క్వార్ట్జ్ అక్రమ తవ్వకంపై కేసులో వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. అరెస్టు నుంచి రక్షణ కోరుతూ వేసిన అనుబంధ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది
మాజీ మంత్రి జోగి రమేశ్‌ను దాడి కేసులో సీఐడీ విచారణకు పిలిచింది.ఉండవల్లిలో చంద్రబాబు ఇంటిపై దాడి వ్యవహారంపై ఏప్రిల్ 11న హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు
వక్ఫ్ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, మత సంస్థలపై బీజేపీ పెత్తనం కోసం తెచ్చిందని సీపీఐ నేత రామకృష్ణ విమర్శించారు. మైనారిటీల మనోభావాలను దెబ్బతీసేలా బీజేపీ, జనసేన వ్యాఖ్యలున్నాయని అన్నారు
ఏఎంసీ చైర్మన్ పదవుల కేటాయింపులో జనసేనకు ప్రాధాన్యత ఇవ్వడం టీడీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తికి దారితీసింది. సిఫారసులు పట్టించుకోకపోవడంపై పలువురు ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ 8.21 Per జీఎస్డీపీ వృద్ధిరేటుతో దేశంలో రెండో స్థానంలో నిలిచింది. తలసరి ఆదాయ వృద్ధిలో మూడోస్థానాన్ని సాధించినట్లు కేంద్రం తెలిపింది
అమెరికా 27 Per దిగుమతి సుంకం విధించడంతో భారత రొయ్యల ఎగుమతిదారులు నష్టపోతున్నారని సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. మత్స్యరంగాన్ని కాపాడేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించారు
వైసీపీ నేత అంజద్‌బాషా సోదరుడు అహ్మద్ బాషాను కడప తాలూకా పోలీసులు ముంబైలో అరెస్టు చేశారు. వివిధ క్రిమినల్ కేసుల నేపథ్యంలో ఆయనపై లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయి
వైసీపీ హయాంలో పంచాయతీల సొంత ఆదాయాన్ని దారి మళ్లించి సుమారు రూ.100 కోట్లకు పైగా స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వెలుగు చూశాయి. కూటమి ప్రభుత్వానంతరం ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అధికారులు విచారణ ప్రారంభించారు
ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు కోమ్మా కోటేశ్వరరావు సహా నలుగురు ఇంకా పరారీలో ఉన్నారు. వారు నేపాల్‌లో తలదాచుకొని పోలీసుల కదలికలను ఫోన్ ద్వారా తెలుసుకుంటున్నట్లు సమాచారం