Revanth Reddy: TSPSC పేపర్ లీకేజీలో కేసీఆర్ కుటుంబసభ్యుల పాత్ర లేదని నిరూపించుకోవాలి

ABN , First Publish Date - 2023-03-14T17:12:13+05:30 IST

టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీ వెనుక పెద్దల హస్తం ఉందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు.

Revanth Reddy: TSPSC పేపర్ లీకేజీలో కేసీఆర్ కుటుంబసభ్యుల పాత్ర లేదని నిరూపించుకోవాలి

హైదరాబాద్: టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీ వెనుక పెద్దల హస్తం ఉందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. గతంలో పలు పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి ఉందని ఎంపీ మండిపడ్డారు. సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీలో సీఎం కేసీఆర్ కుటుంబసభ్యుల పాత్ర లేదని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని రేవంత్ అన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఫిర్యాదు లేదని, విచారణ చేస్తే ప్రభుత్వంలోని పెద్దలు దొరుకుతారనే.. పేపర్ లీకేజీపై ప్రభుత్వం ఫిర్యాదు చేయడం లేదని రేవంత్ ఆరోపించారు. పేపర్ లీకేజీపై ఫిర్యాదు అందకున్నా పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు.

అధికారంలోకి వస్తే రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రకటించారు. రైతులకు ఆరోగ్య బీమా కల్పిస్తామని రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. నిజామాబాద్ జిల్లా (Nizamabad District) కమ్మర్‌పల్లిలో హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలో భాగంగా రైతులతో రేవంత్‌రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్ల కింద రూ.5 లక్షలిస్తామని తెలిపారు. మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీని 6 నెలల్లో తెరిపిస్తామన్నారు. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) మోడల్లో వ్యవసాయ డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పారు. గుజరాత్ (Gujarat) మోడల్ అంటే ఇద్దరు అమ్మేటోళ్లు, ఇద్దరు కొనేటోళ్లేనని పేర్కొన్నారు. తెలంగాణ మోడల్ అంటే 3000 వైన్‌షాపులు, 60 వేల బెల్ట్ షాపులని రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు.

Updated Date - 2023-03-14T17:13:35+05:30 IST