TS Politics : ఒకే ఒక్క ప్రశ్నతో కేసీఆర్‌కు చిక్కులు తెచ్చిపెట్టిన ఎంపీ నామా..!
ABN , First Publish Date - 2023-07-31T18:51:14+05:30 IST
అవును.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను (CM KCR) బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు (MP Nama Nageswara Rao) చిక్కుల్లోకి నెట్టారు.! దీంతో.. ఒకే ఒక్క ప్రశ్నతో పార్లమెంట్ వేదికగా బీఆర్ఎస్ (BRS) పరువు పోయినట్లయ్యింది..! ఏదో చెప్పాలని చెప్పబోతే.. అసలుకే ఎసరొచ్చినట్లయ్యింది.!..
అవును.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను (CM KCR) బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు (MP Nama Nageswara Rao) చిక్కుల్లోకి నెట్టారు.! దీంతో.. ఒకే ఒక్క ప్రశ్నతో పార్లమెంట్ వేదికగా బీఆర్ఎస్ (BRS) పరువు పోయినట్లయ్యింది..! ఏదో చెప్పాలని చెప్పబోతే.. అసలుకే ఎసరొచ్చినట్లయ్యింది.!. పార్లమెంట్ వేదికగా సీరియస్‌గా చర్చ జరుగుతుండగా కేసీఆర్‌ను ఆకాశానికెత్తి ఆహా.. ఓహో అని చెప్పాలని నామా భావించారు.! కానీ సీన్ రివర్స్ అయ్యింది. అరెరే అనవసరంగా మాట్లాడానేమో..? అని నామా ఆలోచనలో పడ్డారట. ఇటు బీఆర్ఎస్ ఎంపీలు సైతం పార్టీ పరువును ఏం చేయాలనుకుంటున్నావ్ మహాప్రభో..? అని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇంతకీ పార్లమెంట్ వేదికగా ఏం జరిగింది..? ఏ విషయంలో నామా మాట్లాడాలని భావించారు..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ఇదీ అసలు కథ..!
మూడేళ్ల క్రితం కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాల(Three Cultivation Acts)కు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మరణించిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం(Compensation) అందించే విషయంలో కేసీఆర్ ప్రభుత్వం(KCR GOVT) ఇరకాటంలో పడింది. ఆ పోరాటంలో దాదాపు 750 మంది రైతులు మరణించారని, వారి కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తామని సీఎం కేసీఆర్(CM KCR) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈమేరకు ఆయన పంజాబ్‌కు వెళ్లి కొన్ని కుటుంబాలకు చెక్కులు కూడా అందించారు. అయితే ఎంత మంది రైతులకు ఇచ్చారు..? ఎంత చొప్పున సాయం చేశారు..? అనే వివరాలు ఇప్పటి వరకూ కేంద్రానికి (Central Govt) రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. పదే పదే అడిగినప్పటికీ ఇంతవరకూ కేసీఆర్ సర్కార్ నుంచి కేంద్రానికి ఎలాంటి సమాచారం వెళ్లలేదు. ఈ విషయంపై ఇటీవల హామీల అమలు కమిటీ ప్రశ్నించింది.
నామా ఏం మాట్లాడారు..?
2021లో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ‘నల్ల చట్టాలు’ గురించి ప్రస్తావన వచ్చింది. వెంటనే స్పీకర్ అనుమతి తీసుకున్న బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడటం ప్రారంభించారు. అయితే.. ఇదే ఎంపీ.. ‘నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిపిన ఉద్యమంలో మరణించిన 750 మంది రైతుల కుటుంబాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3లక్షల చొప్పున కేసీఆర్ సాయం చేశారు. ఆ వివరాలు కేంద్రానికి తెలుసా?. ఉద్యమాల్లో ఎంతమంది చనిపోయారన్న డేటా కేంద్రం దగ్గర ఉందా..?’ అని 2021 డిసెంబర్ 21న నామా లోక్‌సభలో ప్రశ్నించారు. అయితే.. సాయం చేసిన రైతుల వివరాలను కేంద్రానికి ఎందుకివ్వలేదు..? అని కేంద్రం ప్రశ్నించింది. పదే పదే అడిగినా.. ఇప్పటి వరకూ రెండేళ్లైనా సర్కార్ ఎందుకు స్పందించలేదు..? అని కేంద్రం ప్రశ్నించడంతో అప్పట్లో పార్లమెంట్‌లో పెద్ద రచ్చే అయ్యింది. దీంతో కేంద్ర వ్యవహాసాయం మంత్రి కలుగజేసుకొని.. కేసీఆర్ సాయం చేసిన రైతుల వివరాలను అడిగి చెబుతామని సభకు హామీ ఇచ్చారు. దీంతో 750 మంది రైతు కుటుంబాల వివరాలు ఇవ్వాలని కేంద్రం కోరింది. సీఎం కేసీఆర్‌తో పాటు వివిధ శాఖల అధికారులకు లేఖలు రాసినా రెండేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం సమాధానమివ్వలేదు. ఇదే విషయాన్ని చెబుతూ హామీల అమలు కమిటీకి కేంద్రం లేఖ రాసింది. అయితే.. 750 మంది రైతు కుటుంబాలకు కేసీఆర్ చేసిన సాయాన్ని గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పంజాబ్, ఒరిస్సాలకు వెళ్లి మరీ కొద్ది మంది రైతుల కుటుంబాలకు చెక్‌లను కేసీఆర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఆ వివరాలను కూడా కేంద్రానికి ఇంతవరకూ కేసీఆర్ సర్కార్ ఇవ్వలేదు. ఇదంతా 2021లో జరగ్గా.. ఇప్పుడు హామీల అమలు కమిటీ ప్రశ్నించడం, కేంద్రం సమాధానివ్వడంతో మరోసారి ఇవాళ వార్తల్లో నిలిచింది.
ఎంత పనైంది నామా..?
చూశారుగా.. అప్పట్లో నామా నానా హడావుడితో పార్లమెంట్‌లో మాట్లాడటం.. ఇప్పటికీ కేంద్రం రాసిన లేఖలు సమాధానం రాకపోవడంతో.. కేసీఆర్‌ను ఎంపీనే ఇరుకున పెట్టినట్లయ్యింది. పార్లమెంట్ వేదికగా కేసీఆర్, బీఆర్ఎస్ సర్కార్ పరువు మొత్తం తీసేశారని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయట. మరోవైపు.. ఎంత పనిచేశావ్ నామా..? అనవసరంగా ఎందుకిలా చేశారు..? అని మంత్రులు ఇప్పుడు మరోసారి నిష్టూరుస్తున్నారట. మొత్తానికి చూస్తే.. కేసీఆర్ సార్‌ను నామా గట్టిగానే ఇరికించేశారన్న మాట. కేసీఆర్ సర్కార్‌కు ఈ లెక్కలు చెప్పే ఇక్కట్లు ఎప్పుడు తప్పుతాయో ఏంటో మరి.!