Home » Nama Nageswara Rao
కృష్ణా జలాల కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఏపీ సీఎం జగన్ కుట్ర పన్నారని.. అందుకే తన దోస్తు కోసం ఆంధ్ర ప్రాంతానికి ఆ నీటిని వదిలేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతంగా కట్టానని కేసీఆర్ (KCR) చెప్పుకుంటాడని.. కానీ ఆ ప్రాజెక్ట్ నిర్మాణ లోపం కారణంగానే గోదావరి నీళ్లు సముద్రంలో కలవడం లేదా అని ప్రశ్నించారు.
Telangana: ప్రచారంలో ప్రతీ గడపకు వెళ్లి ప్రజలను కలవడం చాలా సంతోషంగా ఉందని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్తి నామా నాగేశ్వరరావు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... క్యాడర్ అందరు కలిసి కట్టుగా పనిచేశారని.. గ్రామస్థాయిలో బాగా ప్రచారం జరిగిందని తెలిపారు. ప్రచారంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ తప్పుడు వాగ్దానాల గురించి తనకే చెప్పారన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు (Nama Nageswara Rao)ని ఎంపీగా గెలిపిస్తే కేంద్రంలో రాబోయే సంకీర్ణ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అవుతారని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 12 పార్లమెంట్ సీట్లు గెలుస్తామని.. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని ఉద్ఘాటించారు.
ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు కుటుంబానికి రూ.155.90కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయి.
పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఎంపీ నామా నాగేశ్వరరావు(MP Nama Nageswara Rao) డిమాండ్ చేశారు. మంగళవారం నాడు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందించేందుకు కలెక్టర్ కార్యాలయానికి బీఆర్ఎస్ నాయకులు వచ్చారు. జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఎన్నికల ట్రైనింగ్‌కు వెళ్లారని సిబ్బంది చెప్పటంతో బీఆర్ఎస్ నాయకులు అసహనం వ్యక్తం చేశారు.
ఖమ్మం, వరంగల్ బీజేపీ అభ్యర్థులపై నేడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 17కు గాను.. 15 పార్లమెంట్ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్, ఖమ్మం స్థానాలను బీజేపీ పెండింగ్‌లో పెట్టింది. వరంగల్ బీజేపీ టికెట్ ఆరూరి రమేష్ కు దాదాపు ఖరారైనట్టు సమాచారం. ఖమ్మం స్థానంపై తర్జన భర్జనలో కమలం పార్టీ ఉంది.
బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్రను పార్టీ అధినేత కేసీఆర్(KCR) ఖరారు చేశారు. ఈ మేరకు పార్టీ పెద్దలతో, ముఖ్యులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కాగా అధినేత ఆదేశాలతో రేపు (15 ఫిబ్రవరి) వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.
కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలయ్యేలా కనిపించడం లేదని బీఆర్ఎస్ ( BRS ) రాజ్యసభ ఎంపీ వద్ది రాజు రవిచంద్ర ( Vaddiraju RaviChandra ) అన్నారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్లో ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు.
సీఎం కేసీఆర్ వెళ్లిన ప్రతి సభలో ప్రజల నుంచి స్పందన బ్రహ్మాండంగా వస్తోందని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.
హైదరాబాద్: నెక్లెస్ రోడ్డులోని జలవిహార్‌లో బీఅర్ఎస్ పార్టీ నేతలు కీలక సమావేశం అయ్యారు. ఈ భేటీలో మంత్రి హరీష్ రావు, ఎంపీ నామా నాగేశ్వరరావు, పార్టీ నియోజకవర్గాల ఎన్నికల ఇన్చార్జిలు, వార్ రూం ఇన్చార్జిలు పాల్గొన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, మేనిఫేస్టోను ఇంటింటికి తీసుకెళ్ళె అంశంపై మంత్రి హరీష్ రావు దిశానిర్దేశం చేశారు.