YCP Flexi Politics: పాపం.. వైసీపీ అధినేతతో ఇలా ఆడుకుంటున్నారేంటి.. బాలినేని కొడుకు కూడా ఉన్నాడు.. కానీ..

ABN , First Publish Date - 2023-05-08T15:45:17+05:30 IST

వైసీపీ అధినేత జగన్ రెడ్డికి (YCP Chief Jagan Reddy) సొంత పార్టీ నేతలే చుక్కలు చూపిస్తున్నారు. జగన్ చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసులో (YS Viveka Case) అవినాశ్‌ను (Avinash Reddy) ఏ క్షణమైనా..

YCP Flexi Politics: పాపం.. వైసీపీ అధినేతతో ఇలా ఆడుకుంటున్నారేంటి.. బాలినేని కొడుకు కూడా ఉన్నాడు.. కానీ..

వైసీపీ అధినేత జగన్ రెడ్డికి (YCP Chief Jagan Reddy) సొంత పార్టీ నేతలే చుక్కలు చూపిస్తున్నారు. జగన్ చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసులో (YS Viveka Case) అవినాశ్‌ను (Avinash Reddy) ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో వైసీపీ అధినేతకు ఇప్పటికే తల బొప్పి కడుతున్న పరిస్థితి. పొరుగు రాష్ట్రమైన తెలంగాణకు పరిశ్రమలు తరలిపోవడంపై ఏపీ ప్రజలు ఇప్పటికే జగన్ సర్కార్‌పై (YCP Govt) గుర్రుగా ఉన్నారు. జీతాలు ఆలస్యం అవుతుండటంతో ఉద్యోగులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇలా.. ఇన్ని సమస్యలతో సతమతమవుతున్న జగన్‌ రెడ్డికి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం (Balineni Srinivas Reddy) మరో తలనొప్పిగా మారింది.

Balineni-Srinivas.jpg

ఒంగోలుకు (Ongole) చెందిన ఈ మాజీ మంత్రిని జగన్ రెడ్డి ఇప్పటికే స్వయంగా తాడేపల్లి ప్యాలెస్‌కు (Tadepalli Jagan House) పిలిచి మరీ మాట్లాడారు. ఒంగోలు డీఎస్పీగా అశోకవర్ధన్‌రెడ్డి నియామకంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి వద్ద మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టుబట్టి మరీ బదిలీని ఆపించారు. తనకు తెలియకుండా నియామకం జరగడం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అశోక్‌వర్ధన్‌ను చార్జి తీసుకున్న అరగంటలో బదిలీ చేయించారు. ఈ క్రమంలో టి.అశోక్‌వర్ధన్‌ను దర్శికి అక్కడ పనిచేస్తున్న నారాయణస్వామిరెడ్డిని ఒంగోలుకు బదిలీ చేశారు. బాలినేని కోరుకున్నట్టే తన మాటే నెగ్గింది. అయినప్పటికీ బాలినేని వర్గం మాత్రం జగన్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

balineni.gif

ఒంగోలులో ప్రస్తుతం వేడెక్కిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కార్పొరేషన్‌ అధికారుల నిర్వాకం మరోసారి చర్చకు దారితీసింది. శనివారం నాడు ఒంగోలు కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నగరంలో వేసవి వడగాల్పుల ఉపశమన కేంద్రాలు ప్రారంభోత్సవానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కార్పొరేషన్‌ కార్యాలయంలో వడగాల్పుల ఉపశమన కేంద్రాన్ని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించాల్సి ఉండగా, పలు కారణాలతో ఆ కార్యక్రమం ఆదివారానికి వాయిదా పడింది. ఆదివారం నాడు ఈ వడగాల్పుల ఉపశమన కేంద్రం ప్రారంభమైంది. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో సీఎం జగన్మోహన్‌రెడ్డి, జిల్లాకు చెందిన మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఫొటోలు లేవు.

Balineni-And-Jagan.jpg

ఇటీవల వైసీపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, తాజాగా బాలినేని ప్రెస్‌మీట్‌ హాట్‌హాట్‌గా ఉన్న నేపథ్యంలోనే ఇలా సీఎం, మంత్రి, ఎంపీ ఫోటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఆ ఫ్లెక్సీలో బాలినేని, ఆయన తనయుడు ప్రణీత్‌రెడ్డి, మేయర్‌ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్లు వెలనాటి మాధవరావు, వేమూరి బుజ్జి, కమిషనరు, కార్పొరేటర్‌ నాగరాజులవి మాత్రమే ఉండగా, ప్రొటోకాల్‌ ప్రకారం కూడా అక్కడ జగన్‌, మునిసిపల్‌ మంత్రి ఫొటోలు కనిపించలేదు. ఒంగోలు నగర మేయర్‌ గంగాడ సుజాత మాజీ మంత్రి బాలినేని వర్గమే కావడంతో ఈ ఫ్లెక్సీపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేషన్ అధికారులు మేయర్‌కు తెలియకుండానే ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి ఉంటారా లేక తెలిసినా వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితోనే ఉద్దేశపూర్వకంగా జగన్ ఫొటో లేకుండా చేశారా అనే చర్చ ఒంగోలులో జోరుగా జరుగుతోంది.

Jagan-Sad.jpg

ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి వడగాల్పుల ఉపశమన కేంద్రాల ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో పొరపాటు జరిగిందని కమిషనర్‌ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. సీఎం, పురపాలకశాఖ మంత్రి, ఫొటోలు లేక పోవడంపై ఓ పత్రికలో కథనం ప్రచురితమైందన్నారు. వాస్తవానికి ఉపశమన కేంద్రాల నిర్వహణ కోసం కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించడం జరిగిందని, కాంట్రాక్టర్లు కొత్తవారైనందున ప్రోటోకాల్‌పై వారికి అవగాహన లేనందు వలన పొరపాటు జరిగిందని వివరణ ఇచ్చారు. ఆ తర్వాత గంటలోనే సీఎం, మునిసిపల్‌ మంత్రి ఫొటోలతో ఫ్లెక్సీలు మార్చినట్లు చెప్పారు. కమిషనర్‌ వివరణ ఇలా ఉండగా.. మేయర్‌ సుజాత మాత్రం ఫ్లెక్సీల విషయంలో అనవసర రాద్ధాంతం చేశారని పేర్కొనడం చర్చనీయాంశమైంది.

Updated Date - 2023-05-08T15:45:24+05:30 IST