Shocking: బకేట్ నిండుగా నీళ్లతో ఇంతటి ప్రమాదమా.. ఈ పదేళ్ల బాలుడు ఎలా కన్నుమూశాడో తెలిస్తే..
ABN , First Publish Date - 2023-11-05T17:55:13+05:30 IST
బకేట్ నీళ్లల్లో ప్రమాదవశాత్తూ పడటంతో ఓ పదేళ్ల బాలుడు ఊపిరాడక మరణించాడు.
ఇంటర్నెట్ డెస్క్: చిన్నారుల విషయంలో ఎంత అప్రమత్తంగా ఉన్నా తక్కువే. ఎటువైపు నుంచి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలీదు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా జీవితంలో తీరని లోటుమిగుల్తుంది. తాజాగా నవీ ముంబైలో(Navi Mumbai) ఓ బాలుడి మరణం స్థానికులను కలిచివేస్తోంది.
Viral Video: బాబోయ్..భీముడు మళ్లీ పుట్టాడా? పుట్టిన వెంటనే ఈ నవజాత శిశువు చేసిన పనికి నర్సు షాక్!
శనివారం సాయంత్రం ఓ పదేళ్ల బాలుడు పన్వేల్ ప్రాంతంలో తన ఇంటి వద్ద ఆడుకుంటూ పొరపాటును బకేట్ నీళ్లల్లో పడిపోయాడు. అతడి ముక్కూనోటా నీరు వెళ్లడంతో ఊపిరి ఆడక అచేత స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే అప్రమత్తమైన బాలుడి తల్లిదండ్రులు అతడిని ఆసుపత్రికి తరలించినా ఉపయోగం లేకపోయింది(10-year-old boy drowns in bucket of water). చిన్నారి అప్పటికే మరణించినట్టు వైద్యులు ప్రకటించారు.
Viral: ఈ సింహానికి ఏమైంది? నడిరోడ్డు మీద ఊహించని విధంగా.. వీడియో చూసి షాకైపోతున్న జనాలు!
కాగా, ప్రమాదవశాత్తూ బాలుడు చనిపోయినట్టు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అప్పటివరకూ తమ ముందే ఆడుకుంటున్న బాలుడు ఇలా అనూహ్య రీతిలో మృతి చెందడంతో ఇరుగుపొరుగు వారు విచారంలో కూరుకుపోయారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులను ఊరడించడం ఎవరితరం కాలేదు.
Hacking: మీ స్మార్ట్ ఫోన్ హ్యాకైందని డౌటా? ఇలా చేస్తే కేవలం 30 సెకెన్లలోనే..