Medico Preethi : డాక్టర్ ప్రీతి ఘటనలో 11 అనుమానాలు.. అపస్మారక స్థితిలో ఉండగా ..!?

ABN , First Publish Date - 2023-03-05T17:32:24+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేఎంసీ పీజీ విద్యార్థిని ప్రీతి కేసులో (KMC PG Preethi Case) రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది...

Medico Preethi : డాక్టర్ ప్రీతి ఘటనలో 11 అనుమానాలు.. అపస్మారక స్థితిలో ఉండగా ..!?

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేఎంసీ పీజీ విద్యార్థిని ప్రీతి కేసులో (KMC PG Preethi Case) రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే నిందితుడు సైఫ్‌ (Doctor Saif) నుంచి పలు కీలక విషయాలను పోలీసులు రాబట్టగా.. ప్రత్యేక బృందం ఇంకా లోతుగా విచారిస్తోంది. సైఫ్ చెప్పిన సమాచారాన్ని బట్టి సాంకేతికంగా ఏం చేయొచ్చు..? ఎలా ముందుకెళ్లొచ్చు..? అని పోలీసులు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ఘటనపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. మరోవైపు.. ప్రీతి విషయంలో అసలేం జరిగింది..? ప్రీతి ఇంజక్షన్ తీసుకున్నప్పటి నుంచి నిమ్స్ (NIMS) తరలించే వరకూ ఏమేం జరిగింది..? అనే విషయాలపై లంబాడీల ఐక్య వేదిక 11 ప్రశ్నలు లేవనెత్తుతోంది. పలు డిమాండ్స్‌ను కూడా ప్రభుత్వం ముందు ఉంచింది. ప్రీతి అనుమానాస్పద మృతిపై బహుజన నాయకుల హైదరాబాద్ డిక్లరేషన్ రిలీజ్ చేసింది.

Dr-Saif.jpg

అనుమానాలు ఇవి.. !

1. విధుల నిర్వహణలో ఉన్న ప్రీతి బాయి అపస్మారక స్థితిలో ఉండగా మొదట చూసిందెవరు..?

2. అపస్మారక స్థితిలో ఉన్న ప్రీతిబాయి చేయి ఎందుకు కమిలి పోయింది..?

3. ప్రీతి బాయి అపస్మార స్థితిలో ఉన్న సమయం నుండి ప్రీతి తండ్రికి ఫోన్ వచ్చే వరకు మధ్యల ఏం జరిగింది..? ప్రీతి అపస్మారక స్థితిలో ఉండగానే కుటుంబ సభ్యులకు ఎందుకు చెప్పలేదు..?

4. ఫింగర్ ప్రింట్ లాక్‌లో ఉన్న ప్రీతి మొబైల్ డాటాను డిలీట్, అలాగే వారి బ్యాచ్‌మెట్‌లతో చేసిన చాట్‌ను డిలీట్ చేసిందెవరు..?

5. ప్రీతి మొబైల్‌లో హిస్టరీ చూడాల్సిన అవసరం ఏం వచ్చింది..? హిస్టరీలో డ్రగ్ గురించి సెర్చ్ చేశారని ఫేక్ ఎవిడెన్స్ క్రియేట్ చేసి దాని మీదనే కేసును తప్పుదోవ ఎందుకు పట్టించారు..?

6. ప్రీతి తండ్రి రాక ముందే అన్ని డిపార్ట్‌మెంట్‌ల హెడ్‌లు అక్కడికి ఎందుకొచ్చారు..?

7. వరంగల్‌కు ప్రీతికి చేసిన చికిత్స ఏమిటి..?

8. మంచి చికిత్స కోసం నిమ్స్‌కు తీసుకొని వచ్చిన వారు నిమ్స్‌లో ఎలాంటి చికిత్స చేశారు..?

9. సైఫ్‌తో పాటు ఈ కేసులో భాగస్వాములు అయిన వారి పేర్లు ఎందుకు చేర్చలేదు..?

10. డిపార్ట్‌మెంట్ హెడ్.. ప్రీతి బాయిని నాకు చెప్పకుండా దగ్గరికి పోతారా అని ఎందుకు బెదిరించారు..?

11. పోలీసు వ్యవస్థ ఈ కంప్లయింట్ రాగానే ఎందుకు నిర్లక్ష్యం వహించింది..? అని ప్రకటనలో లంబాడీల ఐక్య వేదిక ప్రశ్నించింది.

Preethi-Issue.jpg

డిమాండ్స్ ఇవీ..

1. సిట్టింగ్ జడ్జ్‌చే విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి. కమిటీలో ఎస్టీ ఐపీఎస్, ఎస్సీ ఐపీఎస్, బీసీ ఐపీఎస్.. ఎస్టీ, ఎస్టీ, బీసీ డాక్టర్స్ ఉండాలి.

2. సైఫ్, మిత్ర బృందంను సస్పెండ్ చేయాలి.

3. డిపార్ట్‌మెంట్ హెడ్, ప్రిన్సిపాల్‌‌లను సర్వీస్ నుంచి తొలగించాలి.

4. సీఐ బోనాల కిషన్‌ను సర్వీస్ నుంచి తొలగించాలి

5. 50 లక్షల బాండ్‌ను పీజీ విద్యార్థులకు తక్షణమే రద్దు చేయాలి.

6. 5 కోట్లు ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలి.

7. ప్రీతి బాయి కుటుంబానికి గ్రూప్-1 స్థాయి ఉద్యోగం కల్పించాలి.

8. ప్రీతి బాయి కుటుంబానికి 3 ఎకరాల భూమిని, ఇంటిని నిర్మించి ఇవ్వాలి.. అని లంబాడీల ఐక్య వేదిక డిమాండ్ చేస్తోంది.

మరోవైపు.. పోలీసు విచారణ మొత్తమ్మీద ప్రీతి బ్లాక్ కలర్ షోల్డర్ బ్యాగ్ (Black Colour Bag) కీలకంగా మారిందని తెలియవచ్చింది. బ్యాగ్‌లోని మొత్తం 24 ఆధారాలతో కేసును పూర్తి స్థాయిలో పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. కేసులో మాజ కూల్ డ్రింక్ (Maaza Cool Drink) అనుమానాస్పదంగా మారింది. దీంతో పాటు లేస్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ గురించి కూడా తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎంజీఎం (MGM) సెక్యూరిటీ గార్డులు రాజబోయిన సాంబరాజు, ఎర్రోజు కిశోర్‌ల నుంచి విచారణాధికారి కీలక వివరాలు సేకరించారని సమాచారం. ఇలా మొత్తం అన్ని కీలక వివరాలను సేకరించిన పోలీసులు.. డాక్టర్ సైఫ్ నుంచి సేకరించిన సాంకేతిక ఆధారాలను పోల్చుతూ విచారణ కొనసాగిస్తున్నారు. అయితే విచారణలో ఏం జరుగుతోంది..? ఏం వివరాలు సేకరించారు..? కేసు ఎంతవరకు వచ్చింది..? అనే విషయాలు మాత్రం ఇంతవరకూ అధికారులు మీడియాకు సమాచారం ఇవ్వలేదు. మొత్తానికి చూస్తే చాలా గోప్యంగానే పోలీసులు విచారిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. అతి త్వరలోనే ఈ కేసు ఓ కొలిక్కి వస్తుందని ఆ తర్వాతే పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Doctor Preethi Case : మెడికో ప్రీతి కేసులో యాంటీ ర్యాగింగ్ కమిటీ తేల్చిన అసలు నిజం ఇదీ..

******************************

Medico Preethi : ప్రీతి కేసులో నోరు విప్పిన సైఫ్.. సంచలన విషయాలు వెలుగులోకి.. కీలకంగా మారిన బ్యాగ్!


******************************

APGIS2023 : సిగ్గో.. సిగ్గు.. వైజాగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ఇదేం దారుణం.. తీవ్ర అసహనానికి గురై బయటికొచ్చేసిన డెలిగేట్స్..!


******************************

Big Breaking : విశాఖ గ్లోబల్ సమ్మిట్‌లో గొడవ.. రచ్చ రచ్చగా మారిన ఏయూ గ్రౌండ్స్.. ముందే చెప్పిన ఏబీఎన్-ఆంధ్రజ్యోతి!

******************************

Updated Date - 2023-03-05T17:57:54+05:30 IST