Youtube: ఇలా చేస్తే 3 నెలల పాటు ఫ్రీగా యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్!
ABN , First Publish Date - 2023-07-31T16:00:40+05:30 IST
ఇప్పటివరకూ యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకోని వారికి ఓ గుడ్ న్యూస్. మూడు నెలల పాటు ఈ ఆఫర్‌ను ఉచితంగా పొందేందుకు యూట్యూబ్ భారతీయ సబ్‌స్క్రైబర్లకు అవకాశం ఇస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: మీరు ఇంకా యూట్యూబ్ సబ్‌సక్రీప్షన్ తీసుకోలేదా? ఓసారీ ఫీచర్లన్నీ క్షుణ్ణంగా పరిశీలించాకే తీసుకోవాలో వద్దో నిర్ణయించుకుందామని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్! 3 నెలల పాటు ప్రీమియం అకౌంట్‌ను ఎంజాయ్ చేసేందుకు యూట్యూబ్ ఓ ఆఫర్ ప్రకటించింది(free youtube premium subscription). భారతీయులకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఆఫర్ ద్వారా యూట్యూబ్ ప్రీమియం ఫీచర్లన్నీ క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ఈ ఆఫర్‌ను ఎలా పొందాలో తెలుసుకుందాం పదండి(How to avail it).
ఇంతవరకూ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకోని వారికి మాత్రమే ఇది కనిపిస్తుంది. ఉచిత ఆఫర్‌ను పొందేందుకు ముందుగా యూట్యూబ్ యాప్‌ను ఓపెన్ చేయాలి. ఆ తరువాత ప్రొఫైల్ ఐకాన్‌పై టాప్ చేయాలి. ఆ తరువాత గెట్ యూట్యూబ్ ప్రీమియం అన్న ఐకాన్‌ను టాప్ చేయాలి. ఇందులో ఉచిత 3 నెలల ఆఫర్ ఎంచుకుని ఆ తరువాత బ్యాంక్ కార్డు వివరాలు నమోదు చేయాలి. దీంతో, ఈ ఆఫర్ యాక్టివేట్ అవుతుంది. అనంతరం మూడు నెలల పాటు అన్నీ ఫీచర్లను క్షుణ్ణంగా పరిశీలించుకోవచ్చు. ఆ తరువాత నెలకు రూ.129 కడుతూ ఈ బెనిఫిట్స్‌ను కావాల్సినన్ని రోజులు ఎంజాయ్ చేయచ్చు.
మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ ఫీచర్ అన్ని గూగుడ్ ఈ మెయిల్ ఐడీలకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి, మీకు రెండు అకౌంట్స్ ఉంటే రెండింటితోనూ ఈ ఫ్రీ ఫీచర్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు.
యూట్యూబ్ ప్రీమియంతో ఆఫర్లు ఇవీ..
మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర స్ట్రీమింగ్ యాప్స్ కన్నా యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ మెరుగైనదని కొందరి అభిప్రాయం. దీని ద్వారా య్యూట్యూబ్ మ్యూజీక్ యాప్ ఫీచర్లను ఫ్రీగా పొందొచ్చు. అంతేకాకుండా, ప్రకటనల రొద లేకుండా యూట్యూబ్‌లో మ్యూజిక్ వినొచ్చు. బ్యాక్ గ్రౌండ్‌లో సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు.