Shocking News: గిఫ్ట్ బాక్సుల్లో వాడి పారేసిన కండోమ్స్.. 65 యువతులకు సేమ్ సీన్ రిపీట్.. అంతా ఒకే కాలేజీకి చెందిన వాళ్లే..

ABN , First Publish Date - 2023-05-20T16:10:48+05:30 IST

ఆస్ట్రేలియాలో ఓ విచిత్రమైన, షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. గత మూడు నెలల్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి దాదాపు 65 మంది మహిళలకు వాడేసిన కండోమ్‌లను పోస్ట్‌లో పంపాడు. వాటితో పాటు అందరికీ లెటర్లు కూడా పంపాడు.

Shocking News: గిఫ్ట్ బాక్సుల్లో వాడి పారేసిన కండోమ్స్.. 65 యువతులకు సేమ్ సీన్ రిపీట్.. అంతా ఒకే కాలేజీకి చెందిన వాళ్లే..

ఆస్ట్రేలియాలో (Australia) ఓ విచిత్రమైన, షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. గత మూడు నెలల్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి దాదాపు 65 మంది మహిళలకు వాడేసిన కండోమ్‌లను (used condoms) పోస్ట్‌లో పంపాడు. వాటితో పాటు అందరికీ లెటర్లు కూడా పంపాడు. ఆ 65 మంది మహిళలు గతంలో ఒకే స్కూల్‌లో చదవడం విశేషం. వీరందరూ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ తూర్పు ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు (Viral Crime News).

పాత కండోమ్‌లతో పాటు, లేఖలను కూడా అందుకున్న ఈ మహిళలు 1999వ సంవత్సరంలో మెల్‌బోర్న్‌లోని బాలికల పాఠశాల అయిన కిల్‌బ్రేడాలో చదువుకున్నారు. పాఠశాలలోని రికార్డు బుక్ నుంచి నిందితుడు ఈ మహిళలందరి చిరునామాలను పొందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో సంచలనం సృష్టించింది. పోలీసులు ఈ కేసుపై వేగంగా దర్యాఫ్తు చేస్తున్నారు. ఆ పాఠశాలకు సంబంధించిన వారందరినీ విచారిస్తున్నారు (Crime News).

Cab Driver: క్యాబ్‌లో సీటుకు రాసి ఉందో కండీషన్‌.. అది చదివి కామెంట్ చేసిన ఓ కుర్రాడికి దిమ్మతిరిగే షాకిచ్చిన డ్రైవర్..!

కండోమ్‌లతో పాటు ఆ వ్యక్తి పంపిస్తున్న లేఖలో చాలా అసభ్యకరమైన, శృంగారపరమైన భాష ఉన్నట్టు మహిళలు తెలిపారు. ``ఆ లెటర్ అందుకున్న తర్వాత చాలా ఆందోళనకు గురయ్యాను. కొన్ని రాత్రులు నిద్ర పోలేదు. నా స్నేహితురాలికి ఫోన్ చేసి చెబితే ఆమెకు కూడా అలాంటి లెటర్ వచ్చినట్టు చెప్పింద``ని ఒక బాధితురాలు చెప్పింది.

Updated Date - 2023-05-20T16:10:48+05:30 IST