Indian Money: ఏకంగా 24 వేల కోట్ల రూపాయలు.. నాలుగు రోజుల్లోగా బ్యాంకుల్లో డిపాజిట్ చేయకపోతే..!

ABN , First Publish Date - 2023-09-26T21:49:09+05:30 IST

సెప్టెంబర్ 30 లోపల రూ.2 వేల నోటు బ్యాంకుల్లో జమ చేయపోతే ఆ తరువా ఆర్బీఐలో మాత్రమే మార్చుకునే అవకాశం ఉందని కేంద్ర బ్యాంకు స్పష్టం చేసింది. అంతేకాకుండా, డెడ్‌లైన్ లోపు వాటిని ఎందుకు బ్యాంకుల్లో జమచేయలేదో కూడా వివరణ ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించింది.

Indian Money: ఏకంగా 24 వేల కోట్ల రూపాయలు.. నాలుగు రోజుల్లోగా బ్యాంకుల్లో డిపాజిట్ చేయకపోతే..!

ఇంటర్నెట్ డెస్క్: రూ. 2 వేల నోటు.. భారత్‌లో అత్యధిక విలువ గల(Highest Denomination Note) కరెన్సీ నోటు ఇదే. డీమోనెటైజేషన్ తరువాత దేశంలో నగదు లభ్యత పెంచేందుకు 2016లో ప్రభుత్వం ఈ నోటును చలామణీలోకి తెచ్చింది. అయితే, రెండు వేల నోటు లక్ష్యాలు నెరవేరాయని పేర్కొన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వాటిని ఉపసంహరించుకుంటున్నామని ఈ ఏడాది మే 16న ప్రకటించింది. పాత నోట్లను నాలుగు అయిదు ఏళ్లల్లో ఉపసంహరించుకోవాలన్న (Withdrawl from Circulation) తమ క్లీన్ నోట్ విధానాన్ని ఆర్బీఐ అప్పట్లో ప్రస్తావించింది. ఈ కరెన్సీ నోట్లను బ్యాంకుల్లో జమ చేసేందుకు, ఇతర కరెన్సీ నోట్లుగా మార్చుకునేందుకు ప్రజలకు సెప్టెంబర్ నెలాఖరు వరకూ గడువిచ్చింది.


ఈ డెడ్ లైన్‌కు ఇంకా నాలుగు రోజులే మిగిలుంది. అయితే, సెప్టెంబర్ 1 నాటికి కూడా రూ.24 వేల కోట్ల నగదు ఈ నోట్ల రూపంలోనే చలామణీలో ఉన్నట్టు సమాచారం. సర్క్యులేషన్‌లో ఉన్న మొత్తం నోట్ల విలువలో ఇది దాదాపు ఏడు శాతానికి సమానం అని అంచనా. అయితే, సెప్టెంబర్ 30 తరువాత కూడా ఈ నోట్లు లీగల్ టెండర్‌గా కొనసాగినప్పటికీ వీటితో లావాదేవీలు జరపడం మాత్రం కుదరదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇక అక్టోబర్ 1 నుంచీ ఈ నోట్లను ఆర్బీబీ శాఖల్లో మాత్రమే మార్చుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా, సెప్టెంబర్ 30 డెడ్‌లైన్‌కు మునుపే వీటిని బ్యాంకుల్లో ఎందుకు డిపాజిట్ చేయలేదో కూడా సంబంధిత వ్యక్తులు వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది.

Updated Date - 2023-09-26T21:59:11+05:30 IST