Uber Cab: ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన కారు.. సడన్‌గా ఉబెర్ యాప్ నుంచి నోటిఫికేషన్.. ఏంటా అని ఓపెన్ చేసిన ఆ కస్టమర్‌కు షాక్..!
ABN , First Publish Date - 2023-08-25T18:34:03+05:30 IST
ట్రాఫిక్ జాంలో ఊబెర్ కారు ఆగిపోవడంతో కస్టమర్‌కు సంస్థ నుంచి ఊహించని అలర్ట్ వచ్చింది. మీరు చాలా సేపటి నుంచి ఓకే చోట ఉన్నారు. ఇబ్బంది ఏదైనా ఉంటే వెంటనే మాకు సమాచారం ఇవ్వండి అంటూ ఊబెర్ పంపిన మెసేజ్ చూసి ఆ కస్టమర్ తొలుత షాకయ్యాడు. ఆ తరువత పడీపడి నవ్వుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరు పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేవి ఐటీ రంగం.. ట్రాపిక్ ఝంఝాటం. ముఖ్యంగా అక్కడి ట్రాఫిక్ చూసి బెదిరిపోని వారు ఉండరని అనుభవజ్ఞులు చెబుతుంటారు. ఇందుకు సంబంధించి మరో ఉదాహరణ నెట్టింట్లో వైరల్‌గా(Viral News) మారింది.
బెంగళూరులో క్యాబ్‌లో ప్రయాణిస్తుండగా తనకెదురైన అనుభవాన్ని వివరిస్తూ ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఊబెర్ క్యాబ్‌లో వెళుతున్న ఆ వ్యక్తికి సడెన్‌గా ట్రాఫిక్ జాంలో చిక్కుకుపోయాడు(Bengaluru Traffic jam). ఆ రోడ్డుపై చాలా సేపు వాహనాలు నిలిచిపోయాయి. ఇంతలో అతడికి ఊబెర్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. ‘‘చాలా సేపటి నుంచీ మీ కారు ఒకే చోట ఆగి ఉంది. సమస్య ఏదైనా ఉంటే వెంటనే తెలియజేయండి’’ అంటూ మెసేజ్ వచ్చింది. దీన్ని చూసిన అతడు నోరెళ్లబెట్టాడు. ట్రాఫిక్ జాం దెబ్బకి ఊబెర్ కూడా బోల్తాపడిందంటూ నవ్వుకున్నాడు(Funny message from Uber). ఆ తరువాత ఈ విషయాన్ని నెట్టింట షేర్ చేయడంతో అనేక మంది బెంగళూరు వాసులు పడీపడి నవ్వుకున్నారు. బెంగళూరులో లైఫ్ ఇంతే అంటూ కామెంట్ చేశారు.