Valentine's Day రోజున ఒక్కటైన అరుదైన జంట
ABN , First Publish Date - 2023-02-17T12:38:44+05:30 IST
కొత్త సంవత్సరంలో పెళ్లిళ సీజన్ మొదలైంది. ఇంకేముంది..దేశవ్యాప్తంగా వేల జంటలను ఒక్కటవుతున్నాయి. నూరేళ్ల బంధానికి గుర్తుగా వేసి
కొత్త సంవత్సరంలో పెళ్లిళ సీజన్ మొదలైంది. ఇంకేముంది..దేశవ్యాప్తంగా వేల జంటలను ఒక్కటవుతున్నాయి. నూరేళ్ల బంధానికి గుర్తుగా వేసి సంసార జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. అంగరంగ వైభవంగా బంధువుల అక్షింతలు, దీవేనల మధ్య ఒక్కటవుతున్నారు. అయితే.. కేరళలో మాత్ర ఓ అరుదైన పెళ్లి జరిగింది. వాలెంటెన్స్ డే రోజున బంధుమిత్రుల సమక్షంలో ఓ ట్రాన్స్ జెండర్ జంట ఒక్కటైంది. కేరళలో ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున ఓ అరుదైన జంట భార్యభర్తలుగా సంసార జీవితాన్ని ప్రారంభించారు. వాలెంటైన్స్ డే రోజున ఈ పెళ్లి జరగటం ఓ ప్రత్యేకంగా నిలిచింది.
ఇద్దరు ట్రాన్స్ జెండర్స్ మధ్య చిగురించిన ప్రేమ..ఒడిదుడుకులను దాటుకుని పెళ్లి పీటలు ఎక్కింది. పలక్కడుకు మిస్టర్ కేరళ ట్రాన్స్ జెండర్..2021 విజేత ప్రవీణ్ నాథ్, మిస్ మలబార్ ట్రాన్స్ జెండర్ రిషన ఐషూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరి పెళ్లి ఇరు కుంటుంబాలు వారి దగ్గరి బంధువుల సమక్షంలో పలక్కడ్ లో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు వీరి పెళ్లి దగ్గరుండి జరిపించారు. అయితే..వీరి ప్రేమ పెళ్లి వరకు రావటానికి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొవాల్సివచ్చింది. వాటంన్నింటీని భరించారు. సమాజంలో సూటిపోటీ మాటలు కూడా ఎదుర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చిన వారి ప్రేమను మాత్రం వదల్లేదు. ఇరు కుటుంబాలకు వారి ఇష్టాలను అర్థమయ్యేలా చెప్పి పెళ్లికి ఒప్పించారు. ప్రేమికుల రోజే వివాహ బంధంతో ఒక్కటయ్యారు.