కాబోయే భర్తతో రోజూ ఫోన్‌కాల్స్.. నిత్యం చాటింగ్.. కానీ సడన్‌గా అతడి నుంచి నో రెస్పాన్స్.. ఆరా తీస్తే అసలు నిజం తెలిసి ఆ యువతికి షాక్..!
ABN , First Publish Date - 2023-04-15T15:56:56+05:30 IST
పెళ్లి ముహుర్తం వెతికే పనిలో పెద్దలు ఉండగా అమ్మాయి అబ్బాయి ఇద్దరూ ఫోన్ కాల్స్, చాటింగ్ లో..
ప్రస్తుత కాలంలో కాబోయే భార్యాభర్తలు చాటింగ్(chatting) చేసుకోవడం, ఫోన్ లో మాట్లాడుకోవడం(phone calls talking) చాలా సహజం. పెద్దలు కూడా ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరం చెప్పరు. ఓ అమ్మాయి తనకు కాబోయే భర్తతో పిచ్చాపాటిగా చాటింగ్ చేయడం, ఫోన్ లో మాట్లాడటం చేసేది. అమ్మాయి అబ్బాయి మధ్య బాగా చనువు పెరిగింది కూడా.. కానీ ఏం జరిగిందో ఏమో.. ఉన్నట్టుండి అతన్నుండి ఎలాంటి స్పందన లేదు. అతనికి ఏమయ్యిందోనని ఆమె కంగారు పడింది. ఆరా తీస్తే ఆ అమ్మాయికి పెద్ద షాకే తగిలింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
హర్యానా(Haryana) రాష్ట్రం గురుగ్రామ్(Gurugram) లో ఓ యువతి కుటుంబం నివసిస్తోంది ఆమెకు పెళ్ళి చేయాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఆమె ప్రొపైల్ ను మాట్రిమోని(matrimony)లో నమోదు చేయించారు. అమ్మాయికి తగిన అబ్బాయి కోసం వారు వెతికేవారు. ఈ క్రమంలో ఓ కుర్రాడి ప్రొపైల్ వారిని ఆకర్షించింది.సంవత్సరానికి 50-70లక్షల రూపాయల(50-70lakhs) ఆదాయంతో హెచ్ఆర్ ప్రొపెషనల్(HR Professional) గా ఉన్న కుర్రాడిని వారు సంప్రదించారు. ఆ తరువాత వారు ఫోన్ లో మాట్లాడుకుని పెళ్ళిసంబంధం ఓకే చేసుకున్నారు. పెళ్లి ముహుర్తం వెతికే పనిలో పెద్దలు ఉండగా అమ్మాయి అబ్బాయి ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ లో చాటింగ్ చేసుకునేవారు. అతనికి ఉన్న ఆస్తులు, ఖరీదైన కార్ల ఫోటోస్ ను అబ్బాయి అమ్మాయికి పంపించాడు. అవి చూసి ఆ అమ్మాయి తనకంటే అదృష్టవంతురాలు ఉండదని మురిసిపోయింది. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చిలో 'ఐఫోన్ 14మ్యాక్స్ మొబైల్(i phone 14max) ఫోన్ లు తనకు తెలిసిన వారి ద్వారా తక్కువ ధరకే వస్తాయి, మీ ఫ్యామిలో ఎవరికైనా కావలంచే నేను ఇప్పిస్తాను' అని చెప్పాడు. ఆ అమ్మాయి అతను చెప్పింది నిజమేనని నమ్మి, ఎనిమిది మంది మొబైల్స్ కావాలని అడిగారు అంటూ 3.05లక్షల రూపాయలు అతనికి యూపీఐ(UPI) ద్వారా సెండ్ చేసింది.
Onions: వామ్మో ఉల్లిపాయతో ఎన్ని లాభాలో అని సంబరపడ్డాం.. కానీ ఇన్ని ప్రమాదాలున్నాయని తెలిస్తే..
అమ్మాయి డబ్బు పంపిన తరువాత అతను ఫోన్ చేయడం మానేశాడు. అమ్మాయి ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. వాట్సాప్ లోనూ, ఇన్స్టాగ్రామ్ లోనూ అతను ఆమెను బ్లాక్ చేశాడు. దీంతో తను మోసపోయానని ఆమెకు అర్థమైంది. పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు అందుకున్న పోలీసులు అతని గురించి విచారణ చేశారు.అతను 2018లో గురుగ్రామ్ లో ఎంఎన్‌సీ కంపెనీలో హెచ్ఆర్ ప్రొఫెషనల్ గా పనిచేశాడు. ఆ తరువాత ఆ ఉద్యోగం మానేసి 2021లో రెస్టారెంట్ ప్రారంభించాడు. అది సక్సెస్ కాలేదు. దీంతో అమ్మాయిలను ట్రాప్ చేసి డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. అలా ఇంతకు ముందు ఎంతమందిని మోసం చేశాడనే విషయాన్ని కూపీ లాగుతున్నారు పోలీసులు.