Geetha Singh: నటి గీతా సింగ్ పెద్ద కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి
ABN , First Publish Date - 2023-02-18T11:25:03+05:30 IST
టాలీవుడ్ లేడీ కమెడియన్స్‌లో.. చాలా తక్కువ సినిమాలలో నటించి.. మంచి పేరు తెచ్చుకున్న నటి గీతా సింగ్ (Geetha Singh). ఆమె ఇంట ఇప్పుడు విషాదం నెలకొంది. గీతా సింగ్ ఎంతో ప్రేమగా చూసుకునే
టాలీవుడ్ లేడీ కమెడియన్స్‌లో.. చాలా తక్కువ సినిమాలలో నటించి.. మంచి పేరు తెచ్చుకున్న నటి గీతా సింగ్ (Geetha Singh). ఆమె ఇంట ఇప్పుడు విషాదం నెలకొంది. గీతా సింగ్ ఎంతో ప్రేమగా చూసుకునే పెద్ద కుమారుడు (Geetha Singh Son) రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లుగా తాజాగా నటి కరాటే కళ్యాణి (Karate Kalyani) సోషల్ మీడియా ద్వారా తెలిపారు. వాస్తవానికి గీతా సింగ్‌కు ఇంకా పెళ్లి కాలేదు. ప్రస్తుతం ఆమె సింగిల్‌గానే జీవిస్తున్నా.. తన అన్న కుమారులనే దత్తత తీసుకుని తన బిడ్డలుగా పెంచుకుంటోంది. కర్ణాటక (Karnataka)లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో.. కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు చనిపోయినట్లుగానూ, వారిలో గీతా సింగ్ పెద్ద కుమారుడు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియలేదు కానీ.. కరాటే కళ్యాణి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌తో ఒక్కసారిగా టాలీవుడ్లో విషాధ చాయలు అలుముకున్నాయి.
‘‘దయచేసి కారులో అయినా.. బైక్పైనైనా జాగ్రత్తగా వెళ్లండి పిల్లలు.. కమెడియన్ గీతాసింగ్ అబ్బాయి యాక్సిడెంట్ వల్ల మృతి చెందారు.. ఓం శాంతి’’ అని కరాటే కళ్యాణి తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేసింది (Karate Kalyani Facebook Post). ఈ పోస్ట్ చూసిన వారంతా.. గీతాసింగ్ కుమారుడి ఆత్మకు శాంతి (RIP) చేకూరాలని కోరుతూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే గీతా సింగ్ కుమారుడి గురించి, అతని మరణ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.