Adipurush: ఆదిపురుష్ హిట్టో.. ఫట్టో.. తర్వాత సంగతి.. పాపం.. ఓం రౌత్ మాత్రం ఈ విషయంలో బలైపోయాడు..!

ABN , First Publish Date - 2023-06-16T16:45:42+05:30 IST

‘ఆదిపురుష్’ సినిమా చూసిన ప్రేక్షకులు విజువల్ ఎఫెక్ట్స్‌‌పై పెదవి విరుస్తున్నారు. సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్‌ నాసిరకంగా ఉన్నాయని అభిమానులు సైతం అసంత‌ృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Adipurush: ఆదిపురుష్ హిట్టో.. ఫట్టో.. తర్వాత సంగతి.. పాపం.. ఓం రౌత్ మాత్రం ఈ విషయంలో బలైపోయాడు..!

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన పాన్ ఇండియా సినిమా ‘‘ఆది పురుష్’’ (Adipurush) భారీ అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆదిపురుష్ రివ్యూలు (Adipurush Review) కూడా నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కోసం చాలా కాలంగా ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా సగటు సినీ అభిమాని కూడా ఎదురుచూశాడు. మొత్తానికి వారందరీ ఎదురుచూపులకు తెరదించుతూ ఈ తెల్లవారుజాము నుంచే ఆదిపురుష్ (Adipurush) సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో అనేక చోట్ల ఉదయం 4 గంటల నుంచే షోలు మొదలయ్యాయి.

0231a81f-227e-484c-8b05-33fbab9bcc0f.jpg

ఆదిపురుష్ సినిమా చూసిన ప్రేక్షకులు విజువల్ ఎఫెక్ట్స్‌ (Adipurush Visual Effects)పై పెదవి విరుస్తున్నారు. సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్‌ నాసిరకంగా ఉన్నాయని అభిమానులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రూ.500 కోట్ల బడ్జెట్ ఉన్నప్పటికీ విజువల్ ఎఫెక్ట్స్‌‌ను సరిగ్గా జోడించడంలో ఫెయిలయ్యారంటూ దర్శకుడు ఓంరౌత్‌ (Om Raut)పై సోషల్ మీడియా (social media) వేదికగా నెటిజన్లు మండిపడుతున్నారు.

edbbaa23-8aa1-4504-b8db-083f38d185ed.jpg

ఓంరౌత్‌ను విమర్శిస్తూ నెటిజన్లు పోస్ట్ చేస్తున్న ట్వీట్స్ ప్రస్తుతం ట్విట్టర్‌(twitter)లో ట్రెండ్ అవుతున్నాయి. ఆదిపురుష్‌లోని సీన్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెటిజన్లు చేస్తున్న మీమ్స్ వైరల్‌గా మారాయి.

6479d6a4-4751-4625-bfce-124dfb0f979e.jpg

ఈ క్రమంలో దాదాపు 20 ఏళ్ల క్రితం విడుదలైన మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటించిన అంజి సినిమా ఉన్నట్టుండి తెరపైకొచ్చింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అంజి సినిమాలోని సీజీఐ (CGI), విజువల్ ఎఫెక్ట్స్‌ ప్రస్తావిస్తూ (VFX) ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలను పోస్ట్ చేసి మరీ కొందరు నెటిజన్లు హైలైట్ చేస్తున్నారు.

e26eaa0b-9c68-4ea1-94ad-9fa64ee4297c.jpg

ఆదిపురుష్ విజువల్ ఎఫెక్ట్స్ కంటే 20 ఏళ్ల క్రితం వచ్చిన అంజి వీఎఫ్‌ఎక్స్ మెరుగ్గా ఉన్నాయని ఓం రౌత్‌ను విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. గతేడాది విడుదలైన ఆచార్య చిత్రంలోని చిరంజీవి యంగ్ లుక్‌ను ప్రస్తావిస్తూ ఆదిపురుష్ విజువల్ ఎఫెక్ట్స్‌ను ఆ గెటప్‌తో పోలుస్తూ ట్విట్టర్‌లో కొందరు ఓం రౌత్‌ను దెప్పిపొడుస్తున్నారు. దర్శకుడు ఓంరౌత్ నిర్మాతలు పెట్టిన 500 కోట్ల రూపాయలను బూడిదలో పోసేశాడని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం కొసమెరుపు.

d02f0c3a-ecc0-41ce-a7a7-f4e892523312.jpg

నిజానికి ఆదిపురుష్ విజువల్ ఎఫెక్ట్స్‌ (Visual Effects)పై మొదటి నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా టీజర్ విడుదలైనప్పుడే విమర్శలు హోరెత్తాయి. సినిమా యూనిట్ సోషల్ మీడియాలో దారుణమైన ట్రోల్స్‌ను ఎదుర్కొవల్సి వచ్చింది. దీంతో గత సంక్రాంతికే రావాల్సిన ఈ సినిమాను 6 నెలలపాటు వాయిదా వేశారు. ఈ 6 నెలలు విజువల్ ఎఫెక్ట్స్‌ (Visual Effects)ను మెరుగుపరిచారు. అయినప్పటికీ విజువల్ ఎఫెక్ట్స్‌ (Visual Effects) నాసిరకంగానే ఉన్నాయని సినిమా చూసొచ్చిన కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

Updated Date - 2023-06-16T16:46:09+05:30 IST