Viral: ఫోన్ చోరీ అయితే పోనీలే అనుకున్నాడు! మరో ఫోన్‌లో కొత్త సిమ్ కార్డు వేశాక భారీ షాక్..!
ABN , First Publish Date - 2023-10-10T17:16:53+05:30 IST
ఫోన్ చోరీ అయితే మరో ఫోన్‌లో కొత్త సిమ్ వేసుకున్న వ్యక్తి భారీ షాక్. అతడి అకౌంట్లో ఏకంగా రూ.43 వేలు మాయం. కోల్‌కతాలో ఇటీవల వెలుగు చూసిందీ ఘటన. ఫోన్‌లో పాస్‌వర్డ్ స్టోర్ చేసుకోవడంతో ఇలా జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా మనందరం బస్సులో ఎక్కడికైనా వెళ్లేటప్పుడు కిటికీ పక్క సీటులో కూర్చోవాలని కోరుకుంటాం. కోరుకున్న సీటు దొరగ్గానే జేబులోని ఫోను తీసి వీడియోలో మరోటో చూస్తూ లోకాన్ని మర్చిపోతాం. అచ్చు ఇలాగే చేసిన ఓ వ్యక్తి చివరకు భారీగా నష్టపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే,
Viral: డాక్టర్ చేతిరాత అర్థంకాక మెడికల్ షాపు సిబ్బంది ఘోర తప్పిదం.. మహిళ జీవితం తలకిందులు..
పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతా(Kolkata) నగరానికి చెందిన శంకర్ ఘోష్ బస్సులో కిటికీ పక్కన సీటులో కూర్చుని ఇటీవల ప్రయాణిస్తుండగా ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అతడు ఏమరపాటుగా ఉన్న సమయంలో ఓ దొంగ కిటికీలోంచి చేయిపెట్టి అతడి ఫోన్ లాక్కుని పారిపోయాడు. బాధితుడు తేరుకుని అతడిని వెంబడించేందుకు లేచేలోపే దొంగ కనుమరుగైపోయాడు.
ఫోన్ పోతే పోయిందిలే అనుకుని శంకర్ మరో సిమ్ కార్డు తీసుకుని కొత్త ఫోన్‌లో వేసుకున్నాడు. ఆ మరుక్షణమే అతడి అకౌంట్లోంచి ఏకంగా రూ.42 వేలు మాయమైనట్టు మెసేజీ వచ్చింది(after losing phone man realizes his money from bank account stolen). ఇది చూసుకుని అతడికి దిమ్మతిరిగినంత పనైంది. గాబరాపడిపోయిన బాధితుడు వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించారు. వారు బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు. అయితే, దొంగలు అకౌంట్ పిన్ నెంబర్ ఎంటర్ చేసే నగదు బదిలీ చేసుకున్నట్టు బ్యాంకు అధికారులు చెప్పారు.
NRI: కెనడాలో భారతీయుల పాట్లు.. వైద్య డిగ్రీలు ఉండి కూడా క్యాబ్ డ్రైవర్లుగా ఉద్యోగాలు!
కానీ, శంకర్ మాత్రం తన ఫోన్ హ్యాకైందని ఘంటా పథంగా చెప్పారు. బ్యాంకు వారు మాత్రం హ్యాకైన దాఖలాలు లేవని కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో బాధితుడు తన ప్యాస్‌వర్డ్, లేదా పిన్ ఫొనులోనే స్టోర్ చేసుకుని ఉండటంతో అది దొంగలకు చిక్కి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సైబర్ నిపుణుల చెబుతున్నారు. పాస్‌వర్డ్ కింద కుదిరితే బయోమెట్రిక్ డాటా వాడాలని చెబుతున్నారు. బయటకు తీసుకెళ్లే ఫోన్లలో బ్యాంకింగ్ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోవద్దని సూచిస్తున్నారు. ఇళ్లల్లో ఉండే ఫోన్లలోనే విటిని పెట్టుకోవాలని చెబుతున్నారు. అదే సమయంలో ఫోన్ అన్‌లాక్ చేసేందుకు ఒక పిన్, బ్యాంకింగ్ యాప్ అన్‌లాక్ చేసేందుకు మరో పిన్ వాడాలని సూచిస్తున్నారు. పాస్‌వర్డ్ లేదా పిన్ నెంబర్లు లాంటివి ఫోన్లలో అస్సలు స్టోర్ చేసుకోవద్దని చెబుతున్నారు.