Share News

Agra: బాబోయ్..ఇలాక్కూడా జరుగుతుందా? గుండెకు దగ్గరగా ఫోన్ ఉండటంతో తప్పిన ప్రాణాపాయం!

ABN , First Publish Date - 2023-10-21T18:32:39+05:30 IST

అకస్మాత్తుగా వ్యక్తులు అనారోగ్యం పాలైతే వెంటనే గుర్తించి అత్యవసర సిబ్బందికి సమాచారం అందించే యాపిల్ వాచ్‌ల గురించి మనందరం చాలా సార్లు విన్నాం. కానీ, అంతకంటే షాకింగ్ ఘటన ఒకటి ఆగ్రాలో ఇటీవల వెలుగు చూసింది.

Agra: బాబోయ్..ఇలాక్కూడా జరుగుతుందా? గుండెకు దగ్గరగా ఫోన్ ఉండటంతో తప్పిన ప్రాణాపాయం!

ఇంటర్నెట్ డెస్క్: అకస్మాత్తుగా వ్యక్తులు అనారోగ్యం పాలైతే వెంటనే గుర్తించి అత్యవసర సిబ్బందికి సమాచారం అందించే యాపిల్ వాచ్‌ల గురించి మనందరం చాలా సార్లు విన్నాం. కానీ, అంతకంటే షాకింగ్ ఘటన ఒకటి ఆగ్రాలో(Agra) ఇటీవల వెలుగు చూసింది. ఓ వ్యక్తి తన షర్టు జేబులో స్మార్ట్ ఫోన్ పెట్టుకోవడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది(Smart phone saves man from bullet).

Viral video: నల్లా నుంచి నీరు లోప్రెజర్‌తో వస్తోందని ఇతడేం చేశాడో తెలిస్తే..


పూర్తి వివరాల్లోకి వెళితే, సదర్ పోలిస్ స్టేషన్ పరిధిలో ఉండే విశాల్ కుమార్ స్థానికంగా ఓ టెంట్ షాపు నిర్వహిస్తున్నాడు. అతడికి గోపీ నగర్ కాలనీలో కొంత స్థలం ఉంది. ఇటీవల విశాల్ తనకు వరసకు మామయ్య అయే శ్రీనివాస్‌తో కలిసి మంగళవారం స్థలాన్ని చూసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఏదో కారణంతో పొరుగున్న ఉన్న దినేశ్ పాఠక్‌తో వారికి గొడవ జరిగింది. చూస్తుండగానే వివాదం పెద్దది కావడంతో విచక్షణ కోల్పోయిన దినేశ్ పాఠక్‌ వారిపై కాల్పులు జరిపాడు.

NRI: రోడ్డు పక్కన విదేశీ మహిళ మృతదేహం.. సీసీటీవీ కెమెరాలు పరిశిలిస్తే వెలుగులోకొచ్చి దారుణం..


దినేశ్ నేరుగా శ్రీనివాస్ ఛాతిపై గురిపెట్టడంతో తూటా అతడి జేబులో ఉన్న స్మార్ట్‌ఫోన్‌కు తగిలి ప్రాణాపాయం తప్పింది. జేబులో స్మార్ట్‌ఫోన్ లేకపోయి ఉంటే తూటా నేరుగా గుండెలోకి దూసుకుపోయి ఉండేదని విశాల్ చెప్పుకొచ్చాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం విశాల్, శ్రీనివాస్ ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Canada Visa: ముదిరిన దౌత్య వివాదం.. భారతీయ విద్యార్థులకు భారీ షాకిచ్చిన కెనడా!

Shocking: 28 ఏళ్ల యువతిని పెళ్లాడిన తండ్రి, సపోర్టుగా నిలిచిన తాత.. ఇది తట్టుకోలేక ఆ ఇద్దరు యువకులు..

Updated Date - 2023-10-21T18:38:57+05:30 IST