Aishwarya Lekshmi: నటుడి ప్రేమలో హీరోయిన్!
ABN , First Publish Date - 2023-01-12T18:46:51+05:30 IST
భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తున్న అందాల భామ ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi). ‘గాడ్సే’, ‘అమ్ము’, ‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan) వంటి చిత్రాలతో ఈ భామ తెలుగు వారికి చేరువైంది.
భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తున్న అందాల భామ ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi). ‘గాడ్సే’, ‘అమ్ము’, ‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan) వంటి చిత్రాలతో ఈ భామ తెలుగు వారికి చేరువైంది. ఈ నటి తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. కోలీవుడ్ నటుడు అర్జున్ దాస్ (Arjun Das)తో ప్రేమలో ఉన్నట్టు వెల్లడించింది. అతడితో దిగిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఆ పిక్ కింద క్యాప్షన్‌గా లవ్ సింబల్‌ను చేర్చింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులందరు షేర్ చేసుకోవడం మొదలుపెట్టారు. మరో వైపు సెలబ్రిటీలందరు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్‌లు పెట్టారు.
విభిన్న పాత్రలు, వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ ఈ భామ కెరీర్లో దూసుకుపోతుంది. తాజాగా ‘మట్టి కుస్తీ’ లోనూ నటించింది. కుస్తీ తెలిసిన గృహిణి పాత్రలో కనిపించింది. ఇక అర్జున్ దాస్ విషయానికి వస్తే.. విలన్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. మాస్టర్ సినిమాలో మాదక ద్రవ్యాలకు బానిసైన స్టూడెంట్ పాత్రను పోషించాడు. ‘ఖైదీ’, ‘విక్రమ్’ చిత్రాల్లోను కీలక పాత్రలు పోషించాడు. తాజాగా ‘బుట్ట బొమ్మ’ లోను నటించాడు. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా జనవరి 26న విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు.