Akshay Kumar: పాస్‌పోర్టును తిరిగి ఇచ్చే ఛాన్స్ రావడం నాకు దొరికిన అదృష్టం
ABN , First Publish Date - 2023-02-24T12:51:39+05:30 IST
మాస్, కామెడీ అన్ని రకాల సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar). 30రోజుల నుంచి 40రోజుల్లోనే సినిమాలను పూర్తి చేస్తుంటారు. ప్రతి ఏడాది ఐదు నుంచి ఆరు చిత్రాలను విడుదల చేస్తుంటారు.
మాస్, కామెడీ అన్ని రకాల సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar). 30రోజుల నుంచి 40రోజుల్లోనే సినిమాలను పూర్తి చేస్తుంటారు. ప్రతి ఏడాది ఐదు నుంచి ఆరు చిత్రాలను విడుదల చేస్తుంటారు. తాజాగా ఆయన ‘సెల్ఫీ’ (Selfiee)లో నటించారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా అక్కీ మీడియాతో ముచ్చటించారు. కెనడియన్ సిటిజన్ షిప్ గురించి మాట్లాడారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ఒకానొక సమయంలో తన కెరీర్లో వరుసగా 15ప్లాఫ్లను ఇచ్చారు. ఫలితంగా ‘ఖిలాడీ’ హీరో 1990ల్లో కెనడా పౌరసత్వం తీసుకున్నారు. ఆ దేశంలోని తన స్నేహితుడి వద్ద ఏదైనా పని చూసుకుందామనుకున్నారు. ఫలితంగా అభిమానులు అక్కీని తీవ్రంగా విమర్శించడం మొదలుపెట్టారు. ఇండియాలో అర్జిస్తూ వేరే దేశ పౌరసత్వం ఏ విధంగా తీసుకుంటారని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కొంత మంది అయితే కెనడియన్ కుమార్ అని కూడా పిలవడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అక్షయ్ ఈ విమర్శలు, ట్రోల్స్‌పై స్పందించారు. ‘‘ఇండియానే నాకు అంతా ఇచ్చింది. నాకు వచ్చిన పేరు, ప్రఖ్యాతలు ఏదైనా సరే ఇక్కడి నుంచే లభించింది. కెనడియన్ పాస్‌పోర్టును తిరిగి ఇచ్చే ఛాన్స్ రావడం నాకు దొరికిన అదృష్టం. అన్ని విషయాలు తెలుసుకోకుండా పౌరసత్వాన్ని విమర్శిస్తే నాకు బాధ కలుగుతుంది. కెనడాకు వెళ్లిన కొన్ని రోజుల తర్వాత ఇండియాకు తిరిగి వెళ్లి పని చేసుకోమని నా మిత్రుడు చెప్పారు. అనంతరం సినిమాలు చేయడం ప్రారంభించాను. కెనడా పౌరసత్వం గురించి పూర్తిగా మరచిపోయాను. ప్రస్తుతం ఇండియన్ సిటిజన్ షిప్‌ను తిరిగి తీసుకునే పనిలో ఉన్నాను’’ అని అక్షయ్ కుమార్ తెలిపారు.
మాలయాళం హిట్ ‘డ్రైవింగ్ లైసెన్స్’ కు రీమేక్‌గా ‘సెల్ఫీ’ రూపొందింది. ఇమ్రాన్ హష్మీ కీలక పాత్ర పోషించారు. నుస్రత్ బరుచా, డయనా పెంటీ హీరోయిన్స్‌గా నటించారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 24న విడుదల కానుంది.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
ఇవి కూడా చదవండి:
RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్
Vishal: భారీ ప్రమాదం.. కొంచముంటే విశాల్ ప్రాణాలు పోయేవి.. వీడియో వైరల్
Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!