Amazon: అదిరిపోయే ఆఫర్‌ను తెచ్చిన అమెజాన్.. క్యాష్‌ ఆన్ డెలివరీ ఆప్షన్‌ను వాడుకునే వాళ్లకు సూపర్ ఛాన్స్..!

ABN , First Publish Date - 2023-08-05T18:23:29+05:30 IST

పెద్ద నోట్లను మార్పిడి చేసుకోవాలనుకుంటున్న కస్టమర్లకు అమెజాన్ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. క్యాషన్ డెలివరీ ఎంచుకున్న వారు తమ వద్ద ఈ నోట్లను మార్పిడి చేసుకోవచ్చని సూచించింది. వస్తువు డెలివరీ సమయంలో ఈ నోట్లు తీసుకుని మిగిలిన మొత్తాన్ని డెలివరీ ఏజెంట్ అమెజాన్ పేలో జమచేస్తాడని వెల్లడించింది. అయితే, కేవైసీ వివరాలు ఇచ్చిన వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.

Amazon: అదిరిపోయే ఆఫర్‌ను తెచ్చిన అమెజాన్.. క్యాష్‌ ఆన్ డెలివరీ ఆప్షన్‌ను వాడుకునే వాళ్లకు సూపర్ ఛాన్స్..!

ఇంటర్నెట్ డెస్క్: భారత రిజర్వ్ బ్యాంకు(RBI) రెండు వేల నోటును ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ప్రజలు తమ వద్ద ఉన్న రెండు వేల నోట్లను బ్యాంకుల్లో జమచేయాలని కూడా సూచించింది. ఇందుకు కోసం గడువు కూడా విధించింది. ఈ గడువు త్వరలో ముగియనున్న నేపథ్యంలో కస్టమర్ల సౌకర్యార్థం అమెజాన్ ఓ ఆఫర్ ఇచ్చింది. క్యాష్ ఆన్ డెలివరీ(Cash On Delivery) ఎంచుకున్న వినియోగదారులు సులువుగా తమ నోట్లను మార్చుకునేందుకు(Exchange Rs 2000 notes) ఈ సదుపాయం కల్పించింది.


అమెజాన్ ద్వారా నోట్లు మార్చుకోదలిచిన వారు ముందుగా..

  • అమెజాన్ యాప్‌లో తమ వీడియోకాల్ ద్వారా కేవైసీ వివరాలను నమోదు చేసుకోవాలి

  • ఆ తరువాత క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా ఏదైనా వస్తువుకు ఆర్డర్ పెట్టాలి

  • వస్తువు డెలివరీ సమయంలో ఏజెంట్ కస్టమర్ నుంచి రెండు వేల నోట్లను తీసుకుని మిగిలిన మొత్తాన్ని అమెజాన్ పే అకౌంట్‌లో డిపాజిట్ చేస్తాడు.

  • అమెజాన్ పేలో(Amazon Pay) బ్యాలెన్స్ అప్పటికప్పుడు అప్‌డేట్ కావడంతో కస్టమర్ వెంటనే తనిఖీ చేసుకోవచ్చు


అయితే, కస్టమర్లు రెండు వేల నోట్లు సహా రోజుకు గరిష్ఠంగా రూ.50 వేలు మాత్రమే ఇచ్చే అవకావం కల్పించింది. కేవైసీ నిబంధనలను పాటించిన వారికి మాత్రమే ఈ అవకాశమని అమోజాన్ స్పష్టం చేసింది. ఇక అమెజాన్ పే లోని మిగిలిన బ్యాలెన్స్‌తో కస్టమర్లు ఆన్‌లైన్ షాపింగ్, క్యూఆర్ కోడ్ ఆధారిత చెల్లింపులు, మొబైల్ రీచార్జ్, ఫ్రెండ్స్ బంధువులకు నగదు బదిలీ, స్వీగ్గీ జొమాటో వంటి వేదికల్లో చెల్లింపులు వంటివి యథాప్రకారం చేయవచ్చు.

Updated Date - 2023-08-05T18:26:17+05:30 IST