Share News

Anand Mahindra: అప్పటికి నాకు ఎన్నేళ్లు వస్తాయో ఆలోచించారా..? నెటిజన్‌కు ఆనంద్ మహీంద్రా సూటి ప్రశ్న..

ABN , Publish Date - Dec 26 , 2023 | 03:48 PM

వైరల్ బుడ్డోడికి ఎస్‌యూవీని గిఫ్ట్‌గా ఇవ్వాల్సిందేనన్న నెటిజన్..ఆనంద్ మహీంద్రా రెస్పాన్స్ చూస్తే..

Anand Mahindra: అప్పటికి నాకు ఎన్నేళ్లు వస్తాయో ఆలోచించారా..? నెటిజన్‌కు ఆనంద్ మహీంద్రా సూటి ప్రశ్న..

ఇంటర్నెట్ డెస్క్: రూ.700లకే మహీంద్రా థార్ (THAR) కొందామంటూ ఇటీవల ఓ బుడ్డోడు నెట్టింట వైరల్‌గా (Viral Noida boy) మారిన విషయం తెలిసిందే. మహీంద్రా థార్ ఎస్‌యూవీ, ఎక్స్‌యూవీ 700 కార్లు ఒకటే అనుకున్న ఆ కుర్రాడు 700 రూపాయలతో ఆ కారు కొనేద్దామని తండ్రిని ఒప్పించే ప్రయత్నం చేశాడు. ఇదంతా వీడియో తీసిన తండ్రి నెట్టింట పోస్ట్ చేయడంతో వీడియో ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) వరకూ వెళ్లింది. బుడ్డోడి అమాయకపు మాటలకు ఆయన కూడా తెగ ముచ్చటపడ్డారు. కానీ, కుర్రాడు చెప్పినదానికి అంగీకరిస్తే దివాలా తీయాలంటూ సరదా వ్యాఖ్యచేశారు. అయితే, ఈ వీడియోపై ఆనంద్ మహీంద్రా ఇచ్చిన మరో రిప్లై ప్రస్తుతం వైరల్‌గా మారింది.


కుర్రాడి ముద్దుముద్దు మాటల వీడియో గత కొన్ని రోజులుగా వైరల్ అవుతూనే ఉంది. బుడ్డోడి కామెంట్‌పై ఆనంద్ మహీంద్రా రియాక్షన్ చూశాక జనాలు రకరకాల కామెంట్స్ చేశారు. ఈ లోపల ఓ నెటిజన్ ఆనంద్ మహీంద్రా దృష్టిని ఆకర్షించేలా ఓ ఆసక్తికర కామెంట్ చేశాడు. ‘‘చిన్నోడికి రూ.700లకే కారు అమ్మేబదులు అతడు మేజర్ అయ్యాక అదే కారును బహుమతిగా ఇవ్వొచ్చు కదా?’’ అని ప్రశ్నించారు.


ఈ ప్రశ్న ఆనంద్ మహీంద్రాకు నచ్చడంతో ఆయన వెంటనే స్పందించారు. ఇందుకు నాకు ఓకే కానీ అప్పటికి నాకు ఎన్నేళ్లు వస్తాయో ఆలోచించారా? అని నెటిజన్‌ను ఆనంద్ మహీంద్రా ఎదురు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు నెట్టిజన్ల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. ‘‘మీకూ అనీల్ కపూర్‌కు ఏజ్ అనేది ఓ అంకె మాత్రమే. మీరెప్పటికీ యంగ్‌గానే ఉంటారు’’ అని ఒకరు కామెంట్ చేశారు. అనేక మంది ఈ అభిప్రాయంతో ఏకీభవించారు. ఆనంద్ మహీంద్రా ఎప్పటికీ యువ ఛాంపియనే అంటూ ప్రశంసలు కురిపించారు.

Updated Date - Dec 26 , 2023 | 04:01 PM