ButtaBomma: కథానాయికగా మొదటి సారి చేస్తున్న అనిఖా సురేంద్రన్

ABN , First Publish Date - 2023-01-19T13:09:05+05:30 IST

అనిఖా మొట్ట మొదటి సారిగా కథానాయికగా గా నటిస్తున్న చిత్రం 'బుట్ట బొమ్మ' (Child artiste Anikha Surendran turned as lead actress with ButtaBomma). ఇది మలయాళం సినిమా 'కప్పేలా' (Kappela) సినిమాకి రీమేక్ గా వస్తోంది.

ButtaBomma: కథానాయికగా మొదటి సారి చేస్తున్న అనిఖా సురేంద్రన్

అనిఖా సురేంద్రన్ (Anikha Surendran) చైల్డ్ నటిగా చాలా సినిమాలు చేసింది. ఈమధ్య విడుదల అయిన నాగార్జున (Akkineni Nagarjuna) నటించిన 'ఘోస్ట్' (Ghost) సినిమాలో కూడా టీనేజ్ అమ్మాయిగా నటించింది. అలాగే తమిళ సూపర్ స్టార్ అజిత్ (Ajith Kumar) సినిమాలో కూడా టీనేజ్ అమ్మాయిగా నటించిన అనిఖా మొట్ట మొదటి సారిగా కథానాయికగా గా నటిస్తున్న చిత్రం 'బుట్ట బొమ్మ' (Child artiste Anikha Surendran turned as lead actress with ButtaBomma). ఇది మలయాళం సినిమా 'కప్పేలా' (Kappela) సినిమాకి రీమేక్ గా వస్తోంది. "నేను ముందు రోజే 'కప్పేలా' సినిమా చూసాను, ఆ మరుసటి రోజు నాకు సితార ఎంటర్ టైన్ మెంట్ నుండి ఫోన్ వచ్చింది. ఈ సినిమా రీమేక్ చేస్తున్నాం, అందులో చేస్తావా అని, నా ఆనందాన్నికి అవధులు లేవు. ఎందుకంటే నాకు బాగా నచ్చిన సినిమా 'కప్పేలా'," అని చెప్పింది అనిఖా.

anikha2.jpg

మలయాళం సినిమా రెండు సార్లు చూసిందట అనిఖా. అయితే ఆమెకు తెలుగు రాకపోయినా కూడా దర్శకుడు రమేష్ (Director Ramesh) దగ్గరుండి సన్నివేశాలు అన్నీ వివిఆరించాడు అని చెప్తోంది. అలాగే మలయాళం సినిమాలో లా అలాగే చేయనవసరం లేదు, ఆ పాత్ర ని తాను ఎలా వేరే విధంగా అంటే ఇంకా బాగా చేయొచ్చో కూడా చేసి చూపమని, దర్శకుడు ఆమెకి పూర్తి స్వేచ్ఛను ఇచ్చాడు అని చెప్తోంది. అయితే మలయాళం సినిమాకి, తెలుగు 'బుట్ట బొమ్మ' కి పెద్దగా తేడా ఏమి లేకపోయినా, తెలుగు తనం కోసం కొంచెం మార్పులు చేసారు అని చెప్తోంది అనిఖా.

anikha3.jpg

ఇది తన మొదటి సినిమా కథానాయికగా అందుకని చాలా ఆతృతగా ఎప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా, చూస్తానా, ప్రేక్షకులు తన పాత్ర చూసి ఎలా చేసింది, ఏమి అనుకుంటారు అన్న విషయాలని వినాలని కుతూహలంగా వుంది అని చెప్తోంది. తెలుగు వాక్యాలు అర్థం తెలుసుకొని నటించటం కొంచెం కష్టమే అని, కానీ దర్శకుడు సహాయం వలన బాగా చేశాను అని అనుకుంటున్నాను అని చెప్తోంది. ఇది నటిగా తనకు నిరూపించుకునే పాత్ర అని, అది తనకి మొట్ట మొదటి సినిమాగా రావటం ఒక విధంగా అదృష్టమని చెప్పాలి అని అంటోంది. ఈ సినిమా అంత తన భుజస్కందాల మీద ఎక్కువ ఉంటుందని, ఎందుకంటే, ఇది ఒక కథానాయిక మీద ఆధారపడి వున్నా కథ అని, అందుకని కొంచెం ఒత్తిడి తన మీద ఉందని, తాను కూడా అలానే ఫీల్ అయ్యానని చెప్తోంది అనిఖా.

anikha4.jpg

ఈ సినిమా తరువాత, మలయాళం లో కూడా కథానాయికగా మొదటి సారి చేయబోతున్నాను అని, అలాగే తమిళం లో కూడా ఒక సినిమా ఒప్పుకున్నాను అని, ఇంక తెలుగులో కొన్ని ప్రాజెక్ట్స్ ఇంకా చర్చల్లో ఉన్నాయని, అవి తాను ముందుగా చెప్పలేను అని చెప్పింది అనిఖా. ఈ 'బుట్ట బొమ్మ' సినిమా ఇంకా తాను చూడలేదని, మధ్య మధ్యలో కొన్ని సన్నివేశాలు మాత్రమే చూసాను అని, పూర్తి సినిమా చూస్తాను అని చెప్పింది. (Anikha also making her debut as lead actress in Malayalam with a film)

Updated Date - 2023-01-19T13:09:06+05:30 IST