Aparna Balamurali: మహిళతో ప్రవర్తించాల్సిన పద్ధతి ఇది కాదు
ABN , First Publish Date - 2023-01-20T20:01:20+05:30 IST
హీరోయిన్ అపర్ణా బాలమురళీ (Aparna Balamurali)తో ఎర్నాకులం లా కాలేజీ విద్యార్థి అనుచితంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అపర్ణ తాజాగా స్పందించింది.
హీరోయిన్ అపర్ణా బాలమురళీ (Aparna Balamurali)తో ఎర్నాకులం లా కాలేజీ విద్యార్థి అనుచితంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అపర్ణ తాజాగా స్పందించింది. ఆ విద్యార్థి ప్రవర్తన తనను ఎంతగానో బాధించిందని తెలిపింది. ‘‘అంగీకారం లేకుండా ఓ మహిళను తాకడం అనేది నేరమన్న విషయం ఆ మాత్రం తెలియదా..? కుర్చీలోంచి బలవంతంగా నన్ను లేపేందుకు.. నా చేయిని పట్టుకునేందుకు ప్రయత్నించడం సరైంది కాదు. నా భుజం మీద చేయి వేసేందుకు కూడా ప్రయత్నించాడు. ఒక మహిళతో అతడు ప్రవర్తించాల్సిన పద్ధతి ఇది కాదు. ఈ ఘటనపై నేను ఫిర్యాదు చేయదల్చుకోలేదు. ఫిర్యాదు చేసి దాని వెనుక పరిగెత్తే సమయం నాకు లేదు. కానీ, అతడి ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అని అపర్ణ చెప్పింది.
అపర్ణతో అనుచితంగా ప్రవర్తించిన ఆకతాయిని కాలేజీ యాజమాన్యం వారం రోజుల పాటు సస్పెండ్ చేసింది. కాలేజీ యూనియన్ కూడా క్షమాపణలు చెబుతూ ఓ లేఖను విడుదల చేసింది. ‘‘లా కాలేజీ ఈవెంట్లో నటికి వ్యతిరేకంగా చోటు చేసుకున్న ఘటన దురదృష్టకరమైనది. ఈ ఘటన జరిగినప్పుడు యూనియన్ తరఫున ఓ వ్యక్తి క్షమాపణలు కోరాడు. ఆమెకు ఎదురైన ఇబ్బందికర ఘటనకు క్షమాపణలు చెబుతున్నాం. ఇటువంటి ఘటనను యూనియన్ తీవ్రంగా పరిగణిస్తుంది’’ అని లా కాలేజీ యూనియన్ ఓ ప్రకటనను విడుదల చేసింది.
అపర్ణా బాల మురళీ, కో స్టార్ వినీత్ శ్రీనివాసన్ (Vineeth Srinivasan) తో కలసి ‘తన్కమ్’ (Thankam) మూవీ ప్రమోషన్స్ చేస్తుంది. అందులో భాగంగా ఓ లా కాలేజీని సందర్శించింది. ఆమె స్టేజ్‌పై ఉండగా ఓ విద్యార్థి అక్కడికి చేరుకున్నాడు. ఆమెకు షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. నిల్చొమని బలవంతం చేశాడు. భుజంపై చేయి వేయడానికి ప్రయత్నించాడు. యువకుడి ప్రవర్తనతో ఆమె కంగుతింది. సత్వరమే తేరుకుని అతడి నుంచి దూరంగా జరిగింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అనేక మంది నెటిజన్స్ ఆ ఆకతాయిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా కాలేజీ యజమాన్యం అతడిని సస్పెండ్ చేసింది.