Bluetooth: మీ ఫోన్లలో బ్లూటూత్‌ను ఎప్పుడూ ఆన్ చేసే ఉంచుతున్నారా..? అయితే మీరు డేంజర్‌ జోన్‌లో ఉన్నట్టే..!

ABN , First Publish Date - 2023-06-05T14:44:33+05:30 IST

బైక్ డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లడాలన్నా, పనులు చేస్తూ సాంగ్స్ వినాలన్నా, పైల్ షేరింగ్ తదితర పనులు చేయడానికి చాలామంది బ్లూటూత్ ఉపయోగిస్తారు. అయితే ఈ బ్లూటూత్ ను ఎప్పుడూ ఆన్ లోనేే ఉంచితే..

Bluetooth: మీ ఫోన్లలో బ్లూటూత్‌ను ఎప్పుడూ ఆన్ చేసే ఉంచుతున్నారా..? అయితే మీరు డేంజర్‌ జోన్‌లో ఉన్నట్టే..!

ప్రస్తుతం ఉన్న స్మార్ట్ ప్రపంచంలో బ్లూటూత్ డివైజెస్ వాడకం చాలా ఉంది. ప్రతి ఎలాక్ట్రానిక్ పరికరానికి బ్లూటూత్ కనెక్షన్ తప్పనిసరిగా ఉంటోంది. దీని వల్ల డివైజెస్ ను ఆపరేట్ చేయడం చాలా సులువుగా మారింది. అందుకే చాలామంది బ్లూటూత్ వినియోగానికి పెద్ద పీట వేస్తున్నారు. అయితే సౌలభ్యంగా ఉంది కదా అని బ్లూటూత్ ను అతిగా వాడినా.. దాన్ని ఎప్పుడూ ఆన్ లోనే ఉంచినా చాలా దారుణమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఇంతకీ బ్లూటూత్ ఆన్ లోనే ఉంచింతే జరిగేది ఏంటంటే..

బైక్ డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లడాలన్నా, పనులు చేస్తూ సాంగ్స్ వినాలన్నా, పైల్ షేరింగ్ తదితర పనులు చేయడానికి చాలామంది బ్లూటూత్(Blue Tooth) ఉపయోగిస్తారు. స్మార్ట్ యుగంలో బ్లూటూత్ పెద్ద సంచలనమే అని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా బ్లూటూత్ ఇయర్ ఫోన్స్(Bluetooth) వల్ల అన్ని పనులు వాటితోనే చక్కబెట్టేస్తుంటారు. ఈ కారణంగా బ్లూటూత్ ఎక్కువగా ఆన్(Bluetooth on) లో ఉంటుంది. కానీ అలా ఆన్ లో ఉంచితే చాలా ప్రమాదం. ఐఓయస్(ios), ఆండ్రాయిడ్(Android), విండోస్(Windows), లినక్స్(Linux) వంటి పరికరాలలో బ్లూటూత్ ఆన్ లో ఉంటే ఆ డివైజ్ లకు గాలిద్వారా(air) బ్లూబోర్న్(BlueBorne) అనే మార్గంలో హ్యాకర్స్ అటాక్(hackers attack) చేస్తారు. వైరస్ హ్యాకర్లు పరికరాలను నియంత్రించడానికి, కార్పోరేటెడ్ డేటాను తస్కరించడానికి, నెట్వర్క్ యాక్సెస్ చేయడానికి,ఎయిర్ గ్యాప్డ్ నెట్వర్క్ లలోకి చొచ్చుకుపోవడానికి, మాల్వేర్ వైరస్(Malware virus) ను వ్యాప్తి చేయడానికి ఇలా ఎన్నింటికో ఈ బ్లూబోర్న్ దోహదం చేస్తుంది.

Health Tips: 30,40,50.. ఏ వయసులో ఏ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలో తెలుసా? ఈ పరీక్షల వల్ల ఏం జరుగుతుందంటే..


బ్లూబోర్న్ అటాక్ వెక్టర్(attack vector) అనేక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందుతూ నెట్‌వర్క్‌లలో బలహీనమైన ప్రదేశాన్ని టార్గెట్ చేసుకుంటుంది. ఇది అలా టార్గెట్ చేసినప్పుడు ఏ సెక్యూరిటీ వ్యవస్థ డివైజ్ ను రక్షించదు. పరికరం నుండి పరికరానికి గాలి ద్వారా చాలా సులువుగా వ్యాపిస్తుంది. బ్లూటూత్ చాలా యాప్స్ కు లింక్ చేయబడి ఉంటుంది, దీని కారణంగా హ్యాకర్లు అన్నింటిపైనా నియంత్రణ సాధించగలుగుతారు. ఈ బ్లూబోర్న్ కంప్యూటర్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, టీవీలు, రిఫ్రిజిరేటర్‌ లు వంటి బ్లూటూత్ డివైజెస్ అన్నిటిలోకీ చొచ్చుకుపోతుంది. ఈ కారణంగా బ్లూటూత్ ను ఆన్ లోనే ఉంచుకునేవారు తమ పర్సనల్ డేటాను చేతులారా హ్యాకర్ల చేతిలో పెట్టినట్టవుతుంది.

ఈ బ్లూబోర్న్ అటాక్ నుండి తప్పించుకోవాలంటే బ్లూటూత్ ను అవసరమైనప్పుడు మాత్రమే ఆన్ చేసుకోవడం మంచిది. తప్పని పరిస్థితులలో బ్లూటూత్ ఎక్కువసేపు ఆన్ లో ఉంచాలని అనుకుంటే ఆండ్రాయిడ్ సిస్టమ్ ను అప్డేట్ చేయాలి(update android system). ఐఓయస్ 9.3.5(ios 9.3.5) లేదా అంతకంటే తక్కువ వెర్షన్ లో నడుస్తున్న అన్ని ఫోన్ లు, ఇతర పరికరాలపై ఈ బ్లూబోర్న్ ప్రభావం చూపిస్తుంది. ఆండ్రాయిడ్ వెర్షన్ తాజాగా ఉండేలా చూసుకోవండ లేదా బ్లూటూత్ తక్కువ వినియోగించడం బ్లూబోర్న్ ప్రమాదాన్ని తప్పిస్తుంది.

Expired Tablets: గడువు ముగిసిన టాబ్లెట్స్ ను పొరపాటున వేసుకుంటే జరిగేదేంటి..? కొద్ది నిమిషాల్లోనే..!


Updated Date - 2023-06-05T14:44:33+05:30 IST