Viral Video: హెల్మెట్ లేదు.. ఎదురుగా పోలీసులు.. ఓ చిన్న ట్రిక్‌తో ఫైన్ నుంచి తప్పించుకున్న కుర్రాడు..!
ABN , First Publish Date - 2023-04-25T15:04:40+05:30 IST
హెల్మెట్ లేకుండా బైక్ నడపడం చట్ట విరుద్ధం. అయినా చాలా మంది హెల్మెట్ లేకుండా బైక్ జర్నీ చేస్తుంటారు. హఠాత్తుగా పోలీసులు కనిపించినపుడు రకరకాల ట్రిక్కులు ఉపయోగించి జరిమానాల నుంచి తప్పించుకుంటారు.
హెల్మెట్ (Helmet) లేకుండా బైక్ (Bike) నడపడం చట్ట విరుద్ధం. అయినా చాలా మంది హెల్మెట్ లేకుండా బైక్ జర్నీ చేస్తుంటారు. హఠాత్తుగా పోలీసులు (traffic police) కనిపించినపుడు రకరకాల ట్రిక్కులు ఉపయోగించి జరిమానాల నుంచి తప్పించుకుంటారు. తాజాగా వైరల్ (Viral Video) అవుతున్న ఓ వీడియోలో ఓ కుర్రాడు హెల్మెట్ లేకుండా స్కూటీపై వెళ్తున్నాడు. అంతలో రోడ్డుపై అతడికి ట్రాఫిక్ పోలీసులు కనిపించారు. దీంతో ఆ కుర్రాడు ఓ ట్రిక్కు ఉపయోగించి పోలీసుల నుంచి తప్పించుకున్నాడు.
హెల్మెట్ లేకుండా బైక్ నడపడం చట్ట విరుద్ధమే కానీ, బైక్ తోసుకుంటూ వెళ్లడం మాత్రం కాదు. ఆ కుర్రాడు పోలీసులను చూడగానే స్కూటీ దిగి తోసుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు అతడిని పట్టించుకోలేదు. పోలీసులను దాటి పోగానే ఆ కుర్రాడు స్కూటీ స్టార్ట్ చేసుకుని వేగంగా ముందుకు వెళ్లిపోయాడు. ఈ ఘటన మొత్తాన్ని రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. leki_goswami01 అయిన ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.
Viral Video: ఇంటి ముందు స్కూటీని పార్క్ చేస్తున్నారా..? ఇలాంటోళ్లు కూడా ఉంటారు జాగ్రత్త.. ఇద్దరు కుర్రాళ్లు ఓ స్కూటీపై వచ్చి..!
ఈ వీడియోను ఇప్పటివరకు 6 కోట్ల మంది చూశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``ఎన్ని చట్టాలు చేసినా భారతీయుల తెలివితేటల ముందు తేలిపోతాయ``ని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. ``ఈ ట్రిక్ తెలియక ఇప్పటికి ఎన్నోసార్లు ఫైన్ కట్టాన``ని మరొకరు పేర్కొన్నారు.