Viral News: కొద్ది రోజుల్లో పెళ్లనగా ఆస్పత్రికెళ్లిన వధువు.. డాక్టర్లు చెప్పింది విని భారీ షాక్.. ఇక నన్నెవరూ చేసుకోరు అని ఫిక్సయింది కానీ..
ABN , First Publish Date - 2023-04-22T16:17:53+05:30 IST
రాయ్‌పూర్‌కు చెందిన ఆ యువతికి పెళ్లి కుదరింది.. గత గురువారం ఆమె పెళ్లికి ముహూర్తంగా నిర్ణయించారు.. పెళ్లికి సరిగ్గా వారం రోజుల ముందు ఆ యువతి తీవ్ర అస్వస్థతకు గురై హాస్పిటల్‌లో జాయిన్ అయింది..
రాయ్‌పూర్‌కు చెందిన ఆ యువతికి పెళ్లి (Marriage) కుదరింది.. గత గురువారం ఆమె పెళ్లికి ముహూర్తంగా నిర్ణయించారు.. పెళ్లికి సరిగ్గా వారం రోజుల ముందు ఆ యువతి తీవ్ర అస్వస్థతకు (Healt Problem) గురై హాస్పిటల్‌లో జాయిన్ అయింది.. వైద్యులు అన్ని పరీక్షలు చేసి షాకింగ్ విషయం చెప్పారు.. ఆ యువతి పెద్ద పేగులు (Large Intestine) పాడైపోయాయని, సర్జరీ చేయాలని చెప్పారు.. దీంతో ఆ యువతి పెళ్లిపై ఆశలు వదిలేసుకుంది.. తననెవరూ పెళ్లి చేసుకోరని నిరాశ పడింది.. అయితే వరుడు ఆమెకు షాకిచ్చాడు.
ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) రాయ్‌పూర్‌కు చెందిన లక్ష్మి అనే యువతికి గత గురువారం శక్తి జిల్లాకు చెందిన రాజ్‌తో వివాహం జరగాల్సి ఉంది. అయితే పెళ్లికి వారం రోజుల ముందు లక్ష్మి అనారోగ్యానికి గురైంది. ఆమె పెద్ద పేగులు పాడైపోయాయని, ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. దీంతో లక్ష్మి కుటుంబ సభ్యులు పెళ్లిపై ఆశలు వదిలేసుకున్నారు. లక్ష్మి కూడా తననెవరూ పెళ్లి చేసుకోరని నిరాశలో కూరుకుపోయింది. అయితే రాజ్ మాత్రం వెనకడుగు వేయలేదు. అనుకున్న సమయానికి లక్ష్మిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
Viral News: నీ మంచి మనసుకు హ్యాట్సాఫ్ తల్లీ.. రిక్షా ఎక్కిన తర్వాత ఈ మహిళ చేసిన పనికి నెట్టింట ప్రశంసల వర్షం..!
హాస్పిటల్‌లోనే పెళ్లి చేసుకుందామని ప్రతిపాదించాడు. లక్ష్మి, ఆమె కుటంబ సభ్యులు ఎంతో సంతోషించి హాస్పిటల్ యాజమాన్యానికి విషయం చెప్పారు. యాజమాన్యం ఎంతో సంతోషించి వారి పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు హాస్పిటల్‌లోనే చేశారు. హాస్పిటల్‌లోనే లక్ష్మి మెడలో రాజ్ తాళి కట్టాడు. అక్కడే ఆమెతో కలిసి ఏడడుగులు వేశాడు. ఈ పెళ్లి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది (Viral News).